బెంగళూరు : ఇండియన్ ప్రిమీయర్ లీగ్ -2026 సీజన్ అట్టహాసంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ప్రారంభమైంది. ముందుగా బ్యాటిగ్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 201 రన్స్ చేసింది. అనంతరం మైదానంలోకి దిగిన స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు. తనతో పాటు దేవదత్ పడిక్కల్ సైతం సూపర్ షో చేశాడు. ఈ ఇద్దరూ కలిసి భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఎస్ ఆర్ హెచ్ బౌలర్లను ఉతికి ఆరేశారు. టోర్నీలో తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ సత్తా చాటడం విశేషం. టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ రజిత్ పటేదార్ అంచనాలు ఫలించాయి. తను ఫీల్డింగ్ ఎంచుకున్నాడు.
క్రీజులోకి వచ్చిన ఐసీసీ టి20 వరల్డ్ కప్ హీరో, ఎస్ ఆర్ హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతంగా ఆడాడు. తను 38 బంతులు ఎదుర్కొని 80 రన్స్ చేశాడు. ఇందులో 8 ఫోర్లు 5 సిక్సులు ఉన్నాయి. తనతో పాటు క్లాసెన్ 31, అనికేత్ 43 పరుగులతో రాణించారు. దీంతో భారీ లక్ష్యాన్ని ప్రత్యర్థి ఆర్సీబీ ముందు ఉంచగలిగింది సన్ రైజర్స్ హైదరాబాద్. జాకబ్ డఫీ 22 రన్స్ ఇచ్చి 3 వికెట్లు తీస్తే రొమారియో 54 రన్స్ ఇచ్చి 3 వికెట్లు కూల్చాడు. అనంతరం మైదానంలోకి ఎంటర్ అయ్యిన కోహ్లీ తన సహజ సిద్దమైన ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. 38 బంతులు ఆడి 69 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. దేవదత్ పడిక్కల్ 26 బంతులు ఎదుర్కొని 7 ఫోర్లు 4 సిక్సులతో 61 పరుగులు చేశాడు. సూపర్ బౌలింగ్ చేసిన డఫీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ పురస్కారం దక్కింది.
The post ఆరంభం అదిరింది ఆర్సీబీ గెలిచింది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఆరంభం అదిరింది ఆర్సీబీ గెలిచింది
Categories: