hyderabadupdates.com Gallery మంచు విష్ణు స‌వాల్ కు సై అన్న‌ అనిరుధ్ రెడ్డి

మంచు విష్ణు స‌వాల్ కు సై అన్న‌ అనిరుధ్ రెడ్డి

మంచు విష్ణు స‌వాల్ కు సై అన్న‌ అనిరుధ్ రెడ్డి post thumbnail image

పాల‌మూరు జిల్లా : జ‌డ్చ‌ర్ల ఎమ్మెల్యే జ‌నంప‌ల్లి అనిరుధ్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న సినీ రంగంతో పాటు అన్ని రాజ‌కీయ పార్టీల నేత‌ల‌కు కోలుకోలేని ఝ‌ల‌క్ ఇచ్చారు. తాజాగా సినీ రంగంలోనే అత్య‌ధికంగా డ్ర‌గ్స్ తీసుకునే వారు ఉన్నార‌ని, ముందు వాళ్లు అంతా టెస్టులు చేయించు కోవాల‌ని అన్నారు. ఇందుకు సంబంధించి ప్ర‌తి 90 రోజుల‌కు ఒక‌సారి డ్ర‌గ్స్ టెస్టులు చేయించుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. ఈ సంద‌ర్బంగా త‌న‌ను ఉద్దేశించి మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడు మంచు విష్ణు తీవ్రంగా స్పందించారు. తాము టెస్టులు చేయించుకునే సినిమాలు చేస్తామ‌న్నారు. మీరు కూడా చేయించు కోవాల‌ని స‌వాల్ విసిరారు.
దీనికి ఇవాళ ఎమ్మెల్యే జ‌నంపల్లి అనిరుధ్ రెడ్డి స్పందించారు. మంచు విష్ణుకు అంత సీన్ లేద‌న్నారు. తాను ఏం మాట్లాడానో దానికి విరుద్దంగా మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఇక్క‌డ ఎవ‌రూ మౌనంగా లేరన్న విష‌యం తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు. తన తండ్రి మోహన్ బాబు ఏ టెస్ట్‌లు చేయించుకొని రాజ్యసభ సభ్యుడు అయ్యాడో ప్ర‌జ‌ల‌కు చెప్పాల‌న్నారు. మంచు విష్ణు వ్యాఖ్యలకు కాంగ్రెస్ అనిరుధ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మీ సోదరుడు మనోజ్ టెస్ట్‌లే మీరు చేయించ లేద‌న్నారు, మాపై ఆరోపణలు చేస్తే ఎలా అని తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. తాను ఒక ఎమ్మెల్యేగా డ్రగ్స్ టెస్ట్ చేయించుకుని రిపోర్టులు చూపిస్తాను, మీరు కూడా అదే విధంగా చేయాలని డిమాండ్ చేశారు అనిరుధ్ రెడ్డి.
The post మంచు విష్ణు స‌వాల్ కు సై అన్న‌ అనిరుధ్ రెడ్డి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

DNA Test: ఢిల్లీ పేలుడు నిందితుడు డాక్టర్ ఉమర్ డీఎన్‌ఏ పరీక్ష పలితం వచ్చేసిందిDNA Test: ఢిల్లీ పేలుడు నిందితుడు డాక్టర్ ఉమర్ డీఎన్‌ఏ పరీక్ష పలితం వచ్చేసింది

    ఢిల్లీ పేలుడు కేసులో దర్యాప్తు సంస్థల అనుమానం నిజమయ్యింది. సోమవారం సాయంత్రం ఎర్రకోట దగ్గర పేలిన ఐ20 కారును డాక్టర్ ఉమర్ మొహమ్మద్ నడిపారని డీఎన్‌ఏ పరీక్షా ఫలితాలను స్పష్టం చేస్తున్నాయని సంబంధిత వర్గాలు మీడియాకు తెలిపాయి. ఈ

CM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలుCM Chandrababu: కుటుంబసభ్యులతో సీఎం చంద్రబాబు దీపావళి సంబరాలు

    ఆంధ్రప్రదేశ్‌లో దీపావళి సంబరాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లె, పట్టణాలు, నగరాలు అని తేడా లేకుండా వీధులన్నీ ప్రజలతో నిండిపోయాయి. సోమవారం సాయంత్రం నుంచే వయసుతో సంబంధం లేకుండా ప్రజలంతా రోడ్లపైకి వచ్చి టపాసులు పేలుస్తూ ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.

Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్‌Minister Nara Lokesh: అభివృద్ధిలో బులెట్ ట్రైన్‌లా దూసుకెళ్తున్నాం – మంత్రి నారా లోకేశ్‌

Nara Lokesh : ఏపీలో అభివృద్ధి బుల్లెట్ ట్రైన్ లా దూసుకుపోతుందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. గతంలో మైక్రోసాఫ్ట్‌ హైదరాబాద్‌ రూపురేఖలు మార్చిందని.. ఇప్పుడు గూగుల్‌ పెట్టుబడులతో విశాఖ రూపురేఖలు మారబోతున్నాయని ఆయన స్పష్టం చేసారు. చరిత్ర