hyderabadupdates.com movies గందరగోళం ఎప్పుడు తీరుతుంది పెద్ది

గందరగోళం ఎప్పుడు తీరుతుంది పెద్ది

ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో ఏ వార్త వినాల్సి వస్తుందోనని ముందు జాగ్రత్త చర్యగా తమ ఏర్పాట్లలో తామున్నారు. దర్శకుడు బుచ్చిబాబు చెన్నై వెళ్ళిపోయి రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కోసం అక్కడే తిష్ట వేసినట్టు టాక్. ఐటెం సాంగ్ రెడీగా ఉన్నా ఎప్పుడు షూట్ చేస్తారనేది ఇప్పటిదాకా తేలలేదు. దాంట్లో ఆడే హీరోయిన్ ఎవరో కూడా తెలియదు.

రాకాస ప్రమోషన్లలో రామ్ చరణ్ ఎప్పుడైతే పెద్ది ఆలస్యం ఉండదని అన్నాడో అప్పటి నుంచి సీన్ మారిపోయింది. ఏప్రిల్ 30 రిలీజ్ అవుతుందని అధిక శాతం అభిమానులు ఇప్పటికీ నమ్మలేకపొతున్నారు. చేతిలో ఉన్న పాతిక రోజులు అన్ని పనులకు ఎలా సరిపోతాయనేది వాళ్ళ డౌట్. ఒకవేళ నిజంగా ఫిక్స్ చేసుకుంటే ఉరుకులు పరుగులు పెట్టి ఏదోలా మేనేజ్ చేయొచ్చు కానీ ముందైతే మాట మీద నిలబడుతుందా లేదానేది నిర్ధారించాల్సిన అవసరం ఉంది

ఇంకోవైపు పెద్ది రాక నుంచి అనుమానాలు తొలగకపోవడంతో మే 1 షెడ్యూల్ చేసుకున్న గాయపడ్డ సింహం పబ్లిసిటీ మొదలుపెట్టేసింది. రెగ్యులర్ గా ప్రమోషన్లు చేయడానికి ప్రణాళిక వేసుకుని దాన్ని అమలు చేస్తున్నారు. చివరి నిమిషంలో కనక పెద్ది వస్తుందని తెలిస్తే అప్పుడు తప్పుకుంటుంది తప్ప లేదంటే మాత్రం ఆన్ టైం వచ్చేస్తుంది. ఇప్పటికీ పెద్ది జూన్ 25కి వెళ్ళిపోయిందనే నమ్మకం చాలా మంది ఫ్యాన్స్ లో ఉంది. ఇదంతా క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చిన తంటా.

పాటలు, టీజర్లతో విపరీతమైన హైప్ తెచ్చుకున్న పెద్ది అంచనాల పరంగా పుష్ప 2 రేంజ్ లో మార్కెట్ లో డిమాండ్ తెచ్చుకుంది. 2026 లో ఇప్పటిదాకా మాస్ ని విపరీతంగా ఊపేసిన టాలీవుడ్ సినిమా ఒక్కటి కూడా రాలేదు. మన శంకరవరప్రసాద్ గారు పండగ అయిపోయిన పది రోజుల తర్వాత స్లో అయిపోయింది. అలా కాకుండా పుష్ప 2 లాగా సాలిడ్ రన్ చూపించే కెపాసిటీ పెద్దికి ఉందని బయ్యర్లు నమ్ముతున్నారు. మరి దర్శక నిర్మాతలు ఏదో ఒకటి తేల్చేస్తే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది.

Related Post

Analysing Howl’s Moving Castle (2004)Analysing Howl’s Moving Castle (2004)

Hayao Miyazaki’s  beloved classic traverses several themes — humanity, selfhood, compassion and belonging. Howl’s Moving Castle (2004), however, derives its most enduring message … Read more The post Analysing Howl’s Moving Castle (2004)