hyderabadupdates.com Gallery తెలంగాణ లో ఆర్టీసీ మరింత విస్తరించే దిశగా చర్యలు

తెలంగాణ లో ఆర్టీసీ మరింత విస్తరించే దిశగా చర్యలు

తెలంగాణ లో ఆర్టీసీ మరింత విస్తరించే దిశగా చర్యలు post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్డు, ర‌వాణా శాఖ మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ మ‌రింత విస్త‌రించే దిశ‌గా చ‌ర్య‌లు తీసుకుంటుంద‌న్నారు. ఆర్టీసీ బస్ స్టేషన్ లలో మౌలిక సదుపాయాలు, కొత్త రూట్ లు , కొత్త బస్సుల పై ఆర్టీసీ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు తో ముఖాముఖిలో మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్ల‌డించారు. మహా లక్ష్మీ పథకం తో పెరుగుతున్న రద్దీ తో ఆర్టీసీ మరింత విస్తరించే దిశగా చర్యలు తీసుకుందన్నారు. ఇందుకోసం మూడు రోజుల పాటు రవాణా , బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ నేతృత్వంలో అసెంబ్లీ కమిటీ హాల్ -1 లో ఉమ్మడి జిల్లాల వారిగా ఇంచార్జి మంత్రి, జిల్లా మంత్రులు ,ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలతో, ఆర్టీసీ ఎండీ ఈడి లు, ఆర్ఎం లు సమావేశం నిర్వహించారు. మూడు రోజుల పాటు జరుగుతున్న సమావేశంలో తొలి రోజు ఉమ్మడి నల్గొండ ,మెదక్ ,రంగారెడ్డి , గ్రేటర్ హైదరాబాద్ జిల్లాల ప్రజా ప్రతినిధులు వారి నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకొచ్చారు. ప్రజా ప్రతినిధులు లేవనెత్తిన అంశాలు ఆర్టీసీ అధికారులు నివేదిక రూపొందిస్తున్నారు.
నల్గొండ జిల్లా నుండి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,ఎమ్మెల్యేలు వేముల వీరేశం, బాలు నాయక్ , జయవీర్ రెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి లు పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో మహా లక్ష్మీ పథకం విజయవంతంగా కొనసాగుతుందని, ప్రపంచంలోనే ఆర్టీసీకి గొప్ప చరిత్ర ఉందని కొనియాడారు. రాష్ట్రంలో అవసరమైన నూతన బస్సుల కొనుగోలు , కొత్త రూట్ లలో బస్సులు నడపడం, ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం పై మంత్రి పొన్నం ప్రభాకర్ కి అండగా ఉంటామని తెలిపారు. కోదాడ ,హుజూర్ నగర్ బస్ స్టేషన్ ల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని సూచించారు. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి గుర్రం గూడ లో నైట్ హాల్ట్ బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని , మిర్యాల గూడా హలియా,మైసంపల్లి మధ్య అదనపు బస్సులు నడపాలని కోరారు.
తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల శ్యాముల్ తుంగతుర్తి కీ చుట్టు 50 కిలోమీటర్ల దూరంలో ఆర్టీసీ బస్సు డిపో లేదని తమకు డిపో మంజూరు చేయాలని కోరగా ప్రస్తుతం కొత్త డిపో ల ప్రస్తావన లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సూర్యాపేట , హనుమకొండ ,యాదగిరి గుట్ట బస్సులు మోత్కూరు ,తుంగతుర్తి లో ఆగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.అన్నారం మేజర్ గ్రామ పంచాయతీ నైట్ హాల్ట్ బస్సు ఏర్పాటు చేయాలని కోరారు. హైవే ల వద్ద మేజర్ గ్రామ పంచాయతీ లపై బస్ షెల్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. ఎమ్మెల్యే ఎస్డీఎఫ్ ఫండ్స్ నుండి నిర్మిస్తే తాము మరిన్ని కొత్త బస్సులు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
నకిరేకల్ నియోజకవర్గంలో మదీరా, కొత్తగూడెం ,ఖమ్మం బస్సులు నకిరేకల్ పట్టణం గుండా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు. వెంటనే రూట్ సర్వే నిర్వహించి బస్సులు పట్టణం గుండా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. హయత్ నగర్ నుండి పల్లె వెలుగు చిట్యాల వరకు వేయాలని కోరారు. నియోజకవర్గంలో కొత్త రూట్లలో బస్సులు నడిపించాలని సూచించారు. దేవరకొండ లో ఉన్న పాత బస్ డిపో ను పునర్నిర్మాణం చేయాలని ఎమ్మెల్యే బాలు నాయక్ కోరారు. విద్యార్థులకు స్కూల్ కాలేజీల సమయంలో బస్సులు పెంచాలని కోరారు. భువనగిరి నియోజకవర్గంలో కొండమాడు వద్ద బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.భవనగిరి బస్ స్టేషన్ లో గతంలో సాయంత్రం రద్దీగా ఉండేదని ఆరు సిటీ బస్సులు వేయడం వల్ల రద్దీ తగ్గిందని మరిన్ని బస్సులు కావాలని కోరారు.
The post తెలంగాణ లో ఆర్టీసీ మరింత విస్తరించే దిశగా చర్యలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోనుఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను

న్యూఢిల్లీ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌మాన్ అవార్డుల ప్ర‌దానోత్సం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త జ‌ట్టు త‌ర‌పున

తెలంగాణ అస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోంతెలంగాణ అస్తిత్వానికి భంగం క‌లిగిస్తే ఊరుకోం

హైద‌రాబాద్ : తెలంగాణ ప్రాంత‌పు అస్తిత్వానికి భంగం క‌లిగించేలా ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. శ‌నివారం హైద‌రాబాద్ లోని తెలంగాణ భ‌వ‌న్ లో మీడియాతో మాట్లాడారు. చారిత్రకంగా హైదరాబాద్–సికింద్రాబాద్ జంట