hyderabadupdates.com Gallery బాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎం

బాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎం

బాయిల్డ్ రైస్ ను  కేంద్రం సేక‌రించాలి : సీఎం post thumbnail image

న్యూఢిల్లీ : ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో బిజీగా ఉన్నారు ముఖ్య‌మంత్రి అనుముల రేవంత్ రెడ్డి. ఆయ‌న‌తో పాటు మంత్రులు, ఉన్న‌తాధికారులు కూడాఉన్నారు. ఈ సంద‌ర్బంగా కేంద్ర మంత్రి శ్రీ ప్ర‌హ్లాద్ జోషితో తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి భేటీ అయ్యారు సీఎం. రాష్ట్రంలో యాసంగి పంట‌కు సంబంధించి తెలంగాణ నుంచి 30 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల (ఎల్ఎంటీ) బాయిల్డ్ రైస్ సేక‌రించాల‌ని విజ్ఞప్తి చేశారు. దేశ వ్యాప్తంగా బాయిల్డ్ రైస్‌కు భారీ డిమాండ్ ఉన్నందున స‌ర‌ఫ‌రా పెంచాల‌ని ఇటీవ‌ల కేంద్ర‌ ఆహార, ప్రజా పంపిణీ విభాగం అధికారులు సూచించిన విష‌యాన్ని కేంద్ర మంత్రికి గుర్తు చేశారు.
బాయిల్డ్ రైస్ స‌ర‌ఫ‌రాకు సంబంధించి త‌మ‌ ప్రతిపాదనకు కేంద్ర మంత్రి జోషి సూత్ర‌ప్రాయంగా ఆమోదం తెలిపారని అన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. 2014-15 వ‌ర్షాకాలం పంట అద‌న‌పు లెవీ సేక‌ర‌ణ‌కు సంబంధించిన రూ.1,468.94 కోట్ల బ‌కాయిల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని కేంద్ర మంత్రిని కోర‌వ‌డం జ‌రిగింద‌ని చెప్పారు . పిల్లల్లో ర‌క్తహీన‌త‌, పోష‌క లోపాల‌ నివార‌ణ‌ కోసం పోష‌కాహార బియ్యాన్ని (FRK) పాఠ‌శాల‌లు, వ‌స‌తి గృహాలు, ఐసీడీఎస్‌ల ప‌రిధిలో పంపిణీ చేసే వార‌ని వెల్ల‌డించారు. అయితే ఇటీవ‌ల దానిని నిలిపి వేసినందున తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న‌ట్లు తెలిపారు రేవంత్ రెడ్డి. వెంట‌నే పునః ప్రారంభించాల‌ని కేంద్ర మంత్రి ప్ర‌హ్లాద్ జోషిని కోరామ‌న్నారు. ఇందుకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు.
The post బాయిల్డ్ రైస్ ను కేంద్రం సేక‌రించాలి : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

స్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యంస్వర్ణ కుప్పం సాకారం సీఎం చంద్ర‌బాబు లక్ష్యం

కుప్పం : స్వర్ణ కుప్పం లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభవృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి స్పష్టం చేశారు. కుప్పం నియోజకవర్గంలో నాలుగు రోజుల పర్యటనలో భాగంగా 2వ రోజు పలు

ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరుగార్చిన మోదీ స‌ర్కార్ఉపాధి హామీ ప‌థ‌కాన్ని నీరుగార్చిన మోదీ స‌ర్కార్

అమ‌రావ‌తి : మోదీ స‌ర్కార్ నిర్వాకంపై , అనుస‌రిస్తున్న విధానాల‌పై నిప్పులు చెరిగారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్ట ( MGNREGA) పరిరక్షణ యాత్ర 6 వ రోజు శ‌నివారం

జగ్జీవ‌న్ రాం అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయంజగ్జీవ‌న్ రాం అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయం

అమ‌రావ‌తి : దివంగ‌త‌, మాజీ ఉప ప్ర‌ధాన‌మంత్రి బాబు జ‌గ్జీవ‌న్ రామ్ దేశానికి అందించిన సేవ‌లు ప్ర‌శంస‌నీయ‌మ‌ని అన్నారు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు.బాబూ జగజ్జీవన్ రామ్ 118వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులు