hyderabadupdates.com movies `గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

`గూగుల్‌`కు కొబ్బ‌రికాయ కొట్టేస్తున్నారు!

ఏపీలో కీల‌క ఘ‌ట్టానికి కూట‌మి ప్ర‌భుత్వం తెరదీయ‌నుంది. `గూగుల్ డేటా` కేంద్రానికి కొబ్బ‌రికాయ కొట్టేందుకు సిద్ధ‌మైంది. గ‌త ఏడాది ఈ వ్య‌వ‌హారంపై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌ర‌గ‌డం.. ఢిల్లీలో కేంద్ర ప్ర‌భుత్వ ఆధ్వ‌ర్యంలో ఒప్పందం కూడా చేసుకున్న విష‌యం తెలిసిందే. ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ సైతం.. ఈ ఒప్పందాన్ని ప‌లు సంద‌ర్భాల్లో కొనియాడారు. ఏపీలోని ఐటీ రాజ‌ధానిగా భాసిల్లుతున్న విశాఖ‌కు గూగుల్ డేటా కేంద్రం రానుంది. దీనికి సంబంధించి భూముల కేటాయింపు… వ‌న‌రుల కేటాయింపు వంటివి కూడా పూర్త‌య్యాయి.

గ‌త ఏడాది జ‌రిగిన ఒప్పందం మేర‌కు..విశాఖ‌లో 600 ఎక‌రాల‌కు పైగా భూమిని రాష్ట్ర ప్ర‌భుత్వం కేటాయించింది. దీనికి కేంద్ర జీఎస్టీ నుంచి మిన‌హాయింపు ఇచ్చింది. అదేస‌మ‌యంలోవిద్యుత్ సుంకాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం రాయితీగా ఇచ్చింది. అలాగే.. నీటిని ఉచితంగా ఇవ్వ‌నున్నారు. భూమి సిస్తు, ప‌న్నుల‌ను కూడా 5 సంవ‌త్స‌రాల పాటు మిన‌హాయించారు.. ఇలా.. అనేక రాయితీల‌పై ఒప్పందం కుదిరింది. కాగా.. డేటా కేంద్రాన్నిఏపీకి తెచ్చేందుకు.. మంత్రి నారా లోకేష్‌.. 2024లో అమెరికాకు వెళ్లి వారం రోజులు అక్క‌డే ఉండి ప్ర‌య‌త్నాల‌ను ముమ్మ‌రం చేశారు.

ఈ కృషి ఫ‌లితంగానే ఏపీకి డేటా కేంద్రం వ‌చ్చింది. అయితే.. వాస్త‌వానికి ఇత‌ర రాష్ట్రాలైన ఒడిశా(తీర ప్రాంత రాష్ట్రం) కూడా ప‌ట్టుబ‌ట్టిన‌ట్టు అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. చంద్ర‌బాబు కోరిక మేర‌కు కేంద్రం విశాఖ‌కు దీనిని కేటాయించింది. కాగా.. ఈ కేంద్రం నిర్మాణానికి సంబంధించిన అన్ని అనుమ‌తులు, భూమి బ‌దిలీ వంటివి ఒకింత ఆల‌స్యం కావ‌డంతో(రైతుల‌ను ఒప్పించ‌డంలోనే ఆల‌స్య‌మైంది.) కొంత మేర‌కు లేటైంది. తాజాగా దీనికి సంబంధించి ప్ర‌భుత్వం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. దీని ప్ర‌కారం.. ఈ నెల 28న డేటా కేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేయ‌నున్నారు.

తొలిద‌శ‌లో 200 ఎక‌రాల్లో నిర్మాణ ప‌నులు చేప‌డ‌తారు. దీనికే ఈ నెల‌లో భూమి పూజ చేస్తారు. అనంత‌రం.. రెండో ద‌శ‌లో 200 ఎక‌రాల్లోనూ చివ‌రి ద‌శ‌లో మ‌రో 200 ఎక‌రాల్లోనూ నిర్మాణాలు ప్రారంభ‌మవుతాయి. కాగా.. మొత్తం 15 బిలియ‌న్ డాల‌ర్ల‌ను పెట్టుబ‌డిగా గూగుల్ పెట్ట‌నుంది. అనేక మందికి ఉపాధి, ఉద్యోగాలు ల‌భిస్తాయ‌న్న అంచ‌నా ఉంది. కాగా.. ఈ గూగుల్ డేటా కేంద్రం ఏర్పాటులో అదానీ, రైడెన్ ఇన్ఫోటెక్ సంస్థ‌లు భాగ‌స్వాములుగా ఉన్నాయి. 

Related Post

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి

చెన్నైని అసలైనోళ్లే ముంచేస్తున్నారుచెన్నైని అసలైనోళ్లే ముంచేస్తున్నారు

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) బ్యాటర్ల విధ్వంసం ముందు చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తోకముడిచింది. ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆర్‌సీబీ 43 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించగా, చెన్నైకి ఇది ఈ సీజన్‌లో వరుసగా మూడో పరాజయం. టాస్ గెలిచి

సంచలనం… ఏకంగా 3 కోట్ల ఓట్లు గల్లంతు!సంచలనం… ఏకంగా 3 కోట్ల ఓట్లు గల్లంతు!

ఉత్తర ప్రదేశ్ రాజకీయాల్లో ఒక సంచలన విషయం బయటపడింది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ECI) విడుదల చేసిన కొత్త డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో ఏకంగా 2.89 కోట్ల మంది పేర్లు మాయమయ్యాయి. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) తర్వాత ఈ