hyderabadupdates.com movies ట్యాంక్ బండ్ హీరోకు సీఎం ఆపన్న హస్తం

ట్యాంక్ బండ్ హీరోకు సీఎం ఆపన్న హస్తం

ఆపన్న హస్తం అందించడంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనదైన శైలి స్పీదును చూపిస్తున్నారు. ఆపదలో ఉన్న వారికి ఏదో హామీ ఇచ్చాం… అమలు సంగతి తర్వాత చూద్దాం అనే ఫక్తు రాజకీయ నేతల మాదిరిగా కాకుండా చేయాలనుకున్న సాయాన్ని రేవంత్ రెడ్డి అప్పటికప్పుడే చేసేస్తున్నారు. రేవంత్ లోని ఈ తరహా వైఖరితో ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి పూర్తి స్థాయి భరోసా దక్కింది. శివ కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇంటిని మంజూరు చేసిన రేవంత్… తక్షణ ఆర్థిక సాయంతో పాటు సుస్థిత ఉపాధి లభించేలా చర్యలు తీసుకున్నారు.

ట్యాంక్ బండ్ వేదికగా వందలాది మంది ప్రాణాలను కాపాడిన శివ… ట్యాంక్ బండ్ శివగా గుర్తింపు పొందిన సంగతి తెలిసిందే. అయితే శివ కుటుంబం పేదరికంతో సతమతమవుతోంది. ఇల్లు లేక, కుటుంబాన్ని పోషించుకునే ఉపాధి లేక శివ నానా ఇబ్బందులు పడుతున్నాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న రేవంత్…మంగళవారం శివ కుటుంబాన్ని తన ఇంటికి పిలిపించుకున్నారు. శివ కుటుంబంతో పూర్తి స్థాయి వివరాలను ఆరా తీసిన రేవంత్… ఆ కుటుంబానికి తక్షణ ఆర్థిక సాయం కింద రూ.5 లక్షలను అందించారు. ఈ సాయాన్ని ఏదో ప్రకటనకే పరిమితం చేయని రేవంత్… అప్పటికప్పుడే ఆ సాయానికి చెందిన చెక్కును శివ చేతిలో పెట్టారు.

ఇక శివ కుటుంబానికి శాశ్వత ఆవాసం లేదన్న విషయం తెలుసుకున్న రేవంత్ తక్షణమే ఆయనకు ఓ డబుల్ బెడ్ రూం ఇంటిని ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తక్షణ ఆర్థిక సాయం, ఇల్లు కేటాయింపు ఓకే మరి శాశ్వత ఉపాధి ఎలా అన్న దిశగా ఆలోచించిన రేవంత్… శివ కుమారుడికి హోంగార్డు ఉద్యోగం ఇచ్చారు.

నియామక పత్రాన్ని అక్కడికక్కడే అందజేశారు. ఇంకేం కావాలని రేవంత్ అడగగా… ట్యాంక్ బండ్ పరిధిలో ఓ స్విమ్మింగ్ పూల్ కావాలని శివ కోరాడు. అందుకూ సరేనన్న రేవంత్… ట్యాంక్ బండ్ పరిధిలో ఓ స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసి దానిని శివకు అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఇలా రేవంత్ ఒక్క దెబ్బతో శివ కుటుంబం శాశ్వతంగా సంతోషంగా జీవనం సాగించేందుకు అవసరమైన చర్యలు చేపట్టారు.

Related Post

Naveen Chandra’s Next Titled Not a Doctor, Title Poster IntriguesNaveen Chandra’s Next Titled Not a Doctor, Title Poster Intrigues

Swadharm Entertainment has officially announced its Production No. 6, with Rahul Yadav Nakka backing a new film starring Naveen Chandra in the lead role and directed by Srikanth Nagothi. Known

ఈ ఐఏఎస్‌… ఐపీఎస్‌… ఎంత సింపులంటేఈ ఐఏఎస్‌… ఐపీఎస్‌… ఎంత సింపులంటే

పెళ్లంటే ఆడంబ‌రాల‌కు మారు పేరుగా మారిపోయిన రోజులు ఇవి. ఎవ‌రు ఎక్కువ ఖ‌ర్చు పెడితే.. ఎంత ఘ‌నంగా చేసుకుంటే అంత గొప్ప అన్న‌ట్లు అయిపోయింది. పెద్ద‌గా డ‌బ్బులు లేని వాళ్లు సైతం అప్పులు చేసి అయినా ఘ‌నంగా పెళ్లిళ్లు చేయ‌డానికి చూస్తున్నారు.