hyderabadupdates.com Gallery ‘ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

‘ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌

‘ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌ post thumbnail image

హైదరాబాద్: జో శర్మ ప్రధాన పాత్రలో, ప్రముఖ దర్శకుడు మోహన్ వడ్లపట్ల తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఎం4ఎం (Motive for Murder)’ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుదలకు సిద్ధ‌మైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా, ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న “Who is the Killer” పాటను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ పాటకు భాను మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు. ఈ పాట తాజాగా ఆదిత్య మ్యూజిక్ ద్వారా తెలుగు, హిందీ భాషల్లో విడుదలైంది. ఆకట్టుకునే ట్యూన్‌తో, ఎనర్జిటిక్ మ్యూజిక్ ఆండ్ విజువల్స్ ఇప్పటికే మంచి స్పందన పొందుతోంది.
ఈ చిత్రంలో జో శర్మ – సమ్బీత్ ఆచార్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల దర్శకత్వం వహించి, నిర్మించారు. ఆకట్టుకునే టైటిల్, ఆసక్తికరమైన ప్రమోషనల్ కంటెంట్‌తో, M4M ఆసక్తిని పెంచుతోంది. ఈ మూవీ హీరోయిన్, అమెరికన్ నటి జో శర్మ ప్ర‌ముఖ న‌టుడు బాలకృష్ణని కలిసి, చిత్రంలోని పాటను ఆయనకు చూపించారు. విజువల్స్, ప్రెజెంటేషన్‌ను చూసి బాలకృష్ణ చిత్ర యూనిట్‌ని అభినందించారు. అంతే కాకుండా, “ఎవడు వాడు” అనే క్యాచీ లైన్‌ను ఆయన స్వయంగా హమ్ చేశారు.
ఈ సంద‌ర్బంగా జో శర్మ.. బాల‌కృష్ణ ఆశీస్సులు తీసుకున్నారు. బాల‌కృష్ణ లాంటి ప్ర‌ముఖ న‌టుడిని క‌లిసి ఆశీర్వాదాలు పొంద‌డం సంతోషంగా ఉంద‌ని జో శర్మ తెలిపారు. ఆయ‌న ఆత్మీయంగా ఆహ్వానించి, చిత్ర యూనిట్ అంద‌రికి విషెస్ చెప్పార‌ని, టీమ్‌కి కొత్త‌ ఉత్సాహ‌న్నిచ్చింద‌ని అన్నారు. మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్‌పై, McWin Group USA సహకారంతో రూపొందిన ఈ సినిమా మే 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో 5 భాష‌ల్లో రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
The post ‘ఎం4ఎం’ సినిమా పాట‌ను ప్ర‌శంసించిన బాల‌కృష్ణ‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలిసంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలి

న్యూఢిల్లీ : భార‌త దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న జాతిని ఉద్దేశించి ప‌లు సూచ‌న‌లు చేశారు. ప్ర‌స్తుతం ప‌శ్చిమాషియాలో యుద్ద వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పై ఏక‌ప‌క్ష

చ‌రిత్ర సృష్టించిన బొంబై క‌మిష‌న‌ర్ అశ్విని భిడేచ‌రిత్ర సృష్టించిన బొంబై క‌మిష‌న‌ర్ అశ్విని భిడే

ముంబై : సీనియ‌ర్ ఐఏఎస్ ఆఫీస‌ర్ అశ్విని బిడే సంచ‌ల‌నంగా మారారు. మ‌హారాష్ట్ర చ‌రిత్ర‌లో బొంబై మున్సిప‌ల్ కార్పొరేష‌న్ కు తొలిసారిగా మ‌హిళా క‌మిష‌న‌ర్ గా నియ‌మితులు కావ‌డం విశేషం. రాష్ట్ర స‌ర్కార్ ఆమె ప‌నితీరు ఆధారంగా ఏరికోరి త‌న‌కు బాధ్య‌త‌లు

స్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యంస్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యం

కుప్పం : స్వర్ణ కుప్పం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభవృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు పలు