hyderabadupdates.com movies ‘విశ్వంభర’ చేసిందే ‘లెనిన్’ ఫాలో అయ్యిందా?

‘విశ్వంభర’ చేసిందే ‘లెనిన్’ ఫాలో అయ్యిందా?

గత ఏడాది గేమ్ ఛేంజర్ విడుదల తేదీ ప్రకటించే సమయంలో విశ్వంభర కోసం లాక్ చేసుకున్న సంక్రాంతి డేట్ ని తమకు ఇచ్చినందుకు నిర్మాత దిల్ రాజు థాంక్స్ చెబుతూ ఒక చిన్న వీడియో చేశారు. ఫ్యాన్స్ నిజమేనేమో అనుకున్నారు. తీరా చూస్తే అసలు మెగా మూవీకి అప్పటికీ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. ఒక స్పెషల్ సాంగ్ షూట్ బ్యాలన్స్ ఉంది. ఇవన్నీ ఉండి కూడా ఏదో త్యాగం చేసినట్టు విశ్వంభరని వాడుకున్నారనే కామెంట్స్ సోషల్ మీడియాలో కనిపించాయి.

ట్విస్ట్ ఏంటంటే ఇది జరిగి పదిహేను నెలలు దాటేసినా విశ్వంభర రిలీజ్ డేట్ ఫిక్స్ కాలేదు. అచ్చం ఇదే తరహాలో మరో సంఘటన కనిపిస్తోంది. పెద్ది ఏప్రిల్ 30 వస్తుంది కాబట్టి లెనిన్ కి మే 26కి వాయిదా వేస్తున్నామని నిన్న అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రకటించాయి. ఒకవేళ ఇదే నిజం అనుకుంటే ఇప్పుడు పెద్ది వాయిదా వార్తలు వస్తున్నాయి కాబట్టి లెనిన్ ని త్వరగా తీసుకురమ్మని అక్కినేని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

అసలు విషయం ఏంటంటే లెనిన్ పనులు ఇంకా పూర్తి కాలేదు. ఆ కారణంగానే కొంచెం దూరం వెళ్లిపోయారు. పెద్దిని సాకుగా చూపించారు తప్పించి నిజం అది కాదనేది అఖిల్ అభిమానుల వాదన. మధ్యలో నాగవంశీని కొందరు కార్నర్ చేస్తున్న వైనం ఎక్స్ లో చూడొచ్చు. విపరీతమైన ఆలస్యానికి నోచుకున్న లెనిన్ ఇప్పుడు పెద్ది పోస్టు పోన్ వార్తల వల్ల చిక్కుల్లో పడిందనే చెప్పాలి. దీనికి ప్రొడక్షన్ హౌస్ ఏమంటుందో కానీ జనాల చర్చ గట్టిగానే ఉంది.

అర్థం కాని మ్యాటర్ ఏంటంటే గ్రాఫిక్స్ ఎక్కువగా డిమాండ్ చేయని పెద్ది, లెనిన్ లాంటివి కూడా ఇంత ఆలస్యానికి గురి రావడం. కారణాలు ఎన్ని ఉన్నా ఇలాంటి జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత దర్శక నిర్మాతలదే. ఫలానా డేట్ కి సినిమా చూస్తామని ఫ్యాన్స్ ఫిక్స్ అయినప్పుడు దాన్ని పదే పదే మారిస్తే వాళ్ళ ఆగ్రహానికి దారి తీస్తుంది. ఇలా జరగడంలో చరణ్, అఖిల్ ప్రమేయం ఉన్నా లేకపోయినా అభిమానులు మాత్రం కలవరపడుతున్నారు. అయినా టాలీవుడ్ లో ఇలాంటివి కొత్త కాదుగా.

Related Post

Wicked For Good Review: Ariana Grande and Cynthia Erivo’s Sequel Brings Heart But No SoulWicked For Good Review: Ariana Grande and Cynthia Erivo’s Sequel Brings Heart But No Soul

Name: Wicked: For Good  Director: John M. Chu Writer: Winnie Holzman, Dana Fox (based on Wicked by Stephen Schwartz, Winnie Holzman, and Wicked by Gregory Maguire) Cast: Cynthia Erivo, Ariana