hyderabadupdates.com movies జన నాయకుడికి చిక్కులు తప్పవా

జన నాయకుడికి చిక్కులు తప్పవా

ఇటీవలే తమిళనాడు రాష్ట్రం కరూర్ లో విజయ్ రాజకీయ సభ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో నలభై ప్రాణాలు గాలిలో కలిసిపోవడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం, ప్రతిపక్షాలు ఒకరిమీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నాయి. డ్యామేజ్ ని తగ్గించే ఉద్దేశంతో విజయ్ వదిలిన వీడియో మెసేజ్ కు సానుకూలత, వ్యతిరేకత రెండూ రావడం ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. చనిపోయిన వాళ్లకు క్షమాపణ చెప్పడం కన్నా స్టాలిన్ సర్కార్ తన పార్టీ వ్యక్తులను టార్గెట్ చేయడం పట్ల విచారం వ్యక్తం చేయడమే ఎక్కువగా కనిపించిందని కొందరు విమర్శించడం సోషల్ మీడియాలో వైరలయ్యింది.

ఈ ఘటన తాలూకు ప్రభావం జనవరి 9 విడుదల కాబోయే జన నాయకుడు మీద ఉంటుందని అభిమానులు అనుమాన పడుతున్నారు. అపోజిషన్ పార్టీలు ఏకమై ఈ సినిమాని బ్యాన్ చేయమని డిమాండ్ చేస్తారని వాళ్ళ అనుమానం. లీగల్ గా నిషేధించడానికి ఛాన్స్ లేదు కానీ రకరకాల మార్గాల్లో అడ్డుకునే అవకాశాలు లేకపోలేదు. అసలే కరూర్ ప్రమాదం వెనుక కుట్ర ఉందని, ఏకంగా రూలింగ్ పార్టీ మీదే అనుమానం వచ్చేలా మాట్లాడుతున్న విజయ్ కు దాని సెగలు సినిమా రిలీజ్ టైంలో ఎదురుకావొచ్చు. సెన్సార్ తో మొదలుపెట్టి థియేటర్ల కేటాయింపు దాకా సవాలక్ష సమస్యలను చవి చూడాల్సి రావొచ్చు.

తన రాజకీయ ప్రవేశానికి ముందు చేసిన చివరి సినిమాగా జన నాయకుడుకి విజయ్ చాలా బజ్ తీసుకొచ్చాడు. హెచ్ వినోత్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా మన భగవంత్ కేసరి రీమేకనే ప్రచారం కొన్ని నెలల క్రితం బలంగా తిరిగింది. ఒకవేళ పాయింట్ కొంచెం తీసుకున్నప్పటికీ ట్రీట్ మెంట్ పూర్తిగా వేరు ఉంటుందని కోలీవుడ్ టాక్. అయితే పొలిటికల్ గా ఇందులో చాలా సెటైర్లు, సంఘటనలు ఉంటాయని అంతర్గతంగా వినిపిస్తున్న మాట. అదే నిజమైతే డీఎంకే నేతలు ఊరికే ఉండరు. ఖచ్చితంగా అడ్డుకుంటారు. రాబోయే నెలల్లో జరిగే పరిణామాలు చాలా ఆసక్తికరంగా ఉండబోతున్నాయనేది వాస్తవం.

Related Post

కుంభతో సర్ప్రైజ్… మందాకినితో షాక్కుంభతో సర్ప్రైజ్… మందాకినితో షాక్

దర్శకధీర రాజమౌళి ఈసారి ఏ మాత్రం ఊహకందని విధంగా ప్రమోషన్లు చేస్తున్నారు. అలాని ఏదో హడావిడి చేస్తున్నారని కాదు. చాలా సైలెంట్ గా ఫస్ట్ లుక్స్ వచ్చేస్తున్నాయి. చెప్పా పెట్టకుండా శృతి హాసన్ పాడిన పాటను రిలీజ్ చేశారు. పృథ్విరాజ్ సుకుమారన్

“Karmanye Vadhikaraste” — A Gripping Thriller Hitting Theatres on October 31“Karmanye Vadhikaraste” — A Gripping Thriller Hitting Theatres on October 31

Ushaswini Films is all set to thrill audiences with its latest investigative mystery, “Karmanye Vadhikaraste,” releasing in theatres on October 31. The film stars versatile actors Brahmaji, Shatru, and Master