hyderabadupdates.com movies మే 1 కోసం కొత్త సినిమాల కొట్లాట

మే 1 కోసం కొత్త సినిమాల కొట్లాట

ఏప్రిల్ 30 ‘పెద్ది’ తప్పుకున్నాక అందరి దృష్టి ఆ స్లాట్ మీద పడింది. ఇది ముందే ఊహించిన ‘గాయపడ్డ సింహం’ తెలివిగా మే 1 రిలీజ్ డేట్ ని దిల్ రాజు సమక్షంలో ప్రకటించుకుని సేఫ్ గేమ్ ఆడింది. ఎలాగూ రామ్ చరణ్ వచ్చేలా లేడని ప్రాక్టికల్ గా అలోచించి ఇలా చేయడం ప్లస్ అవుతోంది. ఆల్రెడీ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టేశారు. విచిత్రంగా పెద్ది పోస్టుపోన్ గురించి అఫీషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ ఇప్పటిదాకా రాలేదు. అయినా సరే అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఇప్పుడీ డేట్ మీద గాయపడ్డ సింహం ఒకటే కాదు వేరే సినిమాలు కూడా ప్లాన్ చేసుకునే ఆలోచనలో ఉన్నాయి. వాటిలో ముఖ్యమైంది నిఖిల్ ‘స్వయంభు’. ఫిబ్రవరి నుంచి వాయిదా పడుతూ సరైన డేట్ కోసం ఎదురు చూస్తున్న ఈ ప్యాన్ ఇండియా మూవీ ఇప్పుడు ఏప్రిల్ 30 లేదా మే 1 వచ్చే ఆలోచనలో ఉంది. సమంతా ‘మా ఇంటి బంగారం’ ముందు అనుకున్న మే 15 కాకుండా రెండు వారాలు అడ్వాన్స్ అవ్వాలని చూస్తోందట. కంటెంట్ మీద టీమ్ కాన్ఫిడెంట్ గా ఉంది.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబోలో రూపొందుతున్న ‘ఎపిక్’ని అదే డేట్ కి దింపితే ఎలా ఉంటుందనే ఆలోచనలో సితార సంస్థ ఉన్నట్టు వినికిడి. ఒకవేళ ఇది సాధ్యం కాదనుకుంటే ఇదే బ్యానర్ లో రూపొందిన అశోక్ గల్లా ‘వీసా’ని రిలీజ్ చేసే ఆప్షన్ కూడా చూస్తున్నారట. చేతిలో కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది కాబట్టి ప్రమోషన్లు, సెన్సార్ల, పోస్ట్ ప్రొడక్షన్లు అన్నీ పూర్తి చేసుకోవాలి. ముఖ్యంగా ఫైనల్ కాపీలు సిద్ధం చేసుకోవాలి.

ఇప్పటికైతే ఇవన్నీ డిస్కషన్ల స్టేజిలోనే ఉన్నాయి. గాయపడ్డ సింహం మాత్రమే కన్ఫర్మ్ చేసుకోగా మిగిలినవి ఏ క్షణం ఏవి ప్రకటన ఇస్తాయో చూడాలి. ఒక్క పెద్ది మిస్ చేసుకోవడంతో ఇండస్ట్రీలో ఇంతటి వేడి వాతావరణం నెలకొందన్న మాట. ఇవే కాదు మరికొన్ని సినిమాలు కూడా మే 1 వైపు చూస్తున్నాయట కానీ కాంపిటీషన్ ఎంత మోతాదులో చెక్ చేసుకుని ఆ తర్వాత డిసైడ్ కాబోతున్నాయి. వెయిట్ సంగతి సరికాని ఇంతకీ పెద్దికి మోక్షం ఎప్పుడో చెప్పాలని మెగా ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు.

Related Post

కిషోర్ తిరుమల మీద ‘మాస్’ బరువుకిషోర్ తిరుమల మీద ‘మాస్’ బరువు

లవ్, ఫ్రెండ్ షిప్స్ ఆధారంగా చేసుకుని సెన్సిబుల్ సినిమాలు ఇస్తాడని పేరున్న దర్శకుడు కిషోర్ తిరుమల కొత్త మూవీ రవితేజతో తీస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ చాలా అంటే చాలా వేగంగా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి స్లాట్ మిస్ కాకూడదని

ఎట్టకేలకు స్పందించిన బండ్ల గణేష్ఎట్టకేలకు స్పందించిన బండ్ల గణేష్

చాలా ఏళ్లుగా సినిమాల‌కు దూరంగా ఉన్న‌ప్ప‌టికీ న‌టుడు, నిర్మాత బండ్ల గ‌ణేష్ త‌ర‌చుగా వార్త‌ల్లో నిలుస్తూనే ఉంటాడు. గ‌త నెల రోజుల్లో ప‌లుమార్లు ఆయ‌న పేరు హాట్ టాపిక్‌గా మారింది. లిటిల్ హార్ట్స్ స‌క్సెస్ మీట్లో చేసిన ప్ర‌సంగం వివాదాస్ప‌దం కాగా..