hyderabadupdates.com Gallery నోరు మూయించినా నేను గొంతెత్తి ప్ర‌శ్నిస్తూనే ఉంటా

నోరు మూయించినా నేను గొంతెత్తి ప్ర‌శ్నిస్తూనే ఉంటా

నోరు మూయించినా నేను గొంతెత్తి ప్ర‌శ్నిస్తూనే ఉంటా post thumbnail image

ఢిల్లీ : ఆప్ చీఫ్ అర‌వింద్ కేజ్రీవాల్ తీసుకున్న నిర్ణ‌యం ఇప్పుడు సంచ‌ల‌నంగా మారింది. రాజ్య‌స‌భ‌లో ఆప్ ప‌ద‌వి నుంచి తొల‌గించాల‌ని కోరుతూ స్పీక‌ర్ కు లేఖ ఇవ్వ‌డం ప‌ట్ల తీవ్రంగా స్పందించారు. ఈ మేర‌కు శుక్ర‌వారం ఎక్స్ వేదిక‌గా సీరియ‌స్ కామెంట్స్ చేశారు. తాను ఓడి పోలేద‌ని, అయితే నోరు మూయించే ప్ర‌య‌త్నం చేయ‌డం ప‌ట్ల బాధ‌ను వ్య‌క్తం చేయ‌డం చ‌ర్చకు దారితీసేలా చేసింది. రాఘ‌వ్ చ‌ద్దా గ‌త కొన్ని రోజుల నుంచి పార్ల‌మెంట్ సాక్షిగా ప్ర‌జలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ఏక‌రువు పెట్టారు. దేశం నుంచి ఎంద‌రో ఎంపీలుగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్నా ఏనాడూ సామాన్యులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల గురించి ప్ర‌స్తావించిన పాపాన పోలేదు. దీంతో ఒక్క‌సారిగా రాఘ‌వ్ చ‌ద్దా పేరు మారుమ్రోగి పోయింది. ఇప్పుడు సోషల్ మీడియా వేదిక‌గా త‌ను ట్రెండింగ్ లో కొన‌సాగుతున్నాడు.
రాఘ‌వ్ చ‌ద్దా లేవ‌దీసిన ప్ర‌శ్న‌లు సామాన్యుల‌కు ఆయుధాలుగా మారాయి. ఈ త‌రుణంలో ఆప్ పార్టీ త‌న ప‌ట్ల అనుస‌రించిన విధానంపై భ‌గ్గుమంటున్నారు నెటిజ‌న్లు. ఇది కేవ‌లం రాఘ‌వ్ చ‌ద్దాకు వ‌స్తున్న జ‌నాద‌ర‌ణ‌ను చూసి త‌ట్టుకోలేక‌నే ఇలా చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. రాజ్యసభ పదవి తొలగింపు తర్వాత ఆప్‌పై విమర్శలు గుప్పించారు ఎంపీ. పార్లమెంటులో తాను మాట్లాడకుండా తన సొంత పార్టీయే అడ్డుకోవడానికి ప్రయత్నించిందని ఆరోపించారు. నాకు అవకాశం దొరికినప్పుడల్లా, తరచుగా పట్టించుకోని అంశాలతో సహా, ప్రజలకు సంబంధించిన సమస్యలను పార్లమెంటులో లేవనెత్తుతాను. కానీ ప్రజల సమస్యల గురించి మాట్లాడటం నేరమా? నేను ఏదైనా నేరం చేశానా?ష‌ అని నిల‌దీశారు.
The post నోరు మూయించినా నేను గొంతెత్తి ప్ర‌శ్నిస్తూనే ఉంటా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు25న తిరుమలలో ర‌థ‌స‌ప్త‌మి..ఆర్జిత సేవ‌లు ర‌ద్దు

తిరుమల : టీటీడీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. సూర్య జయంతి సందర్భంగా జనవరి 25వ తేదీన తిరుమ‌లలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. పవిత్రమైన మాఘ మాసంలో

Pawan Kalyan: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం – పవన్ కల్యాణ్Pawan Kalyan: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం – పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో 100

రేపే ఒంటిమిట్ట‌లో కోదండ రాముడికి ప‌ట్టు వ‌స్త్రాలురేపే ఒంటిమిట్ట‌లో కోదండ రాముడికి ప‌ట్టు వ‌స్త్రాలు

అమరావతి : నెల్లూరు, కడప జిల్లాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించనున్నారు. ఓవైపు పేదల సేవలో, మరోవైపు భగవంతుని సేవలో అన్నట్టుగా ఒకే రోజు రెండు కార్యక్రమాల్లో సీఎం పాల్గొనున్నారు. మొదట నెల్లూరు జిల్లా వింజమూరులో పేదల సేవలో కార్యక్రమంలో