hyderabadupdates.com Gallery నివాసాలే కాదు ప్లాట్లున్నా వాటి జోలికి హైడ్రా వెళ్ల‌దు

నివాసాలే కాదు ప్లాట్లున్నా వాటి జోలికి హైడ్రా వెళ్ల‌దు

నివాసాలే కాదు ప్లాట్లున్నా వాటి జోలికి హైడ్రా వెళ్ల‌దు post thumbnail image

హైద‌రాబాద్ : త‌మపై నిరాధార ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్న వారికి ధీటుగా జ‌వాబు ఇచ్చింది హైడ్రా. ఈమేర‌కు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. యూఎల్‌సీ (అర్బ‌న్ ల్యాండ్ సీలింగ్‌) భూముల్లోని పాత లే ఔట్ల‌లో ఇళ్ల‌నే కాదు.. ఖాళీ ప్లాట్లు ఉన్నా వాటి జోలికి హైడ్రా వెళ్ల‌ద‌ని స్ప‌ష్టం చేసింది. యూఎల్‌సీ భూముల్లోని పాత లే ఔట్ల‌లో రెగ్యుల‌రైజ్ కాని ఖాళీ ప్లాట్ల‌పై హైడ్రా చ‌ర్య‌లుండ‌వ‌ని పేర్కొంది. యూఎల్‌సీ భూముల్లో వెల‌సిన లే ఔట్ల‌లో ఖాళీగా ఉన్న‌ ప్లాట్ల‌ను హైడ్రా పేరు చెప్పి ఆక్ర‌మించేందుకు ఎవ‌రైనా ప్ర‌య‌త్నిస్తే వాటిని న‌మ్మ‌వ‌ద్ద‌ని న‌గ‌ర ప్రజ‌ల‌ను కోరింది. ఈ విష‌యంలో ఏవైనా సందేహాలుంటే నేరుగా హైడ్రా కార్యాల‌యానికి వ‌చ్చి నివృత్తి చేసుకోవాల‌ని సూచించింది. లే ఔట్ ప్ర‌కారం ర‌హ‌దారులు, పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాలు క‌బ్జా కాకుండా హైడ్రా కాపాడుతుంద‌ని కుండ బ‌ద్ద‌లు కొట్టింది. హైడ్రా ఏర్ప‌డ‌డానికి (19.7.2024) ముందు నివాసాలుంటే వాటిని కూల్చ‌మ‌ని హైడ్రా ఇప్ప‌టికే చాలాసార్లు స్ప‌ష్టం చేసింది.
ప్ర‌భుత్వ నిర్ణ‌యం మేర‌కు ఇదే విధానాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తోందని తెలిపింది హైడ్రా. ఈ మ‌ధ్య కాలంలో శేరిలింగంప‌ల్లి మండ‌లం కొండాపూర్ గ్రామంలోని ప‌లు యూఎల్‌సీ భూముల్లో వేసిన‌ లే ఔట్ల‌లో పార్కులు, ర‌హ‌దారులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల ఆక్ర‌మ‌ణ‌ల‌ను మాత్ర‌మే హైడ్రా తొల‌గించిందని తెలిపారు క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్. కొండాపూర్ గ్రామంలోని రాజ‌రాజేశ్వ రిన‌గ‌ర్‌, ఓయూ కాల‌నీ, రాఘ‌వేంద్ర కాల‌నీలోని పార్కులు, ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల‌ ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గింపే ఇందుకు నిద‌ర్శ‌నం అని తెలిపింది. కూక‌ట్‌ప‌ల్లి మండ‌లం హైద‌ర్‌న‌గ‌ర్‌లోని యూఎల్‌సీ భూముల్లో వెల‌సిన గోపాల్‌న‌గ‌ర్ లే ఔట్‌లో పార్కును కూడా ఇదే మాదిరి కాపాడిందని పేర్కొన్నారు. యూఎల్ సీ భూముల్లోని లే ఔట్ల‌లో రెగ్యుల‌రైజ్ కాని ప్లాట్ల‌ను హైడ్రా తీసుకుని ప్ర‌భుత్వానికి అప్ప‌జెబుతుంద‌ని కొంత‌మంది క‌బ్జాదారులు చేస్తున్న ప్రచారాన్ని న‌మ్మ‌వ‌ద్ద‌ని సూచించింది. మీ ఇంటి స్థ‌లాన్ని త‌క్కువ ధ‌ర‌కు సొంతం చేసుకోవాల‌నే కుట్ర కోణం ఉంద‌నే విష‌యాన్ని గ్ర‌హించాల‌ని హైడ్రా కోరింది.
The post నివాసాలే కాదు ప్లాట్లున్నా వాటి జోలికి హైడ్రా వెళ్ల‌దు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Degree Student: మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్యDegree Student: మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలే డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య

Degree Student : విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు డిగ్రీ కళాశాలలో దారుణం జరిగింది. కళాశాలలో మహిళా అధ్యాపకుల వేధింపులు తాళలేక… డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్ధి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కళాశాలలో ఇద్దరు మహిళా అధ్యాపకులు… తమ లైంగిక అవసరాలు తీర్చాలంటూ

Secreat Camera: ప్రియుడి కోసం ఉమెన్స్ హాస్టల్‌ బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన యువతిSecreat Camera: ప్రియుడి కోసం ఉమెన్స్ హాస్టల్‌ బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టిన యువతి

    కర్ణాటకలోని హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్‌ కంపెనీ మహిళా సిబ్బంది ఉండే హాస్టల్‌లోని బాత్‌రూంలో రహస్య కెమెరా ఎపిసోడ్‌లో సంచలన విషయం బయటకు వచ్చింది. తన ప్రియుడు చెబితేనే బాత్‌రూంలో తాను సీక్రెట్‌ కెమెరా అమర్చినట్టు నిందితురాలు చెబుతోంది.

Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !Fire Accident: బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం ! ఆరుగురు సజీవ దహనం !

    డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రాయవరంలోని గణపతి గ్రాండ్‌ బాణసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించింది. దీనితో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతుల్లో నలుగురు