hyderabadupdates.com Gallery ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేష‌న్

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేష‌న్

ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేష‌న్ post thumbnail image

విజయవాడ: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (APL) 2026-27 సీజన్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి మాజీ మంత్రి, ఏపీ అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ సుజయ్ కృష్ణ రంగారావు నామినేషన్ దాఖలు చేశారు. విజయవాడలోని ఏసీఏ కార్యాలయంలో ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను క‌లిశారు. తన నామినేషన్ పత్రాలను అధికారికంగా అందజేశారు. గత సీజన్ (2025-26)లో సుజయ్ కృష్ణ రంగారావు నేతృత్వంలో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ అద్భుతంగా క్రీడాభిమానుల్ని ఆకట్టుకుంది. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు ప్రోత్సాహం అందించింది. క్రీడాకారుల ఎంపిక నుంచి టోర్నమెంట్ నిర్వహణ వరకు ఆయన చూపిన చొరవతో ఏపీఎల్ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఆ అనుభవాన్ని, విజయ పరంపరను కొనసాగించాలనే సంకల్పంతో ఈ ఏడాది కూడా ఆయన చైర్మన్ పదవికి పోటీ చేస్తున్నారు.
ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఎన్నికల ప్రక్రియను ఈ ఏడాది ఏప్రిల్ 5వ తేదీన నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి వెల్లడించారు. రాష్ట్రంలోని క్రికెట్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు, గ్రామీణ స్థాయి ప్రతిభను ప్రోత్సహించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా సుజయ్ కృష్ణ రంగారావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీ స‌ర్కార్ సైతం త‌న‌ను ప్రోత్స‌హిస్తుండ‌డంతో ఇక ఈ ఎన్నిక కేవ‌లం లాంఛ‌న‌ప్రాయం కానుంది. ఇదిలా ఉండ‌గా ప్ర‌స్తుతం ఆంధ్రా క్రికెట్ అసోసియేష‌న్ కు అధ్యక్షుడిగా విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని ఉన్నారు. ఇప్ప‌టికే బీసీసీఐతో స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తున్నారు. క్రికెట్ పై ఫోక‌స్ ఉండాల‌ని సూచించారు మంత్రి నారా లోకేష్‌.
The post ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ పదవికి నామినేష‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అక్రమ కేసులపై ఎంపీ గురుమూర్తి ఆగ్రహంఅక్రమ కేసులపై ఎంపీ గురుమూర్తి ఆగ్రహం

న్యూఢిల్లీ : తిరుపతి, సూళ్లూరుపేట నియోజకవర్గాల పరిధిలో పోలీసులు నమోదు చేసిన అక్రమ కేసులపై తిరుపతి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ మద్దిల గురుమూర్తి ఢిల్లీ నుంచి స్పందించారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు ఢిల్లీలో ఉన్న ఆయన ఈ ఘటనలపై తీవ్ర

అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌అభిషేక్ శ‌ర్మ‌కు అమ్మాయిల ఫ్యాన్స్ ఎక్కువ‌

కేర‌ళ : యంగ్ క్రికెట‌ర్ అభిషేక్ శ‌ర్మ గురించి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు కేర‌ళ స్టార్ ప్లేయ‌ర్ సంజు శాంస‌న్. ప్ర‌ముఖ మీడియా సంస్థ ఇండియా టుడే నిర్వ‌హించిన కాన్ క్లేవ్ లో అభిషేక్ శ‌ర్మ‌తో పాటు సంజు శాంస‌న్ పాల్గొన్నాడు.

CM Stalin: ఎస్‌ఐఆర్‌ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్‌ ఆగ్రహాంCM Stalin: ఎస్‌ఐఆర్‌ పై అన్నాడీఎంకే వైఖరిపై సీఎం స్టాలిన్‌ ఆగ్రహాం

    ఓటర్ల జాబితా ప్రత్యేక ముమ్మర సవరణ (సర్‌)కు మద్దతుగా అన్నాడీఎంకే సుప్రీంకోర్టును ఆశ్రయించడం సిగ్గుచేటని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్‌ విమర్శించారు. తన సొంత నియోజకవర్గం కొళత్తూర్‌లో శుక్రవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశవాసులు సైతం తాము