hyderabadupdates.com Gallery సంజు శాంస‌న్ ఇలా ఆడితే ఎలా..?

సంజు శాంస‌న్ ఇలా ఆడితే ఎలా..?

సంజు శాంస‌న్ ఇలా ఆడితే ఎలా..? post thumbnail image

చెన్నై : ఐపీఎల్ 2026లో రుతురాజ్ గైక్వాడ్ సార‌థ్యంలోని చెన్నై సూప‌ర్ కింగ్స్ జ‌ట్టు ఆశించిన మేర రాణిండ‌చం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు మెగా టోర్నీలో రెండు మ్యాచ్ లు ఆడింది. ప్రారంభ మ్యాచ్ బెంగ‌ళూరు వేదిక‌గా జ‌ర‌గ‌గా ఆర్సీబీ చేతిలో ఓట‌మి పాలైంది. అనంత‌రం స్వంత గ‌డ్డ చెన్నై వేదిక‌గా జ‌రిగిన కీల‌క రెండో మ్యాచ్ లో సైతం చేతులెత్తేసింది. ప్ర‌ధానంగా భారీ ధ‌ర‌కు కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజు శాంస‌న్ ను రూ. 18 కోట్ల‌కు తీసుకుంది. త‌న కోసం టాప్ ప్లేయ‌ర్లు సామ్ క‌ర‌న్, ర‌వీంద్ర జ‌డేజాల‌ను వ‌దులుకుంది. ఈ త‌రుణంలో రెండు మ్యాచ్ ల‌లో బాగా ఆడ‌తాడ‌ని భావించిన సంజు శాంస‌న్ చివ‌రి క్ష‌ణంలో చేతులెత్తేయ‌డంతో జ‌ట్టుతో పాటు మేనేజ్మెంట్, త‌మిళ తంబిలు తీవ్ర నిరాశ‌కు లోన‌య్యారు.
అయితే ఇప్పుడే మించి పోయింది ఏమీ లేద‌ని, త‌ను ఫామ్ లోకి వస్తాడ‌ని, త‌ను మ‌రో ధోనీ కాగ‌ల‌డ‌ని అంతా భావిస్తున్నారు. ఇదే విష‌యాన్ని కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సైతం న‌మ్ముతున్నాడు. ఆ విష‌యాన్ని మీడియా వేదిక‌గా ప్ర‌క‌టించాడు కూడా. ఇదిలా ఉండగా ప్రపంచ కప్‌లో సంజు సామ్సన్ తన జీవితంలో ఏ క్రికెటర్ చేయని పని చేశాడు, అందుకే ఇప్పుడు అకస్మాత్తుగా ప్రజలు T20 లాంటి అధిక రిస్క్ ఉన్న ఫార్మాట్‌లో అతను ప్రతి గేమ్‌లో ఒక సినిమా సూపర్‌హీరోలా రాణించాలని ఆశిస్తున్నారు . తనదైన రోజున, సంజు సామ్సన్ తన జట్టుకు ఒంటరిగా మ్యాచ్‌లు గెలిపిస్తాడు. అలాంటప్పుడు ప్రతిరోజూ అతని రోజుగా ఉండాలని మీరు ఎలా ఆశిస్తున్నారు? అతను కనీసం 6 మ్యాచ్‌లు తనంతట తానుగా గెలిపిస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.
The post సంజు శాంస‌న్ ఇలా ఆడితే ఎలా..? appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

కాంగ్రెస్ మోసం నిరుద్యోగుల‌కు శాపం : కేటీఆర్కాంగ్రెస్ మోసం నిరుద్యోగుల‌కు శాపం : కేటీఆర్

హైద‌రాబాద్ : బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. మరో గ్యారెంటీ నుంచి నిస్సిగ్గుగా ముఖం చాటేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని చూసి తెలంగాణ నిరుద్యోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే 2 లక్షల

శ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించాలిశ్రీ కోదండ రామస్వామి కళ్యాణం ఘ‌నంగా నిర్వ‌హించాలి

ఒంటిమిట్ట / తిరుపతి : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమిష్టిగా కృషి చేయాలని కడప జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి సవిత పిలుపునిచ్చారు. ఒంటిమిట్టలోని టీటీడీ సమావేశ మందిరంలో కీల‌క స‌మావేశం నిర్వ‌హించారు.