hyderabadupdates.com Gallery దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు

దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు

దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు post thumbnail image

అన‌కాప‌ల్లి : అన‌కాప‌ల్లి నియోజ‌వ‌ర్గంలోని పాయ‌క‌రావుపేట‌లో భారీ ఉక్కు ప‌రిశ్ర‌మ స్థాప‌న‌కు శంకుస్థాప‌న చేశారు. ఈ సంద‌ర్బంగా ఆర్సెలార్ మిట్ట‌ల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మాట్లాడారు. ఏపీలో ఓ భారీ స్థాయి స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు ఇవాళ అంకురార్పణ చేశాం అన్నారు. ఈ ఏడాది తర్వాత 20 వార్షికోత్సవం నిర్వహించుకుంటున్న ఆర్సెలార్ మిట్టల్ సంస్థకు ఈ ప్లాంట్ ఓ కలికి తురాయి అవుతుందన్నారు. నేను జన్మించిన నా భారత దేశంలో ఈ స్థాయిలో పెట్టుబడులు పెట్టి ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తున్నందుకు గ‌ర్వ‌కార‌ణంగా ఉంద‌న్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రూపకల్పన చేసిన ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ కార్యక్రమంలో ఇది ఆరంభం మాత్రమేన‌ని అన్నారు ల‌క్ష్మీ నివాస్ మిట్ట‌ల్.
మౌలిక సదుపాయాలు, ఉత్పత్తి పరిశ్రమలు, రక్షణ రంగ ఉత్పత్తులు ఇలా వేర్వేరు రంగాలకు అవసరమైన స్టీల్ ఉత్పత్తులు తయారవుతాయని చెప్పారు. ఏడాదికి 8 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్ధ్యంతో దేశ అవసరాలకు అనుగుణంగా ఈ ప్లాంట్ నిర్మాణం చేపడుతున్నాం అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజన్ కు అనుగుణంగా పారిశ్రామిక ప్రగతికి ఈ ప్లాంట్ తోడ్పడుతుందని ఆశిస్తు్న్నానని పేర్కొన్నారు . పారిశ్రామిక వేత్తల్లో విశ్వాసం నింపేలా ఏపీలోని విధానాలు ఉన్నాయని ప్ర‌శంస‌లు కురిపించారు. ఏపీ ప్రగతి సాధించేందుకు తీసుకున్న నిర్ణయాలు దోహ‌ద ప‌డ‌తాయ‌ని చెప్పారు. భ‌విష్య‌త్తులో దేశంలోని ప‌లు ప్రాంతాల‌లో మ‌రికొన్ని కంపెనీల‌ను ఏర్పాటు చేస్తామ‌ని ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు లక్ష్మీ నివాస్ మిట్ట‌ల్.
The post దేశ అవ‌స‌రాల కోసం ఉక్కు ప‌రిశ్ర‌మ ఏర్పాటు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Mallikarjun Kharge: ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలి – మల్లికార్జున్ ఖర్గేMallikarjun Kharge: ఆర్ఎస్ఎస్‌ను నిషేధించాలి – మల్లికార్జున్ ఖర్గే

Mallikarjun Kharge : రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై నిషేధం విధించాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి డిమాండ్ చేశారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని అన్నారు. ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలలో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనకుండా సర్దార్ వల్లభ్‌భాయ్

YS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖYS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

    కృష్ణా జలాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్… ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. ట్రిబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించి… ఏపీకు

Bomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులుBomb Threat: ఆరు ఎయిర్‌పోర్టులకు బాంబు బెదిరింపులు

  ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన బాంబు పేళుళ్ళతో దేశం అట్టుడుకుతున్న వేళ… పలు ఇండిగో విమానాలకు బాంబు బెదిరింపులు కలకలం సృష్టించాయి. బుధవారం గురుగ్రామ్‌లోని ఇండిగో ప్రధాన కార్యాలయానికి దుండగులు బాంబు బెదిరింపు మెయిళ్లు పంపారు. అందులో దిల్లీ, కోల్‌కతా,