hyderabadupdates.com Gallery ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్

ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్

ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్  కోచ్ గౌతమ్ గంభీర్ post thumbnail image

న్యూఢిల్లీ : భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌నంగా మారాడు. త‌న ప‌ద‌వీ కాలం త్వ‌ర‌లో ముగియ‌నుంది. త‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో భార‌త జ‌ట్టు ఈ ఏడాది జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకుంది. విశ్వ విజేత‌గా నిలిచింది. ఇక రాబోయే కాలంలో ఐసీసీ ఆధ్వ‌ర్యంలో వ‌న్డే వ‌ర‌ల్డ్ క‌ప్ జ‌ర‌గ‌నుంది. దీంతో పాటు ఒలింపిక్స్ లో కూడా క్రికెట్ ను ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. ఇందులో కూడా స‌త్తా చాటాల‌ని, మెడ‌ల్ సాధించాలని భావిస్తున్నాడు గంభీర్. ఇక ప్ర‌స్తుతానికి టి20 జ‌ట్టు బాగానే ఉన్నా ఇంకా లోపాలు ఉన్నాయ‌ని , కొంద‌రు ఆట‌గాళ్ల‌ను మార్చే ఛాన్స్ ఉంద‌ని టాక్. ఈ త‌రుణంలో ప్ర‌స్తుతం అంద‌రి క‌ళ్లు వ‌న్డే జ‌ట్టుపై ఉంది. దీనికి కార‌ణం విరాట్ కోహ్లీ, రోహిత్ శ‌ర్మ‌ల ఆట తీరును నిశితంగా గ‌మ‌నించ‌నున్నాడు హెడ్ కోచ్.
ఇందులో భాగంగా చాలా మంది ఆట‌గాళ్ల‌కు ఉద్వాస‌న ప‌లికే ఛాన్స్ ఉంద‌ని స‌మాచారం. వన్డే జట్టు కోసం ఇప్పటికే 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేశారు. రాబోయే ఐపీఎల్‌లో వారి ప్రదర్శనను సెలెక్టర్లు, గౌతమ్ గంభీర్ నిశితంగా పరిశీలించ‌నున్నారు. రోహిత్ శర్మ స్థానంపై ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. ఐపీఎల్‌లో రాణించాలని, లేకపోతే ఆ స్థానాన్ని చేపట్టడానికి యశస్వి జైస్వాల్ సిద్ధంగా ఉన్నారని గంభీర్ స్పష్టం చేసినట్లు సమాచారం. 4వ స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌కు ఒక పెద్ద అవకాశం లభించవచ్చు.షార్ట్ బాల్‌ను ఎదుర్కోవడంలో శ్రేయస్ అయ్యర్ బలహీనతపై జట్టు యాజమాన్యం ఆందోళన చెందుతోంది. ఇక కోహ్లీ స్థానానికి ఢోకా లేదు. త‌ను 3వ స్థానంలో ఇన్నింగ్స్‌ను ప్రారంభించ‌నున్నాడు. మహమ్మద్ షమీ ప్రపంచ కప్‌కు దూరమయ్యే అవకాశం ఉంది.
The post ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌CM Revanth Reddy: కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉంది – సీఎం రేవంత్‌

    కేసీఆర్‌, బీజేపీల మధ్య చీకటి ఒప్పందం ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కేసీఆర్‌కు లొంగకపోతే, రెండు పార్టీల మధ్య ఫెవికాల్‌ బంధం లేకపోతే జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ తేదీలోగా కాళేశ్వరం కేసులో సీబీఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు

మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తిమ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల గురించి ప్ర‌స్తావించారు. వారు లేక‌పోతే ఈ స‌మాజం మ‌నుగ‌డ సాధించ‌ద‌ని పేర్కొన్నారు. వారు బాగుంటేనే అభివృద్ది సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం

గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్ర‌క‌ట‌నగవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌ 2024 సంవత్సరంలో మొదటిసారిగా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు , సంస్కృతి రంగాలలో వ్యక్తులకు , సంస్థలకు గ‌త ఏడాది గ‌ణ‌తంత్ర