hyderabadupdates.com Gallery కుకు టీవీలో ఎంఎస్ ధోనీ పెట్టుబ‌డి

కుకు టీవీలో ఎంఎస్ ధోనీ పెట్టుబ‌డి

కుకు టీవీలో ఎంఎస్ ధోనీ పెట్టుబ‌డి post thumbnail image

చెన్నై : భార‌త క్రికెట్ జ‌ట్టు మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోనీ అద్భుత‌మైన క్రికెట‌ర్ గా గుర్తింపు పొందాడు. ఇదే స‌మ‌యంలో త‌ను మంచి వ్యాపార‌వేత్త కూడా. సంవ‌త్స‌రానికి భారీ ఎత్తున ఆదాయం పొందుతున్నాడు. టాప్ కంపెనీల‌కు బ్రాండ్ అంబాసిడ‌ర్ గా, ప్ర‌మోట‌ర్ గా, ఇన్వెస్ట‌ర్ గా త‌ను పేరు పొందాడు. తాజాగా ఏఐ-ఆధారిత స్టోరీటెల్లింగ్ ప్లాట్‌ఫామ్ కుకు టీవీలో ఎంఎస్ ధోని పెట్టుబడిదారుగా చేరారు. ఈసంద‌ర్భంగా కుకు టీవీ కో ఫౌండ‌ర్ వినోద్ కుమార్ మీనా ఈ విష‌యాన్ని వెల్ల‌డించాడు. దేశ వ్యాప్తంగా అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన ప్ర‌ముఖుల‌లో ధోనీ ఒక‌రు అని పేర్కొన్నారు. ఆయ‌న త‌మ సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్ట‌డం త‌మ‌కు ఎంతో గ‌ర్వ కార‌ణంగా ఉంద‌న్నాడు.
ఇదిలా ఉండ‌గా భారత దిగ్గజ క్రికెటర్ ఎంఎస్ ధోని కుకు టీవీలో పెట్టుబడి పెట్టడమే కాకుండా, దాని షార్ట్స్ , డ్రామా యాప్ అయిన కుకు టీవీకి బ్రాండ్ అంబాసిడర్‌గా చేరారు. ఈ భాగస్వామ్యంపై ధోని స్పందించాడు. నేను కుకు టీవీలో పెట్టుబడి పెట్టడానికి ,టీవీకి అంబాసిడర్‌గా చేరడానికి ఎంచుకున్నాను, ఎందుకంటే ఈ ప్లాట్‌ఫామ్ నన్ను నిజంగా ఆకట్టుకుంది. ఇది భారతదేశం అంతటా ప్రేక్షకులకు బహుళ భాషలు , ఫార్మాట్‌లలో విభిన్నమైన వినోద అనుభవాన్ని అందించింది. దీని వృద్ధి అద్భుతంగా ఉంది, నా లాంటి చిన్న పట్టణాల నుండి వచ్చి ఇంతటి స్థాయిలో ఒక సంస్థను నిర్మించిన వ్యవస్థాపకులతో నేను బలంగా మమేకమవుతానని ప్ర‌క‌టించాడు.
The post కుకు టీవీలో ఎంఎస్ ధోనీ పెట్టుబ‌డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోనుఐపీఎల్ లో ప్ర‌త్య‌ర్థుల గురించి ప‌ట్టించుకోను

న్యూఢిల్లీ : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ హీరో కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. దేశ రాజ‌ధాని ఢిల్లీలో బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన న‌మాన్ అవార్డుల ప్ర‌దానోత్సం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి భార‌త జ‌ట్టు త‌ర‌పున

అఖిల్ లెనిన్ ఫస్ట్ సింగిల్ కెవ్వు కేకఅఖిల్ లెనిన్ ఫస్ట్ సింగిల్ కెవ్వు కేక

హైద‌రాబాద్ : అఖిల్ అక్కినేని చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన చిత్రం లెనిన్. ఈ సినిమా షూటింగ్ దాదాపు 70 శాతానికి పైగా పూర్త‌యింది. తాజాగా సినిమాకు సంబంధించి ఫ‌స్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాకు ప్రాణం పెట్టి

Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?Sabarimala: ఆదాయం లేని వ్యక్తి శబరిమల బంగారు తాపడం దాత ?

Sabarimala : శబరిమల ఆలయంలో బంగారు ఫలకాల బరువు తగ్గిపోవడంపై తలెత్తిన వివాదంలో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గర్భగుడి వెలుపలి బంగారు ఫలకాలకు తాపడం దాత, బెంగళూరు వ్యాపారి ఉన్నికృష్ణన్‌కి (Unnikrishnan) అసలు స్థిరమైన ఆదాయ వనరులే లేవని,