hyderabadupdates.com Gallery ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి

ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి

ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి post thumbnail image

హైద‌రాబాద్ సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సోమ‌వారం శాస‌న మండ‌లిలో ఆయ‌న కీల‌క అంశాల గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. దేశంలో ఎన్నో నగరాలున్నా ప్రధానంగా ఐదు నగరాల గురించి మాత్రమే చర్చించుకుంటాం అన్నారు. పొలిటికల్ రాజధానిగా ఢిల్లీ, ఫైనాన్షియల్ కేపిటల్ ముంబై, బెంగుళూరు, చెన్నై తో పాటు ఐటీకి కేరాఫ్ గా హైద‌రాబాద్ గుర్త‌కు వ‌స్తుంద‌న్నారు. పొలిటికల్ కేపిటల్ గా ఉన్న ఢిల్లీలో కాలుష్యం కారణంగా పాఠశాలలకు, ఆఫీసులకి సెలవులు ఇస్తున్నారని చెప్పారు. ముంబై లో వర్షాలు వస్తే బ‌తికే ప‌రిస్థితి లేకుండా పోయింద‌న‌న్నారు. ఫైనాన్షియల్ కేపిటల్ గా ఉన్న ముంబైలో నివసించలేని పరిస్థితి నెల‌కొంద‌న్నారు సీఎం. బెంగుళూరులో విపరీతమైన ట్రాఫికక్, చెన్నైలో వరదలతో ఇబ్బందులు పడే దుస్థితి నెల‌కొంద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.
హైదరాబాద్ రాక్స్ అండ్ లేక్స్ సిటీ అని గుర్తు చేశారు. అది ఓల్డ్ సైట్ అని మనం చెప్పుకుంటున్నప్ప‌టికీ అది ఒరిజినల్ సిటీ అని కుండ బ‌ద్ద‌లు కొట్ఆరు. చార్మినార్, గుల్జార్ హౌస్, మనం ఉన్న శాసన మండలి ఎన్నో చారిత్రక కట్టడాలు నగరంలో ఉన్నాయన్నారు. ఇలాంటి ఘన చరిత్ర ఉన్న నగరంలో మానవ తప్పిదాలతో సమస్యలు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా వాహనాల సంఖ్య పెరిగింద‌న్నారు. వీటికి పార్కింగ్ సదుపాయం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంద‌న్నారు సీఎం. రవాణాలో రోడ్లు, రైల్వే, ఎయిర్ పోర్టు, పోర్టు కీలకం కానున్నాయ‌ని తెలిపారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, చర్లపల్లి రైల్వేస్టేషన్ అభివృద్ధి చేసుకున్నాం , మెట్రోను నిర్మించుకున్నాం.. దేశంలో వీటన్నింటిని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రైజింగ్ 2047 ప్రణాళికతో ముందుకు వెళుతున్నాం అని చెప్పారు రేవంత్ రెడ్డి.
The post ప్ర‌జ‌ల్లో అపోహ‌లు సృష్టించే ప్ర‌య‌త్నాలు మానుకోవాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలుకొత్త జిల్లాల ప్రాతిపదికన జడ్పీ ఎన్నికలు

అమ‌రావ‌తి : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా జడ్పీ ఎన్నికలను విభజించిన జిల్లాల ప్రాతిపదికన నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్. ఇందుకు అనుగుణంగా కసరత్తు జరుగుతోందని పేర్కొన్నారు. పంచాయతీల పునర్విభజన పైనా న్యాయపరమైన అడ్డంకులు

భ‌క్త జ‌న సందోహం భోగితేరు ఊరేగింపు ఉత్స‌వంభ‌క్త జ‌న సందోహం భోగితేరు ఊరేగింపు ఉత్స‌వం

తిరుప‌తి : తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మహాశివరాత్రి పర్వదినం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా క్యూలైన్లు, చలువ పందిళ్లు, పార్కింగ్ ప్ర‌దేశాలు ఏర్పాటు చేశారు. ఆలయంలో ఉద‌యం 6 గంట‌ల‌కు