hyderabadupdates.com Gallery ప్రధానిని క‌లుస్తాం ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తాం

ప్రధానిని క‌లుస్తాం ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తాం

ప్రధానిని క‌లుస్తాం ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తాం post thumbnail image

అమరావతి : ఈ నెల 16, 17, 18 తేదీల్లో పార్లమెంట్ లో మహిళా బిల్లు ప్రవేశ పెట్టనున్న నేపథ్యంలో రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు. గురువారం సాయంత్రం 4.30 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో ఢిల్లీకి బయలు దేరనున్నారు. మంత్రి సవితతో పాటు మహిళా మంత్రులు వంగలపూడి అనిత, సంధ్యరాణి సహా పలువురు మహిళా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ మేరకు ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించిదగిన విషయం మహిళా బిల్లు ఆమోదమన్నారు. మహిళలకు చట్టసభల్లో ప్రాతినిథ్యం కల్పించడం ద్వారా భారత ప్రజాస్వామ్యం మరింత ధృడంగా మారుతుందన్నారు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రధాని నరేంద్ర మోడి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై ఆమె ఆనందం వ్యక్తంచేశారు.
మహిళల అభివృద్దితోనే సమాజాభివృద్ధి సాధ్య‌మ‌వుతుంద‌ని ఎస్ . స‌విత‌ అభిప్రాయపడ్డారు. మహిళా బిల్లుతో రాజకీయాల్లో మహిళల పాత్ర పెరిగి, సాధికారతకు బలమైన పునాది పడుతుందన్నారు. ప్రధాని నరేంద్ర మోడికి, కేంద్ర ప్రభుత్వానికి మంత్రి సవిత ధన్యవాదాలు తెలియజేశారు. పార్లమెంట్ ఉభయ సభల్లోనూ బిల్లు ప్రవేశం సందర్భంగా జరిగే చర్చను వీక్షించనున్నట్లు వెల్లడించారు. అనంతరం ఈ నెల 18న ప్రధానమంత్రి నరేంద్ర మోడిని, ఇతర కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి ధన్యవాదాలు తెలియ జేయనున్నట్లు తెలిపారు. మహిళా బిల్లుకు ఏపీలోని సీఎ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం పూర్తి మద్దతు తెలియ జేస్తున్నట్లు ప్ర‌క‌టించారు.
The post ప్రధానిని క‌లుస్తాం ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్సంజు సామ్సన్ ,అక్షర్ పటేల్ పై సితాన్షు కోటక్ కామెంట్స్

చెన్నై : ఐసీసీ టోర్న‌మెంట్ లో భాగంగా అత్యంత కీల‌క‌మైన మ్యాచ్ రేపు జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే భార‌త్, జింబాబ్వే జ‌ట్లు ఎవ‌రికి వారే ధీమాను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ఇప్ప‌టికే తీవ్ర నిరాశ‌కు గురి చేశారు అభిషేక్ శ‌ర్మ‌, ఇత‌ర

న‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డిన‌ల్ల‌గొండ‌ను స్మార్ట్ సిటీగా మారుస్తా : కోమ‌టిరెడ్డి

న‌ల్ల‌గొండ జిల్లా : రాష్ట్ర రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. మున్సిప‌ల్ , మేయ‌ర్ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎత్తున విజ‌యాన్ని చేకూర్చి పెట్టార‌ని అన్నారు. మంగ‌ళ‌వారం ఆయ‌న న‌ల్ల‌గొండ ప‌ట్ట‌ణంలో

మత్స్యకారుల కోసం అంకితభావంతో పని చేయాలిమత్స్యకారుల కోసం అంకితభావంతో పని చేయాలి

అమ‌రావ‌తి : మ‌త్స్య‌కారుల సంక్షేమం కోసం అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారుల సహకార సంఘాల సమాఖ్య లిమిటెడ్‌కు నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ , కమిటీ సభ్యులు