hyderabadupdates.com Gallery ఇక శ‌ర‌వేగంగా బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులు

ఇక శ‌ర‌వేగంగా బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులు

ఇక శ‌ర‌వేగంగా బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులు post thumbnail image

నిర్మ‌ల్ జిల్లా : ప్ర‌సిద్ద పుణ్య క్షేత్రం బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులు ఇక శ‌ర‌వేగంగా కొన‌సాగుతాయ‌ని స్ప‌ష్టం చేశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నిర్మల్ జిల్లా బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ ఆలయ అభివృద్ధి పనులకు సోమ‌వారం శంకుస్థాపన చేశారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంత్రులు కొండా సురేఖ , జూపల్లి కృష్ణారావు, తదితరులతో కలిసి ముఖ్యమంత్రి భూమి పూజ నిర్వహించారు. దక్షిణ భారతదేశంలోని ఏకైక శ్రీ జ్ఞాన సరస్వతీ క్షేత్రాన్ని పునరుద్ధరించేందుకు శ్రీ‌కారం చుట్టామ‌న్నారు సీఎం ఈ సంద‌ర్బంగా. తద్వారా భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి రూ. 225 కోట్లతో పునర్నిర్మాణ పనులు చేప‌ట్ట‌డం జ‌రిగింద‌న్నారు.
ప‌నుల నాణ్య‌త విష‌యంలో ఎలాంటి రాజీ ప‌డ‌కూడ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. నిర్దేశించిన గ‌డువు లోగా అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌న్నారు సీఎం. నిధులు పుష్క‌లంగా ఉన్నాయ‌ని, రాబోయే గోదావ‌రి పుష్క‌రాల‌కు కూడా ఘ‌నంగా ఏర్పాట్లు చేస్తున్నామ‌న్నారు సీఎం. అంత‌కు ముందు రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా బాసర శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మ వారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు పి. సుదర్శన్ రెడ్డి, ఎంపీలు జి. నగేష్, వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు బి. మహేష్ కుమార్ గౌడ్ , దండే విఠల్ , సి. అంజిరెడ్డి ఎమ్మెల్యేలు ఎ. మహేశ్వర్ రెడ్డి , రామారావు పటేల్ , వెడ్మ బొజ్జు , ఇతర ప్రజాప్రతినిధులు, దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The post ఇక శ‌ర‌వేగంగా బాస‌ర ఆల‌య అభివృద్ది ప‌నులు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

మ‌హ‌నీయులు చ‌రిత్ర‌లో నిలిచి పోతారు : ల‌క్ష్మీ పార్వ‌తిమ‌హ‌నీయులు చ‌రిత్ర‌లో నిలిచి పోతారు : ల‌క్ష్మీ పార్వ‌తి

హైద‌రాబాద్ : ఎన్నేళ్లు గడిచినా మహనీయులు ఎప్పటికీ చరిత్రలో నిలిచి పోతారని చెప్పడానికి ఎన్టీఆర్ సాక్ష్యం అన్నారు వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు నంద‌మూరి ల‌క్ష్మీ పార్వ‌తి. ఆదివారం ఎన్టీఆర్ వ‌ర్దంతి సంద‌ర్బంగా ఆయ‌న కు ఘ‌నంగా నివాళులు అర్పించారు. అనంత‌రం ఆమె

స్వంత స‌ర్కార్ పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్స్వంత స‌ర్కార్ పై కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి ఫైర్

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డిని , మంత్రుల‌ను శాస‌న స‌భ వేదిక‌గా ఏకి పారేశారు కాంగ్రెస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి. ఎమ్మెల్యేల‌కు నిధులు ఇవ్వకుండా ఇబ్బందుల‌కు గురి చేస్తే ఎలా అని నిల‌దీశారు. ఇది

గోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలిగోదావ‌రి పుష్క‌రాల‌ను ఘ‌నంగా నిర్వ‌హించాలి

హైద‌రాబాద్ : బాసర నుంచి భద్రాచలం వరకు ఒక టెంపుల్ సర్క్యూట్ గా దేవాల‌యాలను అభివృద్ది చేస్తామ‌ని ప్ర‌క‌టించారు రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి. ఆధ్యాత్మిక వైభవంతో గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు త‌యారు