hyderabadupdates.com movies సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

సర్దార్ 2 ఎందుకు రావడం లేదు

తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో వచ్చిన మొదటి భాగం కోలీవుడ్ లో సూపర్ హిట్ కాగా టాలీవుడ్ లో కమర్షియల్ గా వర్కౌట్ అయ్యింది. ఇందులో రెండు షేడ్స్ లో కార్తీ ఇచ్చిన పెర్ఫార్మన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అప్పటి నుంచే దీనికి సీక్వెల్ కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తూ వచ్చారు. దర్శకుడు మిత్రన్ దానికి అనుగుణంగా ఓపెన్ క్లైమాక్స్ పెట్టి పార్ట్ 2కి లీడ్ ఇచ్చి వదిలేశారు.

కట్ చేస్తే మొన్నటి ఏడాదే సర్దార్ 2 షూటింగ్ మొదలైపోయి దాదాపు ఫినిషింగ్ స్టేజికి వచ్చేసింది. అన్నీ అనుకున్న ప్రకారం జరిగితే 2025 దీపావళికి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ జరగలేదు. మార్చిలో మైసూర్ లో ఒక ఫైట్ షూట్ చేస్తుండగా కార్తీ కాలికి గాయం తగిలి బ్రేక్ వేశారు. తర్వాత స్టంట్ మ్యాన్ ఏలుమలై ఒక ఛేజ్ తీస్తుండగా చనిపోవడంతో మళ్ళీ బ్రేక్ పడింది. ఇలా రకరకాల వాయిదాలు తీసుకుంటూ సర్దార్ 2 వార్తల్లో నలుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా క్లారిటీ లేదు.

మాళవిక మోహనన్, ఆషిక రంగనాథ్ హీరోయిన్లు నటించిన ఈ స్పై డ్రామాలో ఎస్జె సూర్య మెయిన్ విలన్ గా నటించారు. అజర్ బైజాన్, బ్యాంకాక్, కజకస్తాన్ లాంటి ప్రాంతాల్లో భారీ ఎత్తున యాక్షన్ ఎపిసోడ్లు తీశారు. ఇంతా జరిగి రిలీజ్ విషయంలో ఏర్పడ్డ సందిగ్దత ఫ్యాన్స్ ని కలవరపెడుతోంది. ఖైదీ 2 మీద ఎంత క్రేజ్ ఉందో దానికి మిన్నగా సర్దార్ 2 వచ్చిందని, కానీ ప్రొడక్షన్ ఇష్యూస్ ని సరిగా హ్యాండిల్ చేయకపోవడం వల్ల లేట్ అవుతోందని చెన్నై టాక్.

అన్నయ్య సూర్యతో క్లాష్ కాకుండా సర్దార్ 2 విడుదలని ప్లాన్ చేస్తున్నారు. సూర్య రెండు కొత్త రిలీజులు వీరభద్రుడు, విశ్వనాధ్ అండ్ సన్స్ కేవలం మూడు నెలల గ్యాప్ లో థియేటర్లలో అడుగు పెట్టనున్నాయి. ఆ తర్వాతే కార్తీ సర్దార్ 2 రంగంలోకి దిగుతుంది. కార్తీ భారీ కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాడు. అన్నగారు వస్తారు దారుణంగా డిజాస్టర్ కావడం ఊహించలేకపోయాడు. క్యామియో చేసిన కంగువ కూడా పోయింది. సో ఇప్పుడు ఆశలన్నీ సర్దార్ 2 మీదే ఉన్నాయి. అవి తీరాలనే ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Related Post

గర్ల్ ఫ్రెండ్ ఏ స్థాయికి వెళ్తుందిగర్ల్ ఫ్రెండ్ ఏ స్థాయికి వెళ్తుంది

రష్మిక మందన్న టైటిల్ రోల్ పోషించిన ది గర్ల్ ఫ్రెండ్ కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. టీమ్ చేసిన విస్తృతమైన ప్రమోషన్లు వర్కౌటయ్యాయి. టాక్, రివ్యూలు పాజిటివ్ గా రావడం వసూళ్లకు దోహదం చేస్తోంది. శుక్ర శనివారాలతో పోలిస్తే ఆదివారం ట్రెండింగ్ చాలా

‘అందుకే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌న‌మ‌ని చెబుతున్నా’‘అందుకే ఎక్కువ మంది పిల్ల‌ల్ని క‌న‌మ‌ని చెబుతున్నా’

ప్రపంచంలోని ప‌లు దేశాల్లో వృద్ధ జ‌నాభా ఇప్పుడు పెను స‌వాలుగా మారుతోంద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. మ‌న‌దేశం మాత్ర‌మే ప్ర‌స్తుతం యువత ఎక్కువ‌గా ఉంద‌న్నారు. అయితే వ‌చ్చే 20 ఏళ్ల త‌ర్వాత ఈ ప‌రిస్థితి కూడా తారుమార‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు.