hyderabadupdates.com Gallery త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్

త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్

త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్ post thumbnail image

కుప్పం : ఎన్టీఆర్ ఆశయ సాధనలో ముందుంటామని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి అన్నారు. ఆపన్నులను ఆదుకునేందుకు ట్రస్ట్ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా పలు గ్రామాల్లో భువనేశ్వరి పర్యటించారు. అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మహిళలతో సమావేశమయ్యారు. 4వ రోజు పర్యటనలో ముందుగా శ్రీరామ నవమిని పురస్కరించుకుని కుప్పంలో కోదండరామ స్వామి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బాల్య స్నేహితుడు చంద్రశేఖర్ ఇంటికి భువనేశ్వరి వెళ్లారు. కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు.
ఎన్టీఆర్ స్పూర్తితో, సీఎం చంద్రబాబు సహకారంతో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తున్నామని నారా భువనేశ్వరి అన్నారు. కుప్పం టీటీడీ కల్యాణ మండపంలో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన స్వయం ఉపాధికి చేయూత కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. ఎన్టీఆర్ స్పూర్తితో ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తయిందని చెప్పారు. చంద్రబాబు రాజకీయాల్లో బిజీగా ఉండటం వల్ల ట్రస్ట్ బాధ్యతలు నాకు అప్పగించార‌ని తెలిపారు. చంద్రబాబు అందించిన స్పూర్తితో ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం అని అన్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులకు మా వంతు సాయం అందిస్తున్నాం అని పేర్కొన్నారు. దాతలు కూడా మాకు సాయంగా నిలుస్తున్నారని వెల్ల‌డించారు. త్వరలోనే విజయవాడ , అనంతపురంలో కూడా తలసేమియా సెంటర్లు ప్రారంభిస్తాం అన్నారు.
The post త‌లసేమియా వ్యాధిపై 10న హైద‌రాబాద్ లో ర‌న్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణంKinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం

    భారత ప్రభుత్వం అందించిన లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దానిని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచంతో

వినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తివినోదాత్మ‌కంగా భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

హైద‌రాబాద్ : కిషోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. ఇందులో మాస్ మ‌హారాజా ర‌వితేజ‌తో పాటు అందాల ముద్దుగుమ్మ‌లు ఆషికా రంగ‌నాథ్, డింపుల్ హ‌య‌తి, సునీల్ , స‌త్య‌, వెన్నెల కిషోర్

ప్ర‌జా యుద్ద‌నౌక గ‌ద్ద‌ర్ కు నివాళిప్ర‌జా యుద్ద‌నౌక గ‌ద్ద‌ర్ కు నివాళి

హైద‌రాబాద్ : తెలంగాణ మ‌ట్టిలో మొల‌కెత్తిన గొంతుక‌, ప్ర‌జా స్వ‌ర‌పేటిక గుమ్మ‌డి విఠ‌ల్ రావు అలియాస్ గ‌ద్ద‌ర్ జ‌యంతి ఇవాళ‌. ఆయ‌న మ‌న మ‌ధ్య లేరు. కానీ త‌ను పాడిన పాట‌లు ఇప్ప‌టికీ ఎప్ప‌టికీ ఉంటాయి. మ‌న‌ల్ని గాయ‌ప‌రుస్తూనే ఉంటాయి. చ‌ని