hyderabadupdates.com Gallery జ్యోతిబా పూలే జీవితం స్పూర్తిదాయ‌కం : ఎస్ స‌విత‌

జ్యోతిబా పూలే జీవితం స్పూర్తిదాయ‌కం : ఎస్ స‌విత‌

జ్యోతిబా పూలే జీవితం స్పూర్తిదాయ‌కం : ఎస్ స‌విత‌ post thumbnail image

అమ‌రావ‌తి : మ‌హోన్న‌త మాన‌వుడు జ్యోతిబా పూలే అని కొనియాడారు రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. స‌విత‌. ఇవాళ ఆయ‌న జ‌యంతి సంద‌ర్భంగా పూలే చిత్ర ప‌టానికి పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు . తుది శ్వాస విడిచి వరకూ నమ్మిన సిద్ధాంతం కోసం పోరాడిన మహానీయుడు జ్యోతిరావు పూలే అని కొనియాడారు. జ్యోతిరావు పూలే స్ఫూర్తితో అన్న ఎన్టీఆర్ టీడీపీని స్థాపించారన్నారు. బీసీలకు, మహిళలకు, అణగారిన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత అన్న ఎన్టీఆర్ దేనన్నారు. ఎన్టీఆర్ బాటలో నడుస్తూ, సీఎం చంద్రబాబు నాయుడు బీసీలకు అన్నింటా ప్రాధాన్యమిస్తున్నట్లు చెప్పారు ఎస్. స‌విత‌. బీసీలకు రాజకీయ, ఆర్థిక, సామాజిక గుర్తింపు లభించేలా ఎన్నో పథకాలు, ప్రణాళికలు అమలు చేస్తున్నారన్నారు .
దేశంలోనే మొట్ట మొదటిసారిగా ఏపీలోనే బీసీ రక్షణ చట్టం తీసుకు రావడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఎస్. స‌విత‌. ఇది ముమ్మాటికీ సీఎం చంద్రబాబు ఘనతేనన్నారు. బీసీల విద్యకు ప్రాధాన్యమిస్తూ బీసీ హాస్టళ్లను, గురుకులాలను వందల కోట్లాది రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారన్నారు. బీసీ కుల వృత్తులకు వెన్నుదన్నుగా సీఎం చంద్రబాబు నిలిచారన్నారు. ప్రతి బీసీ కుటుంబం నుంచి ఒకరిని వ్యాపారవేత్తగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. జ్యోతిరావు పూలే ద్విశతాబ్ధి జయంతి ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. విజయవాడలో రాష్ట్ర స్థాయి జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. తమకు, తమ పార్టీకి మహ్మాత్మా జ్యోతిరావు ఆశయ సాధనే లక్ష్యమని మంత్రి సవిత తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేషన్ చైర్మన్లు వీరంకి వెంకట గురుమూర్తి, పేరేపి ఈశ్వర్, ఆకాశపు స్వామి, మల్లె ఈశ్వరరావు, చిలకలపూడి పాపారావు, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
The post జ్యోతిబా పూలే జీవితం స్పూర్తిదాయ‌కం : ఎస్ స‌విత‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Rahul Gandhi: ఓట్ల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు – రాహుల్‌గాంధీRahul Gandhi: ఓట్ల చోరీతోనే మోదీ ప్రధాని అయ్యారు – రాహుల్‌గాంధీ

    ఓట్ల చోరీ అంశంపై బీజేపీ, ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకుంటూ లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల్లో పెద్ద మొత్తం(టోకుగా)లో ఓట్లను చోరీ చేసే పనిలో బీజేపీ నిమగ్నమైందని, ఈ విధంగానే మోదీ

నారా లోకేష్ ప్ర‌తిపాద‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఆలంబ‌ననారా లోకేష్ ప్ర‌తిపాద‌న ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ఆలంబ‌న

అమ‌రావ‌తి : దావోస్ లో ప్ర‌పంచ ఆర్థిక స‌ద‌స్సు ముగిసింది. ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు చేసిన ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయి. భారీ ఎత్తున కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వ‌చ్చాయి. ఇదేక్ర‌మంలో వ‌ర‌ల్డ్ లోనే