ఏకంగా 240 సీట్లు. ఇక్కడ పాగా వేయాలన్నది కమల నాథుల సుదీర్ఘ సంకల్పం. అందుకే.. నానా తిప్పలు పడి.. ఇతర పార్టీలతో చెలిమి చేశారు. ఎన్నికలకు ముందు కొన్ని పార్టీలతో జట్టు కట్టారు. సో.. మొత్తంగా `ఎన్డీయే` కూటమిని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కూటమి అధికారంలోకి వస్తే… బీజేపీ వచ్చినట్టే. అదే.. తమిళనాడు రాష్ట్రం. వచ్చే నెల 23న ఇక్కడ పోలింగ్ జరగనుంది. అయితే.. ఈ ఎన్డీయే కూటమిలో తాజాగా సీట్ల సర్దుబాటు జరిగింది. దీనిలో బీజేపీకి దక్కిన సీట్లు .. కేవలం 27. ఆశ్చర్యం లేదు.. మొత్తం 240 సీట్లలో బీజేపీకి కేటాయించిన స్థానాలు 27 మాత్రమే.
కూటమిలో ఎవరెవరు?
ఎన్డీయే కూటమిలో ప్రధానపార్టీ అన్నాడీఎంకే. దీనికి మాజీ సీఎం పళని స్వామి నేతృత్వం వహిస్తున్నారు. ఇక, బీజేపీ రెండో భాగస్వామి. మూడు.. పట్టలి మక్కల్ కట్చి(పీఎంకే), అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం (ఏఎంఎంకే) దీని సారథి టీటీవీ దినకరన్. వీరితో పాటు చిన్నా చితకా పార్టీలు కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ కూటమి 240 సీట్లను తాజాగా పంచుకుంది.
ఎవరెవరికి ఎన్నెన్ని?
బీజేపీకి = 27పీఎంకే = 18ఏఎంఎంకే = 11అన్నాడీఎంకే = 184
రీజనేంటి?
బీజేపీకి సీట్లలో కోతపెట్టడానికి కారణం.. రాష్ట్ర వ్యాప్తంగా మోడీ ప్రభావం ఉన్నా.. పార్టీ పరంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలు లేరు. పైకి చెబుతున్నట్టుగా అయితే.. రాష్ట్రంలో కమల నాథుల పరిస్థితి కూడా పాజిటివ్‌గా లేదు. ఈ నేపథ్యంలో పూర్తిగా పోటీ చేసినా..లేదా మరిన్ని స్థానాలుతీసుకున్నా.. పోటీకి నిలిపేందుకు అభ్యర్థులు కరువయ్యే పరిస్థితి.
పైగా.. బలమైన నాయకులను కూడా గత ఎన్నికల్లో ప్రజలు ఓడించారు. ఇక, ఇప్పుడు కూటమి కట్టడంతో పార్టీల మధ్య సీట్ల పంపిణీ మరింత క్లిష్టతరంగా మారింది. ఈ నేపథ్యంలోనే సర్దుకుపోయారు. అయితే.. గత 2021లో జరిగిన ఎన్నికలతోపోలిస్తే.. బీజేపీకి 7 స్థానాలు అధికంగానే ఇచ్చామని అంటున్నారు.