hyderabadupdates.com movies రిపేర్లు సరే ముందు డ్యామేజ్ చూడండి

రిపేర్లు సరే ముందు డ్యామేజ్ చూడండి

ఎంత పెద్ద స్టార్ హీరో నటించిన సినిమా అయినా సరైన రీతిలో ప్రేక్షకులకు దానిని చేరవేయడం చాలా అవసరం. కానీ విశ్వంభర ఇవేవీ పట్టనట్టు ప్రవర్తిస్తోంది. గత ఏడాది సంక్రాంతికి రావాల్సిన ఈ ప్యాన్ ఇండియా మూవీ వాయిదా పడి పదిహేను నెలలు గడుస్తున్నా ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. హనుమాన్ జయంతికి పోస్టర్ రాలేదు. అంతకు ముందు శ్రీరామనవమిని వదిలేశారు. దానికి మునుపు ఉగాదికి ఏమైనా గుడ్ న్యూస్ చెబుతారనుకుంటే అదీ నెరవేరలేదు. పుణ్యకాలం కాస్తా గడిచిపోతోంది.

పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుకి జరిగిన పొరపాట్లు విశ్వంభరకు రిపీట్ కాకూడనేది మెగా ఫ్యాన్స్ కోరిక. విపరీతమైన జాప్యం వల్ల ఇలాంటి ప్రాజెక్టులకు క్రమంగా హైప్ తగ్గిపోతుంది. ఇన్ని సంవత్సరాలు తీశారనే సానుభూతి కన్నా అంత బాగా రాలేదు కాబట్టే లేట్ చేస్తున్నారన్న అభిప్రాయం కలిగే ప్రమాదముంది. మన శంకరవరప్రసాద్ రూపంలో బ్లాక్ బస్టర్ చిరంజీవి కొట్టిన తర్వాత కూడా విశ్వంభర ఆ అడ్వాంటేజ్ వాడుకోకపోవడం ముమ్మాటికీ అనుమానాలకు తావిచ్చేదే.

ముందైతే క్రమం తప్పకుండా సోషల్ మీడియాలో ఎంతో కొంత సౌండ్ వచ్చేలా చేయాలి. లీక్స్ ఇచ్చినా పర్లేదు లేదా అఫీషియల్ గా వదిలినా పర్లేదు ఏదో ఒక కంటెంట్ ఇస్తే దాని గురించి జనం మాట్లాడుకుంటారు. 2025 చిరంజీవి బర్త్ డే రిలీజ్ చేసిన టీజర్ తర్వాత మళ్ళీ ఎలాంటి సౌండ్ లేదు. ఈలోగా యువి క్రియేషన్స్ కు ఘాటీ రూపంలో ఒక డిజాస్టర్ పడింది. కమర్షియల్ గా బైకర్ ఎంతవరకు సేఫ్ అయ్యిందనేది ఇంకా తేలాల్సి ఉంది కాబట్టి వేచి చూడాలి.

విఎఫ్ఎక్స్ రిపేర్ల వల్ల ఇంత టైం తీసుకోవడం ఓకే కానీ ఓవర్ డిలే చేయడం కూడా కరెక్ట్ కాదు. ఆల్రెడీ సమ్మర్ స్లాట్స్ అయిపోతున్నాయి. స్వయంభు, పెద్ది, ప్యారడైజ్, నాగబంధం, భోగి లాంటి పెద్ద బడ్జెట్ సినిమాలు డేట్లు వేసుకుని రెడీగా ఉన్నాయి. ఇవన్నీ విశ్వంభర కన్నా చాలా ఆలస్యంగా మొదలైనవి. కానీ విడుదల విషయంలో క్లారిటీతో ఉన్నాయి. ఎటొచ్చి విశ్వంభర మాత్రం ఎక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు తరహాలో మీనమేషాలు లెక్కబెడుతూనే ఉంది.

Related Post

Athreyapuram Brothers Launched with an Interesting Concept PosterAthreyapuram Brothers Launched with an Interesting Concept Poster

A new Telugu film titled Athreyapuram Brothers was officially launched in a grand manner, drawing attention for its fresh concept and youthful approach. With changing audience tastes and evolving storytelling

ఇబ్బడి ముబ్బడిగా సీట్ల పెంపు మంచిదేనా?ఇబ్బడి ముబ్బడిగా సీట్ల పెంపు మంచిదేనా?

అటు పార్లమెంట్, ఇటు అసెంబ్లీలకు భారీ స్థాయిలో సీట్లు పెంచాలన్న నిర్ణయం సరైందేనా అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దేశంలో 140 కోట్ల జనాభాకు అనుగుణంగా 273 పార్లమెంట్ స్థానాలను పెంచుతున్నట్టు కేంద్రం చెబుతోంది. అలాగే అసెంబ్లీల్లో కూడా ప్రస్తుతం