hyderabadupdates.com Gallery తెలంగాణ‌లో 40 రైల్వే స్టేష‌న్ల అభివృద్ది

తెలంగాణ‌లో 40 రైల్వే స్టేష‌న్ల అభివృద్ది

తెలంగాణ‌లో 40 రైల్వే స్టేష‌న్ల అభివృద్ది post thumbnail image

హైద‌రాబాద్ : శ్రీ‌రామ న‌వమి పండుగ వేళ తీపి క‌బురు చెప్పింది కేంద్రం తెలంగాణ రాష్ట్రానికి . అమృత్ భార‌త్ ప‌థ‌కం కింద రాష్ట్రంలోని 40 రైల్వే స్టేష‌న్ల‌ను ఎంపిక చేసిన‌ట్లు తెలిపింది. ఈ ప‌థ‌కం కింద ఎంపిక చేసిన వాటిని అభివృద్ది చేయ‌నుంది. ఈ సంద‌ర్బంగా కీల‌క వివ‌రాలు వెల్ల‌డించారు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణ‌వ్. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఆరు రైల్వే స్టేషన్లు బేగం పేట‌, హఫీజ్‌పేట, కరీంనగర్, రామగుండం, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ , వరంగల్ వ‌ద్ద‌ అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు. భారతీయ రైల్వే ఇప్పటి వరకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి కోసం 1338 స్టేషన్లను గుర్తించిందన్నారు. వీటిలో 40 స్టేషన్లు తెలంగాణలో ఉన్నాయ‌ని వెల్ల‌డించారు.
ఇక‌ ఈ 40 స్టేషన్లలో ఆదిలాబాద్, బాసర, బేగంపేట, భద్రాచలం రోడ్, గద్వాల్, హఫీజ్‌పేట, హైటెక్ సిటీ, ఉప్పుగూడ, హైదరాబాద్, జడ్చర్ల, జనగాం, కాచిగూడ, కామారెడ్డి, కరీంనగర్, కాజీపేట జంక్షన్, ఖమ్మం, లింగంపల్లి, మధిర, మహబూబాబాద్, మహబూబ్‌నగర్, మలక్‌పేట, మల్కాజిగిరి జంక్షన్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, మిర్యాలగూడ, నల్గొండ, నిజామాబాద్ జంక్షన్, పెద్దపల్లి జంక్షన్, రామగుండం, సికింద్రాబాద్, షాద్‌నగర్, శ్రీ బాల బ్రహ్మేశ్వర జోగులాంబ, తాండూరు, ఉందానగర్, వికారాబాద్, వరంగల్, యాదాద్రి, యాకుత్‌పురా , జహీరాబాద్ రైల్వే స్టేష‌న్లు ఉన్న‌ట్లు ప్ర‌క‌టించారు.
హైటెక్ సిటీ స్టేషన్ వద్ద, ప్లాట్‌ఫారమ్ షెల్టర్, వెయిటింగ్ హాల్, మాడ్యులర్ టాయిలెట్, బుకింగ్ కౌంటర్, లిఫ్ట్, ఎస్కలేటర్ , పాదచారుల వంతెన పనులు పూర్తయ్యాయని తెలిపారు అశ్విని వైష్ణ‌వ్. కొత్త స్టేషన్ భవనం, కొత్త ప్రవేశ ద్వారం (పోర్చ్), ప్లాట్‌ఫారమ్ ఉపరితల మెరుగుదల, సర్క్యులేటింగ్ ఏరియా , పార్కింగ్ పనులు ప్రస్తుతం చేపట్టడం జ‌రిగింద‌న్నారు.
The post తెలంగాణ‌లో 40 రైల్వే స్టేష‌న్ల అభివృద్ది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా Palla Srinivasarao: బొత్సకు జగన్ నుంచి ప్రాణహాని ఉంది – టీడీపీ అధ్యక్షుడు పల్లా 

Palla Srinivasarao : విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంలో కుటుంబ సభ్యులతో కలిసి తాను కూర్చున్న స్టేజి కూలిపోయిన ఘటన వెనుక ప్రభుత్వం యొక్క కుట్ర దాగి ఉందని శాసన మండలిలో ప్రతిపక్షనేత బొత్స సత్యనారాయణ ఆరోపించిన సంగతి తెలిసిందే. అయితే

Tejas Crash Video: వెలుగులోకి ‘తేజస్‌’ కుప్పకూలిన కొత్త వీడియోTejas Crash Video: వెలుగులోకి ‘తేజస్‌’ కుప్పకూలిన కొత్త వీడియో

  దుబాయ్‌ ఎయిర్‌షోలో శుక్రవారం భారత వాయుసేనకు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పైలట్‌ నమాంశ్‌ స్యాల్‌ మృతిచెందారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

డ్ర‌గ్స్, గంజాయిపై కంట్రోల్ త‌ప్పిన స‌ర్కార్డ్ర‌గ్స్, గంజాయిపై కంట్రోల్ త‌ప్పిన స‌ర్కార్

క‌ర్నూలు జిల్లా : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డ్ర‌గ్స్ , గంజాయి ల‌భ్య‌మ‌వుతోంద‌ని, యువ‌త వాటి బారిన ప‌డి జీవితాల‌ను కోల్పోతున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వీటిని కంట్రోల్