hyderabadupdates.com movies తెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదు

తెలంగాణలో రేపటినుండి ‘ముక్క’ దొరకదు

ఈ వార్త నిజంగానే షాకింగనే చెప్పాలి. రేపు అంటే బుధవారం నుంచి తెలంగాణవ్యాప్తంగా చికెన్ ముక్క దొరకదట. మరి ముక్క లేనిదే ముద్ద దిగని వారి పరిస్థితి ఏమిటంటారా? ఖరీదు ఎక్కువైనా మటన్ షాపులకు దారి తీయడమొక్కటే మార్గం. అయితే చికెన్ ముక్కకు అలవాటు పడ్డ వారు మటన్ షాపులకు అంతగా వెళ్లలేరు కదా. మరి ఎలా అంటారా? ఏలా ఏమిటి? చికెన్ షాపులు తెరిచేదాకా వేచి చూడాల్సిందే. అప్పటిదాకా ముక్క మాటను పక్కన పెట్టాల్సిందే.

అయినా తెలంగాణలో బుధవారం నుంచి చికెన్ దొరకకపోవడానికి కారణమేమిటంటే… రాష్ట్రంలోని చికెన్ షాపులన్నీ మూత పడనున్నాయట. ఈ మేరకు తెలంగాణ చికెన్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ మంగళవారం ఓ సంచనల ప్రకటనను విడుదల చేసింది. బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా చికెన్ షాపులను మూసివేస్తున్నామని సదరు ప్రకటనలో అసోసియేషన్ ప్రకటించింది. అయితే ఎప్పటి నుంచి తిరిగి షాపులను తెరుస్తామన్న విషయాన్ని మాత్రం అసోసియేషన్ వెల్లడించలేదు.

అయినా చికెన్ షాపులన్నీ కట్టకట్టుకుని మూత పడటానికి గల కారణాలేమిటన్న విషయానికి వస్తే… ఫారం కోళ్లను పౌల్ట్రీ ఫారాల నుంచి చికెన్ షాపులు తీసుకుంటున్నాయి. ఇలా తమ కోళ్లను చికెన్ గా మలచి విక్రయిస్తున్న చికెన్ షాపులకు పౌల్ట్రీ యాజమాన్యాలు కమీషన్ ను అందిస్తున్నాయి. ఈ కమీషన్ ను ఇటీవలి కాలంలో ఏమాత్రం పెంచలేదట.

దీంతో మారిన కాలమాన పరిస్థితులకు తగ్గట్టుగా తమకు కమిషన్ పెంచాల్సిందేనని అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ఈ డిమాండ్ చాలా కాలం నుంచి ఉన్నా… పౌల్ట్రీ ఫారం యాజమాన్యాలు ఏమాత్రం పట్టించుకోలేదట. దీంతో చికెన్ షాపుల బంద్ కు అసోసియేషన్ పిలుపునిచ్చింది. మరి ఎప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుందో చూడాలి.

Related Post

సింగర్స్ ని వాడుకోవడంలో మాస్టర్ డిగ్రీసింగర్స్ ని వాడుకోవడంలో మాస్టర్ డిగ్రీ

దర్శకుడు అనిల్ రావిపూడికి కామెడీ మీదే కాదు మ్యూజిక్ మీద కూడా మంచి పట్టుంది. స్టార్ హీరోలు లైట్ తీసుకునే భీమ్స్ సిసిరోలియోతో సంక్రాంతికి వస్తున్నాం రూపంలో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ చేయించుకోవడం అతనికే చెల్లింది. ముఖ్యంగా గోదారి గట్టు మీద

గాలి జనార్థన్ రెడ్డి ఇంటికి ఫైర్… బళ్లారిలో ఏం జరుగుతోంది?గాలి జనార్థన్ రెడ్డి ఇంటికి ఫైర్… బళ్లారిలో ఏం జరుగుతోంది?

కర్ణాటకలోని బళ్లారిలో మైనింగ్ వ్యాపారవేత్త, బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే భరత్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 1న ఫ్లెక్సీల ఏర్పాటు విషయంలో ఇరు వర్గాల మధ్య