hyderabadupdates.com Gallery జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి

జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి

జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి post thumbnail image

న్యూఢిల్లీ : ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు కేంద్రం త‌క్ష‌ణ‌మే నిధులు మంజూరు చేయాల‌ని కోరారు రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న కేంద్ర రోడ్లు, రవాణా , హైవే శాఖ సెక్రటరీతో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రానికి సంబంధించి ప‌లు ప్ర‌తిపాద‌న‌లు అంద‌జేశారు. జాతీయ ర‌హ‌దారుల‌ ప్రాజెక్టుల అభివృద్ధి, విస్తరణ, పెండింగ్ సమస్యల పరిష్కారం వంటి అంశాలపై చ‌ర్చించారు. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన ప్రాజెక్టుల మంజూరు, అమలును వేగవంతం చేయాలని కోరారు. ఈ సంద‌ర్బంగా మంత్రి చేసిన‌ ప్రతిపాదనలకు అనుమతులు, పెండింగ్ సమస్యలపై సానుకూలంగా స్పందించారు సెక్ర‌ట‌రీ.
ఇదిలా ఉండ‌గా కార్య‌ద‌ర్శిని క‌లిసిన అనంత‌రం మంత్రి బీసీ జ‌నార్ద‌న్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని మోడీ ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలోని చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సమన్వయంతో ఏపీలో జాతీయ ర‌హ‌దారుల‌ ప్రాజెక్టులు వేగంగా ముందుకు సాగుతున్నాయని అన్నారు.. ఏపీలో ప్రస్తుతం జరుగుతున్న జాతీయ రహదారుల అభివృద్ధి ప్రాజెక్టుల మంజూరు, విస్తరణ పనుల అమలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని కేంద్ర రోడ్లు, రవాణా , హైవే శాఖ సెక్రెటరీ ఉమాశంకర్ ను కలిసి కోరడం జరిగిందన్నారు. అనంతరం ఆయనకు తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతిమను అందజేసి రాష్ట్రంలో జాతీయ రహదారుల విస్తరణకు సహకరించాలని మంత్రి విజ్ఞప్తి చేశామ‌న్నారు. ఈ సంద‌ర్బంగా సీఎం చంద్రబాబు నాయక‌త్వంలో రాష్ట్రం అభివృద్దిలో ప‌రుగులు తీస్తోంద‌న్నారు.
The post జాతీయ ర‌హ‌దారుల విస్త‌ర‌ణ‌కు స‌హ‌క‌రించాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

YS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖYS Jagan: సీఎం చంద్రబాబుకు వైఎస్ జగన్ లేఖ

    కృష్ణా జలాల పరిరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్… ఏపీ సీఎం చంద్రబాబుకు లేఖ రాసారు. ట్రిబ్యునల్ లో రాష్ట్ర ప్రభుత్వం తరపున గట్టిగా వాదనలు వినిపించి… ఏపీకు

PM Narendra Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి – ప్రధాని మోదీPM Narendra Modi: దేశానికి త్వరలో మావోయిస్టు హింస నుంచి విముక్తి – ప్రధాని మోదీ

Narendra Modi : దేశం, ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందే రోజు ఎంతో దూరంలో లేదని ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) తెలిపారు. దేశంలో మావోయిస్టు ప్రభావితజిల్లాల సంఖ్య గత 11 ఏళ్లలో 125 నుంచి మూడుకు

ఫిల్మ్ జర్నలిస్టుల సేవ‌లు ప్ర‌శంస‌నీయంఫిల్మ్ జర్నలిస్టుల సేవ‌లు ప్ర‌శంస‌నీయం

హైద‌రాబాద్ : తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ లు అందిస్తున్న సేవ‌లు అద్భుతంగా ఉన్నాయంటూ ప్ర‌శంసించారు మెగాస్టార్ చిరంజీవి. త‌న చేతుల మీదుగా TFJA డైరీ, ఇన్సూరెన్స్, ఐడి కార్డ్స్ లాంచ్ చేశారు. తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతి సంవత్సరం తెలుగు