hyderabadupdates.com Gallery అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి

అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి post thumbnail image

అమరావతి : కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి, వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడు దొమ్మేటి వెంకటరెడ్డి అని, ఆయన జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీచేసినట్లు వెల్ల‌డించారు. శెట్టి బలిజల పితామహుడిగా పేరుగాంచిన వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగ నిర్వహించాలని నిర్ణయించడంపై సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేశ్ కు ఆమె ధన్యవాదాలు తెలియ చేశారు. కోనసీమ ప్రాంతానికి చెందిన దొమ్మేటి వెంకటరెడ్డి శెట్టి బలిజ సమాజంలో విద్య, ఐక్యత, ఆత్మ గౌరవం కోసం విశేషంగా కృషి చేసిన గొప్ప సంస్కర్తని కొనియాడారు.
విద్య ప్రాముఖ్యతను చాటిచెప్పి, సామాజిక చైతన్యానికి బాటలు వేశారన్నారు. కోనసీమలో అట్టడుగు వర్గాల విద్యాభివృద్ధికి, ఆత్మగౌరవం కోసం పోరాడిన యోధుడన్నారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో వయోజన విద్యకు కృషి చేసిన మేధావి అని కొనియాడారు. ఆయన చేసిన సేవలను భవిష్యత్తు త‌రాల‌కు తెలియ జేయాలన్న లక్ష్యంతో దొమ్మేటి జయంతిని అధికారికంగా నిర్వహించాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారన్నారు. ఎన్నికల ముందు నిర్వహించిన పాదయాత్రలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని అధికారికంగా నిర్వహిస్తామని అప్పట్లో మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి, దొమ్మేటి వెంకటరెడ్డి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసిందన్నారు. ఇక నుంచి ప్ర‌తి ఏటా మార్చి 23న దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి చేసిన సేవ‌ల‌కు గుర్తింపుగా ఆయ‌న జ‌యంతిని ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో అధికారికంగా నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించారు.
The post అట్ట‌డుగు వ‌ర్గాల ఆశాజ్యోతి దొమ్మేటి వెంక‌ట్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్ర‌క‌ట‌నగవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్ర‌క‌ట‌న

హైద‌రాబాద్ : రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వ‌ర్మ‌ 2024 సంవత్సరంలో మొదటిసారిగా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు , సంస్కృతి రంగాలలో వ్యక్తులకు , సంస్థలకు గ‌త ఏడాది గ‌ణ‌తంత్ర

TTD: టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామంTTD: టీటీడీ పరకామణి చోరీ కేసులో మరో కీలక పరిణామం

TTD : టీటీడీ పరకామణి చోరీ కేసుపై ఆంధ్రప్రదేశ్ (AP) హైకోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. ఈ క్రమంలో కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకి హైకోర్టు (High Court) నోటీసులు జారీ చేసింది. న్యాయస్థానం నోటీసులు జారీ చేసిన వారిలో దేవాదాయ

తిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోంతిరుమల పవిత్రతతో ఆటలాడితే ఊరుకోం

​కాకినాడ రూరల్ : తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం నెయ్యి కల్తీ వ్యవహారంలో గత వైసీపీ ప్రభుత్వం చేసిన చారిత్రక తప్పిదం ఇప్పుడు సిబిఐ ఛార్జ్‌షీట్ ద్వారా బట్ట బయలైందని , దీని నుంచి తప్పించు కోవడానికి అంబటి రాంబాబు కొత్త