hyderabadupdates.com movies ‘మామిడి’ మోసం… ఇదిగో హెచ్చరిక

‘మామిడి’ మోసం… ఇదిగో హెచ్చరిక

వేసవి వచ్చిందంటే చాలు.. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అంతా మామిడి పండ్ల కోసమే ఎదురుచూస్తారు. ఒకప్పుడు వేసవి సెలవుల్లో ఆ పండును రుచి చూడటమే ఒక అద్భుతమైన అనుభూతి. కానీ కాలం మారింది, ఆ తీపి జ్ఞాపకాల స్థానంలో ఇప్పుడు కల్తీ భయాలు మొదలయ్యాయి. ఇటీవల పుణెలో వెలుగుచూసిన 3,800 కిలోల కల్తీ మామిడి గుజ్జు ఉదంతం చూస్తుంటే, పండ్ల రాజా మామిడిని కూడా వ్యాపారులు ఎలా విషతుల్యం చేస్తున్నారో అర్థమవుతోంది. కేవలం రంగు కోసం నిషేధిత రసాయనాలను వాడుతున్న తీరు సామాన్యులను బెంబేలెత్తిస్తోంది.

పుణెలో పట్టుబడిన గుజ్జులో అనుమతి లేని కృత్రిమ రంగులను విచ్చలవిడిగా కలిపి మార్కెట్లోకి వదలడానికి సిద్ధం చేశారు. అక్కడ తయారైన ఈ రంగుల గుజ్జుతో ఐస్ క్రీములు, జ్యూస్ సెంటర్లు, స్వీట్ షాపుల అవసరాలను తీరుస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా వేసవి వచ్చిందంటే జ్యూస్ సెంటర్లు కిటకిటలాడుతుంటాయి. మామిడి పండ్లతో చేసే షేక్స్, పుడ్డింగ్స్ వంటివి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. కానీ మనం ఇష్టంగా తినే ఆ పదార్థంలో వాడే గుజ్జు స్వచ్ఛమైనదేనా లేక పుణెలో దొరికినట్లుగా రంగులు పూసిన రసాయనమా అనేది ఒక పెద్ద ప్రశ్న.

ఒకప్పుడు మామిడి పండును చూస్తే వచ్చే ఆ సహజమైన సువాసన ఇప్పుడు మార్కెట్‌లో కనుమరుగైంది. ఇప్పుడు దుకాణాల్లో చూస్తే అన్నీ మిలమిల మెరిసిపోతూ, కంటికి ఆకట్టుకునేలా కనిపిస్తున్నాయి. కార్బైడ్ లాంటి ప్రమాదకరమైన కెమికల్స్‌తో పళ్లను బలవంతంగా పండించి, తోలు పచ్చగా కనిపించేలా మాయ చేస్తున్నారు. పండు పైన పచ్చగా ఉన్నా, లోపల మాత్రం ఇంకా పచ్చిగానే ఉండటం మనందరికీ అనుభవమే. కేవలం రంగు, ఆకృతి కోసం చేసే ఈ ప్రయోగాలు సామాన్యుల ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నాయి.

సాధారణంగా లాభాల కోసం అక్రమ వ్యాపారులు మామిడి గుజ్జులో చక్కెర పాకాన్ని, సింథటిక్ రంగులను, కృత్రిమ ఫ్లేవర్లను కలుపుతుంటారు. ఇది కేవలం గొంతు రుచికే తప్ప, ఆరోగ్యానికి మాత్రం చేటు చేస్తుంది. మన దగ్గర కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేస్తున్నా, రాత్రికి రాత్రే పళ్లను పండించే దందా మాత్రం ఆగడం లేదు. ముఖ్యంగా జ్యూస్ సెంటర్లు, రోడ్డు పక్కన అమ్మే మామిడి పానీయాల విషయంలో వినియోగదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది.

Related Post

Venky’s Stylish First Look Revealed as Chiranjeevi Wishes Him on BirthdayVenky’s Stylish First Look Revealed as Chiranjeevi Wishes Him on Birthday

Megastar Chiranjeevi’s upcoming mass-and-family entertainer Mana Shankara Vara Prasad Garu continues to build strong buzz, with the makers unveiling Victory Venkatesh’s sophisticated first look on the occasion of his birthday.