hyderabadupdates.com Gallery 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం post thumbnail image

తిరుపతి : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు భక్తి, వైభవాలతో ఘనంగా నిర్వహించనున్నారు. ఉత్సవాలకు ముందు ఏప్రిల్ 29న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ కార్యక్రమం జరగనుంది. భక్తులు ఒక్కొక్కరు రూ.150/- చెల్లించి వసంతోత్సవ సేవలో పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవచ్చు . ఉత్సవాల్లో భాగంగా మే 1వ తేదీ ఉదయం 9.30 గంటలకు స్వర్ణ రథోత్సవం కన్నుల పండువగా జరుగనుంది. మూడు రోజుల పాటు మధ్యాహ్నం 2.30 నుండి సాయంత్రం 4.30 గంటల వరకు శుక్రవారపు తోటలో అమ్మ వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం నిర్వహించ బడుతుంది. రాత్రి 7.30 నుండి 8.30 గంటల వరకు ఆలయ నాలుగు మాడ వీధుల్లో అమ్మవారు విహరించి భక్తులకు దర్శనమిస్తూ కటాక్షిస్తారు.
వసంతోత్సవాలను పురస్కరించుకుని ఏప్రిల్ 28వ తేదీన ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం విశేషంగా నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి, ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమం చేపడతారు. ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామగ్రి మొదలైనవన్నీ పవిత్ర జలంతో శుద్ధి చేయబడతాయి. నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ వంటి సుగంధ ద్రవ్యాలతో కలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం ఉదయం 9 గంటల నుండి భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు.
ఈ ఉత్సవాల నిర్వహణ కారణంగా ఏప్రిల్ 28, ఏప్రిల్ 30 నుండి మే 02వ తేదీ వరకు కళ్యాణోత్సవం, సహస్రదీ పాలంకార సేవలను టీటీడీ రద్దు చేసింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ పద్మావతి అమ్మవారి కటాక్షాన్ని పొందాలని టీటీడీ కోరుతోంది.
The post 28న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఎంద‌రో త్యాగాల ఫ‌లితం నేటి భార‌త దేశంఎంద‌రో త్యాగాల ఫ‌లితం నేటి భార‌త దేశం

అమ‌రావ‌తి : ఈ దేశ విముక్తి కోసం ఎంద‌రో త‌మ విలువైన ప్రాణాలు త్యాగం చేశారు. వారు చేసిన త్యాగాలు, బ‌లిదానాల వ‌ల్ల‌నే ఇవాళ భార‌త దేశం స‌మున్న‌త‌మైన రీతి లో ముందుకు సాగుతోంద‌ని అన్నారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.

గిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళంగిల్ కు అంద‌లం శాంస‌న్ కు మంగ‌ళం

ముంబై : స్వ‌దేశంలో న్యూజిలాండ్ తో వ‌న్డే సీరీస్ ఆడ‌నుంది భార‌త జ‌ట్టు. ఇందులో భాగంగా ముంబైలోని బీసీసీఐ కార్యాల‌యంలో కీల‌క స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్బంగా 15 మంది ఆట‌గాళ్ల‌తో కూడిన జ‌ట్టును ప్ర‌క‌టించింది బీసీసీఐ సెలెక్ష‌న్ క‌మిటీ. దేశీవాళి

ప్లాన్ లేకుండా పిల్ల‌ల‌ను కంటే ఎలా..?ప్లాన్ లేకుండా పిల్ల‌ల‌ను కంటే ఎలా..?

హైద‌రాబాద్ : ప్ర‌ముఖ విలక్ష‌ణ న‌టి వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. ఆమె ప్ర‌త్యేకించి సెక్స్ గురించి ప్ర‌స్తావించారు. ఇండియాకు స్వేచ్ఛ ల‌భించి 75 ఏళ్ల‌వుతున్నా ఇంకా సెక్స్ గురించి మాట్లాడ‌టం వింత‌గా చూస్తారంటూ పేర్కొన్నారు. తాజాగా వ‌ర‌లక్ష్మి