hyderabadupdates.com Gallery ఐపీఎల్ మ‌హా సంగ్రామం పోరాటానికి సిద్దం

ఐపీఎల్ మ‌హా సంగ్రామం పోరాటానికి సిద్దం

ఐపీఎల్ మ‌హా సంగ్రామం పోరాటానికి సిద్దం post thumbnail image

బెంగ‌ళూరు : ఐపీఎల్ 2026 మ‌హా సంగ్రామం మార్చి 28న శ‌నివారం బెంగళూరులోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. తొలి మ్యాచ్ డిఫెండింగ్ ఛాంపియ‌న్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు తో త‌ల‌ప‌డ‌నుంది స‌న్ రైజ‌ర్స్ ఆఫ్ హైద‌రాబాద్. ఇరు జ‌ట్లు ఇటు బ్యాటింగ్ లో అటు బౌలింగ్ లో స‌మ ఉజ్జీలుగా ఉన్నాయి. దీంతో ఎవ‌రు గెలుస్తార‌నే దానిపై ఉత్కంఠ నెల‌కొంది అభిమానుల్లో. ఎస్ ఆర్ హెచ్ విధ్వంస‌క‌ర‌మైన బ్యాటింగ్ కు పేరు పొందింది. రెండు జ‌ట్ల‌లోనూ బలమైన లైనప్‌లు ఉన్నాయి. ఇరు జ‌ట్లు ఐపీఎల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 25 సార్లు త‌ల‌ప‌డ్డాయి. ఆర్సీబీ 11 మ్యాచ్ ల‌లో విజ‌యం సాధిస్తే ఎస్ ఆర్ హెచ్ 13 మ్యాచ్ ల‌లో గెలుపొందింది.
ఇక ఇదే మైదానంలో ట్రాక్ రికార్డు చూస్తే ఆర్సీబీ జ‌ట్టుదే పై చేయిగా ఉంది. ఇక్క‌డ ఆర్సీబీ 5 మ్యాచ్ ల‌లో ఆధిప‌త్యం చెలాయిస్తే 3 మ్యాచ్ లు హైద‌రాబాద్ ఆధిక్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. ఇక ర‌న్స్ ప‌రంగ చూస్తే ఆర్‌సిబిపై ఎస్‌ఆర్‌హెచ్ 287 పరుగులు చేసింది .ఆర్‌సిబి 262 పరుగులతో బదులిచ్చింది. ఇది పూర్తిగా బ్యాటింగ్ పిచ్. ప‌రుగులు ధారాళంగా వ‌స్తాయి. మొద‌ట ఎవ‌రు బ్యాటింగ్ చేసినా ఆ జ‌ట్టు భారీ స్కోర్ న‌మోదు చేస్తూ వ‌చ్చింది. తొలుత ఎవ‌రు బ్యాటింగ్ కు దిగుతారో వారే అంతిమంగా విజ‌యానికి ద‌గ్గ‌ర‌గా ఉంటార‌ని గ‌త మ్యాచ్ ల ఫ‌లితాన్ని బ‌ట్టి చూస్తే తెలుస్తుంది.
ఇక ఆట‌గాళ్ల ప‌రంగా చూస్తే విరాట్ కోహ్లీ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. త‌న‌కు భువ‌నేశ్వ‌ర్ కుమార్ కు మ‌ధ్య పోటీ నెల‌కొనే ఛాన్స్ ఉంది. స్వింగ్ వర్సెస్ టెక్నిక్‌ను పరీక్షించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పోరాటాలలో ఇది ఒకటి . ట్రావిస్ హెడ్ వర్సెస్ ఆర్‌సిబి బౌలర్ల మ‌ధ్య ఆస‌క్తిక‌ర‌మైన పోరు కొన‌సాగ‌నుంది. హెడ్ తన విధ్వంసకరమైన ఆరంభాలకు ప్రసిద్ధి చెందాడు, అవి మ్యాచ్ స్వరూపాన్ని మార్చగలవు కూడా. హెన్రిచ్ క్లాసెన్ వర్సెస్ స్పిన్. స్పిన్‌ను చిన్నాభిన్నం చేయగల క్లాసెన్ సామర్థ్యం మ్యాచ్‌కు మలుపు కావచ్చని విశ్లేష‌కులు అంచ‌నా వేస్తున్నారు.
The post ఐపీఎల్ మ‌హా సంగ్రామం పోరాటానికి సిద్దం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలిఏపీలో మ‌రో 15 ఏళ్ల పాటు కూట‌మి స‌ర్కార్ కొన‌సాగాలి

అమరావతి : రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని అన్నారు. ఇదే ఐక్యత

రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామారాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా

హైద‌రాబాద్ : ఓ వైపు రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, మరో వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాడ‌ని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. వెలుగుమ‌ట్ల బాధితుల కోసం చేప‌ట్టిన నిరాహార‌దీక్ష‌ను ఆమె విర‌మించారు.

శ్రీ‌లంక‌తో భార‌త‌దేశం బంధం బ‌లోపేతంశ్రీ‌లంక‌తో భార‌త‌దేశం బంధం బ‌లోపేతం

ఢిల్లీ : శ్రీ‌లంక అధ్య‌క్షుడు అనుర కుమార దిస‌నాయ‌కేతో శుక్ర‌వారం భేటీ అయ్యారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ. ఇండియా ఏఐ ఇంపాక్ట్ 2026 స‌ద‌స్సులో ఈ ఇద్ద‌రు కీల‌క నేత‌లు పాల్గొన్నారు. ప్ర‌స్తుతం యావ‌త్ ప్ర‌పంచాన్ని ఏఐ శాసిస్తోంద‌ని , ఈ