hyderabadupdates.com Gallery ఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూ

ఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూ

ఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూ post thumbnail image

విజ‌య‌వాడ : ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ 11 వ ప్లీనరీ ముగింపు సందర్భంగా నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికయ్యింది. ఐ.జే.యు. అధ్యక్షునిగా బల్విందర్ సింగ్ జమ్మూ (పంజాబ్) , సెక్రటరీ జనరల్ గా డి.సోమసుందర్ (ఆంధ్రప్రదేశ్) గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా వారు ప్లీనరీ వేదికపై తాజాగా తమ బాధ్యతలు చేపట్టారు. మిగిలిన ఆఫీస్ బేరర్ పోస్టులకు, కార్యవర్గ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ జరిగింది. ఐజేయూ జాతీయ కార్యవర్గం సీనియర్ పాత్రికేయుడు ఎం.ఎ. మాజిద్ ను ఎన్నికల అధికారిగా నియమించింది. ఉదయం 9 గంటల నుండి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం అయ్యింది. నామినేషన్ల స్వీకరణ, ఉపసంహరణ ప్రక్రియ పూర్తయ్యాక ఫలితాలను ఎన్నికల అధికారి ఎం.ఎ. మాజిద్ ప్లీనరీలో ప్రకటించారు.
జాతీయ ఉపాధ్యక్షులుగా అమర్ మోహన్ ప్రసాద్ (బీహర్), వై.నరేందర్ రెడ్డి (తెలంగాణా ), జాతీయ కార్యదర్శులుగా నరేంద్ర భరద్వాజ్ ( ఉత్తర ప్రదేశ్ ), డి.ఎస్.ఆర్.సుభాష్ ( తమిళనాడు) , పి. భాస్కర్ రెడ్డి ( కర్ణాటక) , కోశాధికారిగా బల్బీర్ సింగ్ జంబు (పంజాబ్) ఎన్నికయ్యారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా రవీందర్ సింగ్ ( ఉత్తర ప్రదేశ్) , కే.సత్యనారాయణ (తెలంగాణా ), కే. అజిత ( తెలంగాణా) , నగునూరి శేఖర్ (తెలంగాణా ) కూన అజయ్ బాబు , ( ఆంధ్ర ప్రదేశ్) ఈ.ఎన్.రాజు ( ఆంధ్రప్రదేశ్) , కుణాల్ జే. మాత్రే ( మహారాష్ట్ర), మోహన్ రాజ్ శ్రీనివాసన్ (తమిళనాడు), బిందూ సింగ్ ( పంజాబ్ , చండీఘర్), ఎం.పీ. మహారాజ ( పాండిచ్చేరి), సి.ఎం.సాబిర్ అలీ ( కేరళమ్), జయశ్రీ భట్టాచార్య ( పశ్చిమ బెంగాల్), వినీతా మండల్ హల్దర్ ( ఛత్తీస్ ఘడ్), శివేంద్ర నారాయణ్ సింగ్ ( బీహార్) టి. శ్రీనివాసరావు ( న్యూఢిల్లీ), ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
The post ఐజేయూ అధ్యక్షునిగా బల్విందర్ జమ్మూ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

రాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామారాజ్యాంగం పేరుతో రాహుల్ గాంధీ డ్రామా

హైద‌రాబాద్ : ఓ వైపు రాష్ట్రంలో రాచ‌రిక పాల‌న సాగుతోంద‌ని, మరో వైపు రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పెట్టుకుని ప్ర‌జ‌ల‌ను మోసం చేస్తున్నాడ‌ని ఆరోపించారు మాజీ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌. వెలుగుమ‌ట్ల బాధితుల కోసం చేప‌ట్టిన నిరాహార‌దీక్ష‌ను ఆమె విర‌మించారు.

వ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులువ‌న దేవ‌త‌ల‌ను ద‌ర్శించుకున్న మంత్రులు

ములుగు జిల్లా : ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతరకు భ‌క్తులు పోటెత్తారు. ఆ ప్రాంగ‌ణ‌మంతా స‌ముద్రాన్నిత‌ల‌పింప చేస్తోంది. ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండ‌గా గురువారం కేంద్ర గనుల శాఖ

ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ జోష్ ప‌వ‌న్ ఖుష్ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ జోష్ ప‌వ‌న్ ఖుష్

హైద‌రాబాద్ : ద‌మ్మున్న ద‌ర్శ‌కుడు, తెలంగాణ‌కు చెందిన హ‌రీష్ శంక‌ర్ తీసిన తాజా చిత్రం ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్. ఇందులో కీ రోల్ పోషించాడు ప‌వ‌ర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ . త‌న‌తో పాటు అందాల భామ‌లు