hyderabadupdates.com Gallery స్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యం

స్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యం

స్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యం post thumbnail image

కుప్పం : స్వర్ణ కుప్పం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభవృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు పలు గ్రామాల్లో నారా భువనేశ్వరి పర్యటించారు. కుప్పం డిగ్రీ కాలేజ్ లో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నారు. గుడిపల్లి మండలం పెద్ద కోటమకనపల్లి గ్రామంలో పర్యటించిన మహిళలతో సమావేశమయ్యారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయం అన్నారు. విద్యార్థులు వినూత్నంగా ఆలోచించాలి. భవిష్యత్ పై స్పష్టత ఉండాలన్నారు. యువత స్వశక్తితో ఎదగాలి. కష్టాన్ని నమ్ముకోవాలి. లక్ష్యం ఉంటే ఏదైనా సాధించవచ్చు. నాడు విజన్ 2020, నేడు విజన్ 2047 లక్ష్యంతో సీఎం చంద్రబాబు పని చేస్తున్నారు. ఒక నాయకుడిని నమ్మి ఓటేస్తే ఏం జరిగిందో గత ఐదేళ్లలో మనం చూశామ‌న్నారు.
చంద్రబాబు ఇచ్చిన మాట తప్పరు. ఓట్ల కోసం హామీలు ఇవ్వరు. ప్రజల కోసం నిలబడతారు. నేను ఏం చేయగలనో అదే హామీ ఇస్తానని చంద్రబాబు నాతో చెబుతూ ఉంటారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. 20 లక్షల ఉద్యోగ కల్పన లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. గృహిణిగా ఉన్న నేను హెరిటేజ్ బాధ్యతలను సవాల్ గా తీసుకున్నాను. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కోవాలి. ప్రతి దానికీ అసంతృప్తికి లోను కాకూడదు. కష్టపడి పనిచేస్తే ఎన్నో అవకాశాలు వస్తాయన్నారు నారా భువ‌నేశ్వ‌రి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లలను చదివిస్తారు. ప్రయోజకులు కావాలని , భవిష్యత్ బాగుండాలని తాపత్రయపడతారు. పిల్లలు జీవితంలో ఉన్నతంగా స్థిరపడితే ముందుగా సంతోషించేది తల్లిదండ్రులే. చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటంతో నా కుమారుడు లోకేష్ పెంపకం, చదువు బాధ్యత నేనే చూసుకున్నాను. ఏది మంచి, ఏది చెడు అనేది చెప్పి పెంచానని నారా భువనేశ్వరి అన్నారు. జాబ్ మేళా సందర్భంగా పలు కంపెనీల ప్రతినిధులతో భువనేశ్వరి సమావేశమాయ్యారు.
The post స్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

తిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎంతిరుమ‌ల శ్రీ‌వారిని ద‌ర్శించుకున్న సీఎం

తిరుమల : కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఆయ‌న‌తో పాటు కుటుంబ స‌భ్యులు కూడా ఉన్నారు. ఇదిలా ఉండ‌గా ముఖ్యమంత్రి హోదా లో మహా ద్వారం ప్రవేశ అవకాశం ఉన్నా సామాన్య భక్తుల్లా

వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్య‌తవ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్య‌త

అమ‌రావ‌తి : వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు యాంత్రీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2014–2019 మధ్య తెదేపా హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.987.71 కోట్ల సబ్సిడీతో 50% రాయితీపై వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు వ్యక్తిగతంగా అందించామని

వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులువ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు

ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతరకు భ‌క్తులు పోటెత్తారు. ఆ ప్రాంగ‌ణ‌మంతా స‌ముద్రాన్నిత‌ల‌పింప చేస్తోంది. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండ‌గా గురువారం కేంద్ర గనుల శాఖ