hyderabadupdates.com Gallery అమెరికాలో ట్రంప్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌

అమెరికాలో ట్రంప్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌

అమెరికాలో ట్రంప్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ post thumbnail image

అమెరికా : ఒంటెద్దు పోక‌డ పోతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు వ్యతిరేకంగా అమెరికాలో భారీ నిరసన ప్రదర్శ‌న‌లు వెల్లువెత్తాయి. 50 రాష్ట్రాల్లో 3 వేల చోట్ల నో కింగ్స్ నిరసనలు మిన్నంటాయి. 90 లక్షల మందికి పైగా రోడ్లపైకి వచ్చారు జనం.. లాభాల కోసం యుద్ధమా అంటూ నినాదాలు చేశారు. అమెరికా సైనికులు అమ్మకానికి లేరంటూ స్లొగన్స్ క‌నిపించాయి. అన్యాయం చట్టమైనపుడు ప్రతిఘటనే కర్తవ్యం అవుతుంద‌ని వార్నింగ్ ఇచ్చారు.
గత 14 నెలల్లో, ట్రంప్ అమెరికాను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు ద్వేషించే, చూసి భయపడే, జాలిపడే, ఎగతాళి చేసే, అసహ్యించుకునే, నమ్మకం కోల్పోయే , తమకు ఏమాత్రం సంబంధం వద్దు అనుకునే ఒక దేశంగా మార్చేశాడని ఆరోపించారు. పూర్తిగా మూర్ఖుడైన, క్రూరుడైన, అవినీతిపరుడైన, చట్టాలను లెక్కచేయని, నిజాయితీలేని ఒక పిచ్చివాడిని మీరు వైట్‌హౌస్‌లో కూర్చోబెడితే, బహుశా ఇలాగే జరుగుతుందేమో అని మాజీ రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు జో వాల్ష్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశాడు. డొనాల్డ్ ట్రంప్ నిరంకుశ ధోరణి, ఇతర క్రూరమైన, చట్టాన్ని కాలరాసే పాలనగా తాము భావిస్తున్న దానిపై లక్షలాది మంది ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏడాదిలోపు అమెరికన్లు వీధుల్లోకి రావడం ఇది మూడవసారి కావ‌డం విశేషం.
మొత్తం 50 రాష్ట్రాలలో 3200కు పైగా కార్యక్రమాలు ప్రణాళిక చేశారు. అక్రమ వలసలపై ట్రంప్ ఉక్కు చర్యలకు కేంద్ర బిందువైన మిన్నెసోటాలోని సెయింట్ పాల్‌లో, రాష్ట్ర రాజధాని భవనం వెలుపల ఒక భారీ ర్యాలీ జరిగింది. ఈ ఏడాది మిన్నియాపాలిస్‌లో ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ అధికారులు కాల్చి చంపిన రెనీ గూడ్, అలెక్స్ ప్రెట్టీల ఫోటోలు ఉన్న పోస్టర్లను అక్కడి జన సమూహంలోని చాలా మంది పైకెత్తి పట్టుకున్నారు.
The post అమెరికాలో ట్రంప్ కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌Nayanar Nagendran: మా కూటమిలోకి విజయ్‌ వస్తే స్వాగతిస్తాం – బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్‌

    తమ కూటమిలోకి ‘తమిళగ వెట్రి కళగం’ (టీవీకే) అధినేత విజయ్‌ వస్తే ఘనంగా స్వాగతిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే నయినార్‌ నాగేంద్రన్‌ పేర్కొన్నారు. ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీపీ రాధాకృష్ణన్‌ ఈ నెల 28న కోవైలో

గుజ‌రాత్ న‌మూనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాల‌నగుజ‌రాత్ న‌మూనా ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో పాల‌న

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. గుజరాత్ నమూనా స్ఫూర్తితో స్థిరమైన ప్రభుత్వాన్ని అందిస్తామ‌ని చెప్పారు. ఈ సంద‌ర్బంగా గుజరాత్ నమూనాను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. మరో 700 అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామ‌న్నారు. అంతే