hyderabadupdates.com Gallery పార్టీ బలోపేతం కోసం కష్టపడతా : నారా లోకేష్‌

పార్టీ బలోపేతం కోసం కష్టపడతా : నారా లోకేష్‌

పార్టీ బలోపేతం కోసం కష్టపడతా : నారా లోకేష్‌ post thumbnail image

చంద్రగిరి: తెలుగుదేశం పార్టీ అధిష్టానం నాకు ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నాన‌ని, పార్టీ బలోపేతం కోసం శాయశక్తులా కష్టపడతాన‌ని , శక్తివంచన లేకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికైన నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో మంత్రి లోకేష్ మాట్లాడారు. నాకు ఈ అవకాశం రావడానికి కారణమైన కార్యకర్తలందరికీ పేరుపేరునా కృతజ్జతలు తెలియ చేసుకుంటున్న‌ట్లు చెప్పారు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటాన‌ని స్ప‌ష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎంపికైన యువనేత లోకేష్ తొలిసారిగా తమ ప్రాంతానికి రావడంతో చంద్రగిరి నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పూలమాలలతో ముంచెత్తారు.
ప్రత్యర్థులు బెదిరించినా భ‌య‌ప‌డ‌కుండా తొడగొట్టి ఎన్నికల బరిలో నిలబడిన అంజిరెడ్డి తాత, ప్రాణం పోతున్నా ప్రత్యర్థి పేరు త‌న నోట ప‌ల‌క‌ని తోట చంద్రయ్య, రక్త మోడుతున్నా పోలింగ్ బూతులో కూర్చున్న మంజులారెడ్డి నాకు స్పూర్తి. మీ అందరి త్యాగాల వల్లే 94 శాతం సీట్లతో ఈరోజు మేమంతా ఇక్కడ కూర్చున్నాం అన్నారు నారా లోకేష్‌. ప్రజలు, కార్యకర్తలపై తప్పుడు కేసులు బనాయించి, ఇబ్బంది పెట్టిన వారిపై చర్యలుంటాయని పాదయాత్రలో చెప్పాన‌ని అన్నారు. అదే ఇప్పుడు చేస్తున్నాం అన్నారు. మేం వారి మాదిరిగా రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయడం లేదన్నారు. అభంశుభం తెలియని అమర్నాథ్ గౌడ్, అబ్ధుల్ సలాం, తోట చంద్రయ్య వంటి వారిని నిర్ధాక్షిణ్యంగా పొట్టన బెట్టుకున్నారని వాపోయారు. దోషులపై చట్టపరిధిలో చర్యలు తీసుకుంటున్నాం అన్నారు.
The post పార్టీ బలోపేతం కోసం కష్టపడతా : నారా లోకేష్‌ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లుఏటా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు

శ్రీ సత్యసాయి జిల్లా : బాబుతోనే జాబు గ్యారంటీ అనే నినాదాన్ని నిజం చేస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను జగన్ మోసం

జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్జూదం, పందెం భోగి మంటల్లో కాలాలి : ప‌వ‌న్ క‌ళ్యాణ్

అమ‌రావ‌తి : తెలుగు లోగిళ్లను వెలుగు వాకిళ్లుగా మార్చే ముచ్చటైన పండగ సంక్రాంతి అని అన్నారు డిప్యూటీ సీఎం ప‌వన్ క‌ళ్యాణ్. మట్టిని నమ్మిన ప్రతి ఒక్కరు మతాలకు అతీతంగా కేరళలో ఓనం పండుగను ఎలా జరుపుకుంటారో అదే విధంగా మన

Menstrual Leave: కర్ణాటక లో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవుMenstrual Leave: కర్ణాటక లో మహిళా ఉద్యోగులకు నెలసరి సెలవు

Menstrual Leave : మహిళా ఉద్యోగుల విషయంలో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలకు ఒక రోజు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని రాష్ట్ర క్యాబినెట్‌ సమావేశంలో నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగినులతో పాటు వస్త్రపరిశ్రమ, బహుళజాతి సంస్థలు, ఐటీ