hyderabadupdates.com movies సురేందర్ రెడ్డి… ఈ హడావిడి చూస్తున్నారా

సురేందర్ రెడ్డి… ఈ హడావిడి చూస్తున్నారా

ఏజెంట్ డిజాస్టర్ దెబ్బకు చాలా కాలంగా అజ్ఞాతంలో ఉన్న దర్శకుడు సురేందర్ రెడ్డి తిరిగి బయటికి వచ్చేది పవన్ కళ్యాణ్ సినిమా మొదలైనప్పుడే. దాదాపు ఈ ప్రాజెక్టు కన్ఫర్మ్ అయినప్పటికీ షూటింగ్ స్టార్ట్ అయ్యేదాకా ఫ్యాన్స్ ఏదీ ఖరారుగా తీసుకోవడం లేదు. పవన్ గెటప్, గెడ్డం అన్నీ మార్చేసింది ఈ మూవీ కోసమేననేది ఫిలిం నగర్ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. సూరికి ఇది గోల్డెన్ ఛాన్స్. వర్కౌట్ అయితే మళ్ళీ టయర్ 1 లిస్టులోకి వెళ్లిపోవచ్చు. అంత పేరు తెచ్చుకోవచ్చు.

అసలు మ్యాటర్ ఇది కాదు. సురేందర్ రెడ్డి మూడు రీ రిలీజులు ఏప్రిల్, మే నెలల్లో సందడి చేయబోతున్నాయి. ఏప్రిల్ 8 అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ‘రేసు గుర్రం’ని పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. ఫ్యాన్స్ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉండబోతున్నాయి. హైదరాబాద్ భుజంగ థియేటర్ లో వెయ్యి కేజీల పేపర్లతో పాటు బాణాసంచా, డీజేలతో భారీ సందడి చేయబోతున్నారు. ఏపీ తెలంగాణలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే తరహా సంబరాలు ఉంటాయని టాక్.

మే 20 జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డేకి ‘ఊసరవెల్లి’ రీ రిలీజ్ ఉంటుంది. అప్పట్లో ఇది అంచనాలు అందుకోలేక ఫ్లాప్ గా నిలిచింది. అయితే తారక్ పెర్ఫార్మన్స్, పాటలు తర్వాత రోజుల్లో దీన్నో డీసెంట్ వాచ్ గా మార్చేశాయి. ఆరెంజ్ తరహాలో ఇది కూడా వర్కౌట్ అవ్వొచ్చనే నమ్మకం ఫ్యాన్స్ లో ఉంది. మే 29 మహేష్ బాబు ‘అతిథి’ని దించుతున్నారు. ఇది ఏడాది కాలంగా వాయిదా పడుతూ ఫైనల్ గా మోక్షం దక్కించుకుంది. దీనికీ అభిమానుల హల్చల్  గట్టిగా ఉండనుంది.

సో రీ రిలీజ్ సౌండ్ అంతా సురేందర్ రెడ్డిదే ఉండబోతోందన్న మాట. ఇక్కడ ఆయన గుర్తించాల్సిన విషయం ఒకటుంది. ఇప్పటికీ తన మూవీస్ కి ఎంత ఫాలోయింగ్ ఉందనేది అర్థం చేసుకుంటే ఏజెంట్ లాంటివి రిపీట్ కావు. రవితేజ ‘కిక్’ ఇప్పటికీ మూవీ లవర్స్ కి హాట్ ఫేవరేట్. కళ్యాణ్ రామ్ కెరీర్ బెస్ట్ లో మొదటి స్థానం ‘అతనొక్కడే’ సినిమాదే. ‘అశోక్’కి సైతం కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ‘సైరా’ కమర్షియల్ గా డీసెంట్ అయ్యింది. సో ఈ ట్రాక్ రికార్డుని మరింత బలపరుచుకునే బాధ్యత సూరి మీదే ఉంది.

Related Post

పజిల్ ప్రశ్న – వీళ్ళిద్దరికే ఎలా సాధ్యమవుతోందిపజిల్ ప్రశ్న – వీళ్ళిద్దరికే ఎలా సాధ్యమవుతోంది

ఇద్దరు పెద్ద స్టార్లు కలిసి నటించాలంటే దాని వెనుక ఎన్నో లెక్కలు, ఈగోలు, బాలన్సులు, బడ్జెట్ లు ఉంటాయి. రాజమౌళి కాబట్టి ఆర్ఆర్ఆర్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ని కలిపాడు కానీ లేదంటే ఈ కాంబో వేరే దర్శకుడికి

నాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉందినాన్నమ్మ గారికి పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉంది

ఇటీవలే విడుదలైన సంక్రాంతి సినిమాలు ది రాజా సాబ్, మన శంకరవరప్రసాద్ గారులో ప్రభాస్ కు నాన్నమ్మగా, చిరంజీవికి తల్లిగా నటించిన జరీనా వహాబ్ ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్టవుతున్నారు. ఇప్పటిదాకా మదర్ క్యారెక్టర్స్ లో రిపీట్ ఆర్టిస్టులను చూసి

పేరు మారింది.. పంతం నెగ్గింది!పేరు మారింది.. పంతం నెగ్గింది!

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పంతం నెగ్గింది. చివరి నిమిషం వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన పోరాటం ఫలించలేదు. చివరకు మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లే ఆమోదం పొందింది. యూపీఏ 1 ప్రభుత్వం 2005లో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ