hyderabadupdates.com Gallery మ‌న్మ‌థుడి 100వ మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్

మ‌న్మ‌థుడి 100వ మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్

మ‌న్మ‌థుడి 100వ మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్ post thumbnail image

హైద‌రాబాద్ : తెలుగు చ‌ల‌నచిత్ర ప‌రిశ్ర‌మ‌లో మోస్ట్ పాపుల‌ర్ న‌టుడు అక్కినేని నాగార్జున‌. త‌న సినీ కెరీర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 99 మూవీస్ చేశాడు. ఇది కూడా ఓ రికార్డ్. అటు న‌టుడిగా ఇటు యాంక‌ర్ గా త‌ను జ‌నాద‌ర‌ణ పొందాడు. త‌ను న‌టించ‌బోయే 100వ చిత్రంపై ఉత్కంఠ నెల‌కొంది. ఏ న‌టి త‌న ప‌క్క‌న న‌టిస్తుంద‌నే దానిపై చ‌ర్చ‌లు మొద‌లు అయ్యాయి. తాజాగా అందిన స‌మాచారం మేర‌కు అందాల ముద్దుగుమ్మ ఐశ్వ‌ర్య రాజేష్ మ‌న్మ‌థుడితో రొమాన్స్ చేయ‌నుంది. ఈ వందో మూవీ పూర్తగా తండ్రీ కూతుళ్ల అనుబంధం చుట్టూ న‌డుస్తుంది. వాణిజ్య వినోత చిత్రంగా తెర‌కెక్క‌నుంది. అయితే ఐశ్వ‌ర్య రాజేష్ ఇప్ప‌టికే షూటింగ్ లో చేరిన‌ట్లు స‌మాచారం.
ఈ చిత్రానికి రా కార్తీక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. బాలీవుడ్ న‌టి ట‌బు కూడా కీల‌క పాత్ర పోషిస్తోంది. గ‌తంలో నాగార్జున‌, ట‌బు క‌లిసి న‌టించారు కూడా. వెంకటేష్ దగ్గుబాటి సరసన తెలుగు హిట్ చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’లో చివరిగా కనిపించిన ఐశ్వర్య రాజేష్, ఈ చిత్రంతో మరో బలమైన పాత్రను దక్కించు కోవ‌డం విశేషం. చిత్రీకరణ వేగంగా సాగుతోంది, నగర శివార్లలో ఇప్పటికే దాదాపు 40 శాతం షూటింగ్ పూర్తయింది. నాగార్జున వ‌య‌సు ఇప్పుడు 60 ఏళ్లు. త‌న‌ను మ‌రింత యంగ్ గా ద‌ర్శ‌కుడు చూపించే ప్ర‌య‌త్నం చేస్తుండ‌డంతో అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. ఈ 100వ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ నిర్మిస్తోంది. ఇందులో సుష్మిత భ‌ట్ , విజ‌యేంద్ర కూడా కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు.
The post మ‌న్మ‌థుడి 100వ మూవీలో ఐశ్వ‌ర్య రాజేష్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సినీ రంగం అభివృద్ది కోసం సింగిల్ విండో విధానంసినీ రంగం అభివృద్ది కోసం సింగిల్ విండో విధానం

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్ర అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఐటీ, ఫార్మా

CM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్‌ రోడ్‌ షో లో సీఎం రేవంత్‌రెడ్డిCM Revanth Reddy: ఒక్క అవకాశం ఇవ్వండి – జూబ్లీహిల్స్‌ రోడ్‌ షో లో సీఎం రేవంత్‌రెడ్డి

CM Revanth Reddy : ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డలకు పెద్దపీట వేస్తున్న ఘనత కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. జూబ్లీహిల్స్‌ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి కాంగ్రెస్‌ అభ్యర్థి నవీన్‌ యాదవ్‌కు

IAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలుIAS Transfers: ఏపీలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు

    రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. మొత్తం 31 మంది అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా గురువారం ఆదేశాలు జారీ చేశారు.