hyderabadupdates.com movies తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

తేడా కొడుతోంది అనిరుధ్ భాయ్

సౌత్ మ్యూజిక్ లో సెన్సేషన్ అంటే అనిరుధ్ రవిచందర్ పేరే ముందు గుర్తొస్తుంది. తను పని చేస్తున్నాడని తెలిస్తే చాలు ఆ సినిమా మ్యూజిక్ రైట్స్ అమాంతం ఆకాశంలో ధరలు పలుకుతాయి. కానీ గత రెండేళ్లుగా అనిరుధ్ తన మేజిక్ మిస్ అవుతున్న ఫీలింగ్ మ్యూజిక్ లవర్స్ లో కలుగుతోంది. ఆయా చిత్రాల కమర్షియల్ ఫలితాలతో తనకు సంబంధం లేకపోయినా కనీసం ఆల్బమ్ వరకు మంచి పాటలు ఇచ్చి ఉంటే సంగీత ప్రియులు ఎంజాయ్ చేసేవాళ్లనేది వాస్తవం.

తాజాగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ డిజాస్టర్ అయ్యింది. విచిత్రం ఏమిటంటే అనిరుధ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కి తప్ప దీనికి సాంగ్స్ ఇచ్చింది తనేననే విషయం సాధారణ ప్రేక్షకులకు రిజిస్టర్ కాలేదు. దీనికన్నా ముందు వచ్చిన శివ కార్తికేయన్ ‘మదరాసి’ పరిస్థితి కూడా ఇంతే. ‘కూలీ’లో మోనికా మోనికా పాట తప్ప మిగిలినదంతా నీరసం తెప్పించిన స్కోరే. కింగ్డమ్, విదాముయార్చి, వెట్టయన్, ఇండియన్ 2 అన్నింటిది ఇదే పరిస్థితి. ‘దేవర’ ఒక్కటే తన రేంజ్ ఆల్బమ్ అని చెప్పాలి.

వీలైనంత త్వరగా అనిరుధ్ బౌన్స్ బ్యాక్ అవ్వాలి. చేతిలో ఇంకా బోలెడు సినిమాలున్నాయి. ‘జన నాయకుడు’ పాటలు సోసోగానే అనిపించాయి. ‘జైలర్ 2’కి అదరగొట్టే రేంజ్ లో వర్క్ చేయాలి. నాని ‘ప్యారడైజ్’లో ఆయా షేర్ తరహాలో అన్ని పాటలు ఉంటే కనక మరోసారి సోషల్ మీడియాని ఊపేయొచ్చు. షారుఖ్ ఖాన్ ‘కింగ్’తో పాటు కమల్ – రజని మల్టీస్టారర్ కూడా అనిరుధ్ ఖాతాలోనే ఉన్నాయి. అల్లు అర్జున్ 23 తనకే దక్కే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

ఒకపక్క సాయి అభ్యంక్కర్ దూసుకుపోతున్నాడు. అనిరుధ్ ప్రత్యాన్మయంగా ఆల్రెడీ తనను నిర్మాతలు భావించడం మొదలైపోయింది. సో అనిరుధ్ సాలిడ్ గా తనను తాను మళ్ళీ ప్రూవ్ చేసుకోవాల్సిందే. ఏఆర్ రెహమాన్ పెద్దికి కొట్టి తన సత్తా మళ్ళీ చాటినట్టు తన బలమేంటో బక్కోడు (ఫ్యాన్స్ ముద్దుగా పిలుచుకునే పేరు) మళ్ళీ ప్రపంచానికి చూపించాలి. అరడజను సినిమాల్లో కనీసం మూడు వర్కౌట్ అయినా చాలు నిర్మాతల క్యూ అలాగే కొనసాగుతుంది.

Related Post

మెగా మాస్ – 300 కోట్లు… 3 మిలియన్ల డాలర్లుమెగా మాస్ – 300 కోట్లు… 3 మిలియన్ల డాలర్లు

అంచనాలకు మించి ఆడేస్తున్న మన శంకరవరప్రసాద్ గారు కొన్ని ప్యాన్ ఇండియా సినిమాలకు సైతం సాధ్యం కాని రికార్డులను చాలా అలవోకగా దాటేస్తున్నాడు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్న చిరంజీవి ఈ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవుతారని ఊహించిన వాళ్ళు తక్కువ. ఎనిమిదో రోజే