hyderabadupdates.com movies జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

జోష్ సినిమా ఆడదని ముందే తెలుసా?

టాలీవుడ్లో పెద్ద కుటుంబాల నుంచి వచ్చిన యువ కథానాయకుల్లో అత్యంత ఆడంబరంగా జరిగిన అరంగేట్రం అక్కినేని నాగచైతన్యదే అని చెప్పొచ్చు. టాలీవుడ్లో నంబర్ వన్ నిర్మాతగా ఉన్న దిల్ రాజు.. వాసు వర్మ అనే కొత్త దర్శకుడితో నాగార్జున కెరీర్లో మైల్ స్టోనీ మూవీ అయిన ‘శివ’ లైన్లోనే  ఎంతో జాగ్రత్తగా కథ రెడీ చేయించి.. పెద్ద బడ్జెట్లో సినిమా తీసి చైతూను లాంచ్ చేశాడు. అక్కినేని నాగేశ్వరరావు సహా ఇండస్ట్రీకి చెందిన అతిరథ మహారథులు.. ఈ సినిమా ఈవెంట్లలో పాల్గొన్నారు. 

కానీ చైతూ తొలి చిత్రం ‘జోష్’ అంచనాలను అందుకోలేకపోయింది. బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. అలా అని అది తీసిపడేయదగ్గ సినిమా కాదు. అందులో విషయం ఉంటుంది. కానీ ఆ కంటెంట్ మిస్ ఫైర్ అయింది. ఐతే ‘జోష్’ ఆడదని తనకు ముందే తెలుసని.. మొదట్నుంచి ఆ చిత్రం మీద ధీమాగా లేనని.. ఈ విషయాన్ని నిర్మాత దిల్ రాజుకు సైతం ముందే చెప్పానని అంటున్నాడు సీనియర్ హీరో జేడీ చక్రవర్తి.

‘జోష్’ షినిమాలో జేడీనే విలన్ పాత్రను పోషించిన సంగతి తెలిసిందే. ‘శివ’లో రౌడీయిజం చేసే కాలేజీ కుర్రాడి పాత్ర చేసిన జేడీ.. అందులో రఘువరన్ చేసిన భవానీ తరహా విలన్ క్యారెక్టర్‌ను ‘జోష్’లో పోషించాడు. తన పాత్ర, పెర్ఫామెన్స్ బాగున్నప్పటికీ.. సినిమా వర్కవుట్ కాలేదు. అది వర్కవుట్ కాదని తనకు ముందే తెలుసని ‘గాయపడ్డ సింహం’లో తన పాత్ర పరిచయానికి సంబంధించి నిర్వహించిన ప్రెస్ మీట్లో జేడీ తెలిపాడు. 

‘‘జోష్ సినిమా విషయంలో నేను ముందు నుంచి కాన్ఫిడెంట్‌గా లేను. అది వర్కవుట్ కాదేమో అని కథ విన్నపుడే అనిపించింది. ఈ విషయాన్ని నేనేమీ దాచుకోలేదు. నిర్మాత దిల్ రాజుకు చెప్పాను. ఆయన కూడా రిలీజ్ రోజు మిక్స్డ్ టాక్ వచ్చినపుడు నా మాటల గురించి ప్రస్తావించారు.

నేను నిజాయితీగా మాట్లాడతానని కాదు. నా మనసులో ఏమనిపించినా దాచుకోలేను. ‘జోష్’ విషయంలో కూడా అనిపించింది చెప్పేశా’’ అన్నాడు జేడీ. ఇక ‘గాయపడ్డ సింహం’లో తన పాత్ర గురించి చెబుతూ.. ప్రపంచంలోనే అత్యంత విలక్షణ నటుడైన కమల్ హాసన్ కూడా చేయని పాత్ర ఈ సినిమాలో తనకు దక్కిందని.. ఈ క్యారెక్టర్ ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని పంచుతుందని జేడీ అభిప్రాయపడ్డాడు.

Related Post

దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్దురంధర్‌ను చెడగొట్టిన నెట్‌ఫ్లిక్స్

దురంధర్.. గత ఏడాది డిసెంబర్లో విడుదలై.. ఇప్పటికీ థియేటర్లలో మంచి వసూళ్లు సాధిస్తున్న సినిమా. ఇంకా థియేట్రికల్ రన్ కొనసాగుతుండగానే ఆ చిత్రం డిజిటల్ రిలీజ్‌కు వచ్చేసింది. స్ట్రీమింగ్ జెయింట్ నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రాన్ని విడుదల చేసింది. ఐతే రిలీజ్ ముంగిట

Mahesh Babu’s son Gautam reviews Baahubali: The Epic in US and calls it a ‘goosebumps experience’Mahesh Babu’s son Gautam reviews Baahubali: The Epic in US and calls it a ‘goosebumps experience’

Telugu superstar Mahesh Babu’s son, Gautam Ghattamaneni, recently attended the grand US premiere of SS Rajamouli’s re-edited blockbuster, Baahubali – The Epic. The film, a 3-hour-45-minute version that combines Baahubali: