hyderabadupdates.com movies పుట్టినరోజు.. పెళ్ళి రోజు.. పోలీసులకు సెల రోజే!

పుట్టినరోజు.. పెళ్ళి రోజు.. పోలీసులకు సెల రోజే!

వైసీపీ అధినేత జగన్ చేయలేనిది ఇప్పుడు అనేక విషయాల్లో కూటమి ప్రభుత్వం చేసి చూపిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా రాష్ట్రస్థాయి పోలీసులకు కీలకమైన సెలవుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకనుంచి వ్యక్తిగత అవసరాలకు పోలీసులకు సెలవులు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం పోలీసుల కుటుంబాల్లో జరిగే పుట్టినరోజులు, పెళ్లిరోజు వేడుకలకు వ్యక్తిగత సెలవులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

దీనిని కచ్చితంగా అమలు చేయాలని పేర్కొంటూ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అంతేకాదు సెలవులు ఇవ్వకపోతే కనుక తీవ్ర పరిణామాలు ఉంటాయని ఉన్నతాధికారులను హెచ్చరించడం మరింత ఆసక్తిగా మారింది. ఇప్పటికే వారాంతపు సెలవులు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుని అమలు చేస్తోంది. ప్రతి పోలీసుకు వీక్లీ సెలవులు ఇస్తున్నారు. ఇప్పుడు దాంతో పాటుగా పుట్టినరోజులు పెళ్లిరోజు వేడుకలకు కూడా సెలవులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

వాస్తవానికి ఇప్పటివరకు వారాంతపు సెలవుల విషయంలోనే పోలీసులు ఇబ్బంది పడిన పరిస్థితి కనిపిస్తోంది. గత 2019 ఎన్నికలకు ముందు ఈ వ్యవహారం ఎన్నికల హామీగా కూడా మారింది. అప్పట్లో వైసీపీ అధినేత జగన్ తాను అధికారంలోకి వస్తే పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తానని చెప్పారు. సమాజం కోసం ప్రజల కోసం శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పనిచేస్తున్న పోలీసులకు విశ్రాంతి అవసరమని చెప్పారు. కానీ దీనిని అమలు చేయడంలో ఆయన పూర్తిగా విఫలమయ్యారు.

కొన్నాళ్లపాటు వారాంతపు సెలవులు అమలు చేసినప్పటికీ ఆ తర్వాత ఒత్తిడి కారణంగా పని భారం కారణంగా ఈ సెలవులను రద్దు చేశారని ఒక వాదన వినిపించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీ ఇవ్వక పోయినప్పటికీ రాష్ట్ర పోలీసులకు మేలు జరిగేలా వారాంతపు సెలవులు ఇవ్వడంతో పాటు ప్రత్యేకంగా పుట్టినరోజులు పెళ్లిరోజు వేడుకలకు కూడా సెలవులు ఇవ్వడం అనేది పోలీసులను ఆనందానికి గురి చేస్తున్న అంశం. దీంతో ప్రభుత్వం పై పోలీసుల సానుకూలత మరింత పెరిగే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.

గడిచిన దశాబ్ద కాలం పాటు కేవలం హామీకే పరిమితమైన సెలవుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కీలకంగా మారింది. దేశ‌వ్యాప్తంగా ఉన్న‌ పరిస్థితిని గమనిస్తే భద్రత వ్యవస్థలో ఉన్న సిబ్బందికి సెలవులు దొరకని పరిస్థితి ఏర్పడింది. అనేక రాష్ట్రాల్లో ఇప్పటికీ వారాంతం సెలవులు ఇవ్వడమే గగనంగా మారిన నేపథ్యం కనిపిస్తోంది.

దీనికి భిన్నంగా రాష్ట్ర ప్రభుత్వం వారాంతపు సెలవులతో పాటు ప్రత్యేక సెలవులు కేటాయిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడం పోలీసులను సంతోషానికి గురిచేస్తుంది. ఏది ఏమైనప్పటికీ వైసీపీ అధినేత ఇచ్చిన హామీ నిలబెట్టి కోకపోవడం, కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వకపోయినా దానిని అమలు చేయడం ఇప్పుడు రాజకీయంగా కూడా ఆసక్తిగా మారింది.

Related Post

3 Malayalam movies to watch on OTT: Noble Babu Thomas’ Karam to Nerariyum Nerathu3 Malayalam movies to watch on OTT: Noble Babu Thomas’ Karam to Nerariyum Nerathu

Cast: Abhiram Radhakrishnan, Shibla Farah, Swathi Das Prabhu, Rajesh Azhikodan, Swetha Vinod, Nisanth SS, Aparna Vivek Director: Renjith Venugopal Genre: Romantic Drama Runtime: 1 hour and 32 minutes Streaming Date: