hyderabadupdates.com Gallery గ్రేడ్ – 3 మున్సిపాలిటీగా గొల్లప్రోలు నగర పంచాయతీ

గ్రేడ్ – 3 మున్సిపాలిటీగా గొల్లప్రోలు నగర పంచాయతీ

గ్రేడ్ – 3 మున్సిపాలిటీగా గొల్లప్రోలు నగర పంచాయతీ post thumbnail image

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రిపాల‌నా ప‌రంగా మ‌రింత ఫోక‌స్ పెట్టారు. ఈ మేర‌కు భారీ ఎత్తున నిధుల‌ను కేటాయించారు. అంతే కాకుండా గ్రామీణ ప్రాంతాల‌ను బ‌లోపేతం చేయ‌డంపై ఎక్కువ‌గా దృష్టి సారించాల‌ని ఉన్న‌తాధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌స్తుతం 100 రోజుల నీటి సంర‌క్ష‌ణ కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టారు. తాజాగా మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ కొణిద‌ల‌. ఇదిలా ఉండ‌గా తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పిఠాపురం శాస‌న స‌భ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కంక‌ణం క‌ట్టుకున్నారు డిప్యూటీ సీఎం. ఈ క్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఒక్కో అడుగు వడివడిగా వేస్తున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. ఆ క్రమంలో గొల్లప్రోలు నగర పంచాయతీని గ్రేడ్ 3 మున్సిపాలిటీగా అప్ గ్రేడ్ చేయించారు. మున్సిపాలిటీ హోదాతో గొల్లప్రోలు ప్రాంత అభివృద్ధికి మరిన్ని అవకాశాలు ఏర్పడనున్నాయి. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ , అర్బన్ డెవలప్మెంట్ శాఖ ద్వారా పట్టణ పరిధిలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ, పారిశుధ్యం, వీధి దీపాలు తదితర మౌలిక సదుపాయాల కల్పన వేగవంతం అవుతుంది. గ్రూప్ 2 స్థాయి అధికారి మున్సిపల్ కమిషర్ గా వస్తారు. మరింత మంది అదనపు సిబ్బంది అందుబాటులోకి రావడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించే వీలు కలుగుతుంది. మున్సిపల్ హోదా పెరిగినా ప్రజలపై ఎలాంటి అదనపు భారం ఉండదని ఈ సంద‌ర్బంగా ప్ర‌క‌టించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్ .
The post గ్రేడ్ – 3 మున్సిపాలిటీగా గొల్లప్రోలు నగర పంచాయతీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

అంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లుఅంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీలో అంగ‌న్వాడీల నిర్వ‌హ‌ణ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 257 ఐసిడిఎస్ ప్రాజెక్టులు పరిధిలో 55746

PM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీPM Narendra Modi: ఆత్మనిర్భర్‌ భారత్‌ సాధనకు ఆంధ్రప్రదేశ్ కీలకం – ప్రధాని మోదీ

Narendra Modi : ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా ఆంధ్రప్రదేశ్‌ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కర్నూలు శివారులోని నన్నూరు వద్ద ‘సూపర్‌ జీఎస్టీ- సూపర్‌ సేవింగ్స్‌’ పేరుతో ఏర్పాటు చేసిన బహిరంగసభకు గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌, సీఎం చంద్రబాబు

India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?India Alliance: ఇండియా కూటమిలో చీలికలు ?

      బిహార్‌ ఎన్నికల సంగ్రామంలో ఓ అనూహ్య మలుపు చోటుచేసుకుంది. విపక్ష ఇండియా కూటమి ‘మహాగఠ్‌బంధన్‌’లో చీలిక ఏర్పడింది. సీట్ల సర్దుబాటులో ఏకాభిప్రాయం కుదరక 10 సీట్లలో కూటమి ఐక్యతను పక్కనపెట్టి, తమ అభ్యర్థులను ఆయా పార్టీలు రంగంలోకి