hyderabadupdates.com Gallery ఫిల్మ్ జర్నలిస్టుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

ఫిల్మ్ జర్నలిస్టుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

ఫిల్మ్ జర్నలిస్టుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం post thumbnail image

హైద‌రాబాద్ : తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లు అందిస్తున్న సేవ‌లు అద్భుతంగా ఉన్నాయంటూ ప్ర‌శంసించారు మెగాస్టార్ చిరంజీవి. త‌న చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్ చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం తెలుగు సంవత్సరాది సందర్భంగా జర్నలిస్టుల కోసం డైరీ విడుదల చేయడం, ఇన్సూరెన్స్ ప్లాన్‌ను రెన్యువల్ చేయడం ఆనవాయితీగా వ‌స్తోంది. 2026–2027 సంవత్సరానికి సంబంధించిన డైరీ, ఇన్సూరెన్స్ రెన్యువల్‌ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ ఏడాది ప్రత్యేకంగా, ప్రతి ఫిల్మ్ జర్నలిస్ట్ కుటుంబానికి (2+2) అందించే ఇన్సూరెన్స్ కవరేజీని ₹5 లక్షల నుంచి ₹10 లక్షలకు పెంచడం జరిగింది.
అదేవిధంగా, ప్రమాదాల సమయంలో జర్నలిస్టులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రత్యేక యాక్సిడెంట్ పాలసీ ప్రవేశ పెట్టారు. ఏదైనా ప్రమాదం కారణంగా 2 నుంచి 12 నెలలు బెడ్ రెస్ట్ అవసరమైన పరిస్థితుల్లో, ప్రతి వారం ₹10,000 చొప్పున సహాయం అందేలా ఈ పాలసీ రూపొందించారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకు గుర్తింపు కల్పించే విధంగా అసోసియేషన్ తరఫున ఐడి కార్డులు జారీ చేయగా, వాటిని కూడా చిరంజీవి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారు TFJA చేపడుతున్న కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందించారు. రూ. 5 లక్షల చెక్కును అందించి, సభ్యుల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో TFJA ప్రెసిడెంట్ వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శి ప్రసాదం రఘు, ట్రెజరర్ నాయుడు సురేంద్ర, పాలిటి బ్యూరో కన్వీనర్ వారణాసి లక్ష్మీనారాయణతో పాటు ఎగ్జిక్యూటివ్ కమిటీ , పోలిట్ బ్యూరో సభ్యులు పాల్గొన్నారు.
The post ఫిల్మ్ జర్నలిస్టుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Vijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలుVijay Mallya: భారతీయ బ్యాంకుల తీరుపై విజయ్‌ మాల్యా తీవ్ర విమర్శలు

Vijay Mallya : బ్యాంకులకు రూ.వేల కోట్లు ఎగవేసిన విజయ్‌ మాల్యా (Vijay Mallya)… దేశం నుంచి పారిపోయి బ్రిటన్‌లో తలదాచుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత ప్రభుత్వ రంగ బ్యాంకులపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తన ఆస్తుల రికవరీల

శ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దంశ్రీ‌కాళ‌హ‌స్తిలో శివ భ‌క్తుల‌పై లాఠీఛార్జి అబ‌ద్దం

తిరుప‌తి జిల్లా : తిరుప‌తి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. శ్రీకాళహస్తి దేవాలయం లో శివరాత్రి నాడు శివ స్వామి భక్తుల పై పోలీసు లు లాఠీచార్జీ అని సోషియల్ మీడియాలో వస్తున్న వార్తలను తీవ్రంగా ఖండించారు.

Pawan Kalyan’s ‘OG’ Crosses ₹250 Crore Worldwide, Set to Enter ₹300 Crore ClubPawan Kalyan’s ‘OG’ Crosses ₹250 Crore Worldwide, Set to Enter ₹300 Crore Club

Power Star Pawan Kalyan’s latest release OG has demonstrated the box-office potential of a well-planned, straight commercial entertainer. Directed by young filmmaker Sujeet, the film has already grossed over ₹250