hyderabadupdates.com movies పరుగు పందెంలో అసలు గండం షురూ

పరుగు పందెంలో అసలు గండం షురూ

మొన్న శుక్రవారం రిలీజైన బైకర్, రాకాస మొదటి వీకెండ్ పూర్తి చేసుకున్నాయి. నిన్న ఐపీఎల్ లో సన్ రైజర్స్, సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ కీలక మ్యాచులు ఉండటంతో వాటి ప్రభావం థియేటర్ కలెక్షన్ల మీద పడింది. ఒక్క హాట్ స్టార్ లో వ్యూస్ చూస్తేనే అర్థం చేసుకోవచ్చు ఎంత మంది బుల్లితెరకు అతుక్కుపోయారో. ముఖ్యంగా మధ్యాన్నం, ఈవెనింగ్ షోల మీద ఈ ఎఫెక్ట్ తీవ్రంగా ఉంది. ఇక ఈ రెండు సినిమాలు చేస్తున్న పరుగు పందెంలో అసలు గండం వచ్చేసింది.

నిన్నటిదాకా హడావిడి చేసిన బైకర్, రాకాసలకు మండే టెస్ట్ మొదలయ్యింది. పాజిటివ్ టాక్ ఎంత ఉన్నా బైకర్ దాన్ని భారీ కలెక్టన్లుగా మార్చుకోలేకపోతోంది. ఎమోషన్ సరే మరి ఎంటర్ టైన్మెంట్ ఏదీ అన్న ప్రశ్నకు సమాధానం దొరక్క రెగ్యులర్ ఆడియన్స్ దీనికి దూరంగా ఉంటున్న వైనం స్పష్టం. ఫ్యామిలీ ఆడియన్స్ సైతం పూర్తి స్థాయిలో టర్న్ అవ్వలేదు. హైదరాబాద్ మెయిన్ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి కానీ మిగిలిన చోట్ల అదే సీన్ ఉందనుకుంటే పప్పులో కాలేసినట్టే.

సుమారు నలభై కోట్ల గ్రాస్ లక్ష్యంగా పెట్టుకున్న బైకర్ అందులో పాతిక శాతం అంటే పది కోట్లు మాత్రమే దాటిందని ట్రేడ్ టాక్. ఇంకా ప్రయాణం చాలా దూరం ఉంది. ఇక రాకాస మాస్, యూత్ కి బాగానే ఎక్కేసిన వైనం వసూళ్లలో తెలిసిపోయింది. బైకర్ ని స్పష్టంగా డామినేట్ చేస్తోంది. రాకాస బిజినెస్, బ్రేక్ ఈవెన్ ఇరవై కోట్ల దగ్గరే ఉండటంతో ఆల్రెడీ సగం అయిపోయింది కాబట్టి ఈ నాలుగైదు రోజుల్లో ఆ లాంఛనం అయిపోతుందని నిర్మాత నీహారిక ధీమాగా ఉన్నారు.

బుకింగ్ ట్రెండ్స్ అయితే అన్నింటికీ బాగా నెమ్మదించేశాయి. వీటితో పాటు రిలీజైన డబ్బింగ్ సినిమాలు లీడర్, కార్మేని సెల్వం దారుణంగా ఫెయిలవ్వగా దురంధర్ ది రివెంజ్ చాలా సెంటర్స్ లో మళ్ళీ ఊపందుకుంది. వచ్చే వారం డెకాయిట్, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ, పల్లి చట్టంబి వస్తున్న నేపథ్యంలో ఈ నాలుగు రోజులు శర్వా, సంగీత్ లకు కీలకం కానున్నాయి. ప్రమోషన్లు ఆపకుండా నాన్ స్టాప్ గా చేయాలని రెండు యూనిట్లు నిర్ణయించుకున్నాయట. ఇప్పుడిది అవసరం కూడా.

Related Post

Sajid Nadiadwala’s “O’Romeo”: An Engaging But Vicious Valentine ReleaseSajid Nadiadwala’s “O’Romeo”: An Engaging But Vicious Valentine Release

To celebrate this Valentine’s Day with romance and violence, Bollywood unleashes an epic action drama of gangster love and vengeance. Titled “O’Romeo”, the film stars Shahid Kapoor as a razor-wielding

రాజుగారి ప్రేమకథలో సరదా ఎక్కువేరాజుగారి ప్రేమకథలో సరదా ఎక్కువే

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి తర్వాత అనుకోకుండా జరిగిన చిన్న ప్రమాదం వల్ల గ్యాప్ తీసుకున్న నవీన్ పోలిశెట్టి ఈసారి అనగనగా ఒక రాజుతో వస్తున్నాడు. జనవరి 14 విడుదల కాబోతున్న ఈ ఎంటర్ టైనర్ ని సితార ఎంటర్ టైన్మెంట్స్