hyderabadupdates.com Gallery తెలంగాణ‌లో గ్యాస్, పెట్రోల్ కు కొర‌త లేదు

తెలంగాణ‌లో గ్యాస్, పెట్రోల్ కు కొర‌త లేదు

తెలంగాణ‌లో గ్యాస్, పెట్రోల్ కు కొర‌త లేదు post thumbnail image

హైదరాబాద్ : ప‌శ్చిమాషియాలో నెల‌కొన్న ప్ర‌స్తుత సంక్షోభ‌ సమయంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ గ్యాస్‌ను సజావుగా సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని స్ప‌ష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ప్ర‌ధాన‌మంత్రి మోదీ నిర్వ‌హించిన వీడియో కాన్ఫ‌రెన్స్ లో ఆయ‌న పాల్గొని వివ‌రాలు తెలియ చేశారు. .పెట్రోల్, డీజిల్, గ్యాస్ సరఫరాను సమీక్షించి, పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు నేతృత్వంలో ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసిందని ముఖ్యమంత్రి తెలిపారు . హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ నుండి అధికారిక కమిటీ పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని, గ్యాస్ సరఫరా, పెట్రోల్, డీజిల్ అమ్మకాలను పర్యవేక్షించడానికి , బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి 33 జిల్లాలన్నింటిలో నోడల్ అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశామ‌న్నారు సీఎం. ప్రధానమంత్రి దృష్టికి పలు కీలక అంశాలను తీసుకు వచ్చారు.
ఆసుపత్రులు, పాఠశాలలు, అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు వాణిజ్య గ్యాస్ సిలిండర్లను ప్రాధాన్యతా ప్రాతిపదికన సరఫరా చేస్తున్నామ‌న్నారు. ఇంధనాల లభ్యత గురించి ప్రస్తావిస్తూ, ప్రతి ఫిల్లింగ్ స్టేషన్‌లో అందుబాటులో ఉన్న నిల్వల స్థాయిలను, అలాగే రోజువారీ వినియోగ రేట్లను అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని ముఖ్యమంత్రి తెలిపారు. సాధారణ పరిస్థితులలో తెలంగాణలో సగటు రోజువారీ పెట్రోల్, డీజిల్ వినియోగం 36,189 కిలోలీటర్లుగా ఉండగా, ప్రస్తుతం రాష్ట్రంలో 1,88,210 కిలోలీటర్ల నిల్వలు ఉన్నాయని చెప్పారు. అంతేకాకుండా, పెట్రోల్, డీజిల్ లేదా గ్యాస్ కొరత గురించి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, భయాందోళనలు సృష్టిస్తూ సోషల్ మీడియాలో కంటెంట్ పోస్ట్ చేస్తున్న వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల‌ని ఆదేశించామ‌న్నారు సీఎం.
The post తెలంగాణ‌లో గ్యాస్, పెట్రోల్ కు కొర‌త లేదు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్రశాంత్‌ వర్మకే ఫిక్స్‌!ప్రశాంత్‌ వర్మకే ఫిక్స్‌!

కన్నడ హీరో,  డైరెక్టర్ రిషబ్ శెట్టి ‘కాంతార చాప్టర్ 1’తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఆయన నటనకు మరియు దర్శకుడిగా చూపిన ప్రతిష్టకు ప్రేక్షకులు చాలా మెచ్చుతున్నారు. ఈ సినిమా సంబంధిత పనులు పూర్తయిన తర్వాత రిషబ్ ప్రస్తుతం పూర్తి

మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తిమ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల గురించి ప్ర‌స్తావించారు. వారు లేక‌పోతే ఈ స‌మాజం మ‌నుగ‌డ సాధించ‌ద‌ని పేర్కొన్నారు. వారు బాగుంటేనే అభివృద్ది సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం

నెలసరి పై మౌనం కాదు గౌరవం కావాలినెలసరి పై మౌనం కాదు గౌరవం కావాలి

న్యూఢిల్లీ : ఆప్ ఎంపీ రాఘ‌వ్ చ‌ద్దా ప్ర‌స్తుతం సంచ‌ల‌నంగా మారాడు దేశ వ్యాప్తంగా. త‌ను కీల‌క‌మైన అంశాల గురించి ఏకి పారేశాడు పార్ల‌మెంట్ సాక్షిగా. ఆయ‌న సంధించిన ప్ర‌శ్న‌లు ఇప్పుడు కోట్లాది మందిని ప్ర‌భావితం చేస్తున్నాయి. త‌ను వేసిన ప్ర‌శ్న‌ల‌కు