ఏపీ రాజధాని అమరావతిపై వైసీపీ నాయకులు అదే అక్కసు ప్రదర్శిస్తున్నారు. రాజధానిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. జగన్ ప్రతిపాదించిన మావిగన్‌ను ప్రస్తావిస్తూ.. దానిని కొనియాడుతూ.. మరోవైపు అమరావతి వ్యవహారంపై విమర్శలు చేస్తున్నారు. గత నాలుగు రోజులుగా వరుసగా మీడియా సమావేశాలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి వైసీపీ కీలక నాయకుడు పేర్ని నాని తన మనసులోని మాటను మరోసారి బయట పెట్టారు.
అమరావతిని తామేమీ అడ్డు కోవడం లేదన్నారు. అయితే.. అమరావతిని ఎవరూ అడ్డుకోకుండా.. దానంతట అదే ఆగిపోయే శాపం దానికి ఉందని తీవ్ర వ్యాఖ్యానించారు. “ఎవరో పనిగట్టుకుని అమరావతిని ఆపే యాల్సిన అవసరం లేదు. అయినా.. ఆ పాపం మాకెందుకు?. చంద్రబాబు ప్రారంభించిన అమరావతికి.. చంద్రబాబుకు శాపం ఉన్నట్టుగానే అమరావతికి కూడా శాపం ఉంది. “ అని వ్యాఖ్యానించారు. “చుక్క చినుకు పడితే.. ఆగిపోవడం అనేది అమరావతికి ఉన్న శాపం“ అని చెప్పారు.
మరో నెల రోజుల్లో రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభం అవుతుందని.. అప్పుడు ఎవరూ ఆపకుండానే..ఎవరి చర్యలు లేకుండానే అమరావతి నిర్మాణాలు వాటంతట అవే ఆగిపోతాయని ఎద్దేవా చేశారు. “నెల రోజులు ఆగండి.. నాలుగు చినుకులు పడితే అమరావతి అదే ఆగిపోతుంది.“ అన్నారు. ఇక, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యు రాలు రేణుకా చౌదరిపైనా పేర్నినాని వ్యాఖ్యలు చేశారు.
“పసుపు రక్తం ప్రవహిస్తున్న సంస్కారం లేని మృగాలు మొరుగుతున్నాయి“ అని అన్నారు. ఇటీవల ఆమె పార్లమెంటులో అమరావతిపై చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. దీనికి కౌంటర్‌గా గతంలో జగన్ చేసిన వ్యాఖ్యలనే తాను అన్నానన్న రేణుల వ్యాఖ్యలపై పేర్ని ఆగ్రహం వ్యక్తం చేశారు.