hyderabadupdates.com Gallery 10న ఎంపీగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం

10న ఎంపీగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం

10న ఎంపీగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం post thumbnail image

బీహార్ : బీహార్ రాష్ట్ర చ‌రిత్ర‌లో అరుదైన రికార్డ్ సృష్టించారు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న‌కు రాష్ట్ర స‌ర్కార్ జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆయ‌న ఒప్పందంలో భాగంగా త‌ను కీల‌క‌మైన ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుండి త‌ప్పుకోక త‌ప్ప‌లేదు. ఇదిలా ఉండ‌గా తాను రాజ్య‌స‌భ స‌భ్యుడిగా ఎన్నిక‌య్యారు. ఈ మేర‌కు ఏప్రిల్ 10వ తేదీన ముహూర్తం ఖ‌రారు చేశారు. రాజ్య‌స‌భ‌లో స‌భ్యుడిగా ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. ఈ విష‌యాన్ని అధికారికంగా ప్ర‌క‌టించింది త‌ను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పార్టీ. త‌న వ‌య‌సు 75 ఏళ్లు. సుదీర్ఘ‌మైన రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నాయ‌కుడిగా గుర్తింపు పొందారు. త‌ను ఎన్నో మెట్ల‌ను ఎక్కి వ‌చ్చారు. అంతే కాదు బీహార్ లో సుదీర్ఘ కాలం పాటు సీఎంగా ప‌ని చేసిన రికార్డు కూడా త‌న‌పైనే ఉంది.
ఇదిలా ఉండ‌గా ఆదివారం నితీశ్ కుమార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. త‌ను రాజ‌కీయంగా ఎదిగేందుకు బీహార్ తోడ్పాటు అందించింద‌ని పేర్కొన్నారు. బీహార్ శాసనసభలోని ఉభయ సభలలో, అలాగే పార్లమెంట్ ఉభయ సభలలో సభ్యుడిగా ఉండాలనే తన చిరకాల కోరికను ఆయన వ్యక్తం చేశారు. ఆయ‌న ప్ర‌మాణ స్వీకారం గురించి బీహార్ బీజేపీ నాయకుడు సంజయ్ సరోగి ఆదివారం ధృవీకరించారు. ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం, సరోగి కొత్త మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించిన మార్గసూచిని వివరించారు. పార్టీ సీనియర్ నాయకత్వం , మిత్రపక్షాలతో కూడిన సహకార విధానానికి ఆయన ప్రాధాన్యతనిచ్చారు. ఎవ‌రు ఉండాలి ఎవ‌రు ఉండ కూడ‌ద‌నే దానిపై క‌లిసి కూర్చుని నిర్ణ‌యం తీసుకుంటామ‌ని తెలిపారు.
The post 10న ఎంపీగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Delhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యంDelhi Air Pollution: ఢిల్లీలో రికార్డు స్థాయికి వాయు కాలుష్యం

  దేశ రాజధాని ఢిల్లీ వాయు కాలుష్యం కుమ్మేసింది. మంగళవారం నమోదయిన వాయు నాణ్యత నాలుగేళ్ల కనిష్టానికి పడిపోయింది. 24 గంటల సరాసరి వాయు నాణ్యత సూచీ(ఏక్యూఐ) సోమవారం 4 గంటల సమయంలో 345కి పడిపోయి, వెరీ పూర్‌ విభాగంలో చేరిందని

మ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తిమ‌హిళా సాధికార‌త‌తోనే స‌మాజం పురోగ‌తి

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా బాలిక‌లు, యువ‌తులు, మ‌హిళ‌ల గురించి ప్ర‌స్తావించారు. వారు లేక‌పోతే ఈ స‌మాజం మ‌నుగ‌డ సాధించ‌ద‌ని పేర్కొన్నారు. వారు బాగుంటేనే అభివృద్ది సాధ్యం అవుతుంద‌ని స్ప‌ష్టం

47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు47 లక్ష‌ల మంది రైతుల‌కు రూ. 310 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. రాష్ట్రంలో 47 లక్షల మంది రైతులకు రూ.310 కోట్లు పంట నష్టపోయిన రైతులకు పెట్టబడి రాయితీ ఇచ్చామ‌న్నారు. రూ.10,816 కోట్ల మేర 24 గంటల్లో ధాన్య కొనుగోళ్ల