hyderabadupdates.com movies హాట్ టాపిక్… టాక్సిక్ వచ్చినా పెద్ది ఆగడా

హాట్ టాపిక్… టాక్సిక్ వచ్చినా పెద్ది ఆగడా

జూన్ 4 విడుదల తేదీని ఎప్పుడో లాక్ చేసుకున్న టాక్సిక్ మళ్ళీ వాయిదా పడుతుందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా తిరుగుతోంది. టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాక పోవడం, దీనికన్నా ముందే యష్ రామాయణ ప్రమోషన్లలో దిగడం లాంటి పరిణామాలు అనుమానాలను మరింత బలపడేలా చేస్తున్నాయి. పైగా కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించిన మరో సినిమా కెడి ది డెవిల్ ఏప్రిల్ 30 రిలీజ్ కావాల్సి ఉండగా దాని పబ్లిసిటీ ఇంకా మొదలుపెట్టకపోవడం ఇంకో ట్విస్టు.

ఇదంతా ఎలా ఉన్నా టాక్సిక్ వచ్చినా రాకపోయినా జూన్ 4 పెద్ది విడుదల చేయాలని దాదాపుగా నిర్ణయించినట్టు అంతర్గత వర్గాల సమాచారం. ఒకవేళ టాక్సిక్ మాట మీద ఉండే పక్షంలో దానితో నేరుగా క్లాష్ అయినా పర్వాలేదనే తరహాలో ప్లాన్ చేస్తునట్టుగా తెలిసింది. టాక్సిక్ ఏపీ తెలంగాణ హక్కులు దిల్ రాజు తీసుకున్న సంగతి తెలిసిందే. పెద్దిలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ భాగస్వామిగా ఉంది. సో క్లాష్ కన్ఫర్మ్ అయితే పోటీ రసవత్తరంగా ఉంటుంది.

ఒకవేళ టాక్సిక్, పెద్ది పరస్పరం తలపడితే ఎవరికి ఎక్కువ రిస్కో చూద్దాం. తెలుగు రాష్ట్రాల వరకు చూసుకుంటే రామ్ చరణ్ ఇమేజ్, పెద్ది మీద ముందు నుంచి నెలకొన్న క్రేజ్, మెగా ఫ్యాన్స్ పెట్టుకున్న అంచనాలు చాలా పాజిటివ్ గా పని చేస్తాయి. అటు బాలీవుడ్ లో రెహమాన్ పాటలు ముందుగానే చొచ్చుకుపోయాయి. ట్రైలర్ వచ్చాక హైప్ పుష్ప రేంజ్ లో ఉంటుందని ఆల్రెడీ టాక్ ఉంది. సో ఎంత లేట్ అయినా ఎన్ని వాయిదాలు పడినా పెద్ది బజ్ కొచ్చిన చిక్కేమి లేదనేది స్పష్టం.

కానీ టాక్సిక్ కు ఇన్ని సానుకూలతలు లేవు. టీజర్ కు మిశ్రమ స్పందన దక్కింది. రిలీజ్ చేసిన మెలోడీ సాంగ్ విజువల్స్ లేకుండా కేవలం లిరిక్స్ తో వచ్చి మూవీ లవర్స్ ని తప్ప సామాన్య ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. కెజిఎఫ్ తో యష్ కి ఇండియా వైడ్ మార్కెట్ వచ్చిన మాట వాస్తవమే కానీ టాక్సిక్ కి మళ్ళీ ప్రత్యేకంగా పబ్లిసిటీ చేసుకోవాలి. పెద్ది వల్ల కర్ణాటక తప్ప ఇతర చోట్ల టఫ్ కాంపిటీషన్ ఉంటుంది. చూడాలి జూన్ 4 ఎవరో ఒకరు వస్తారా లేక ఇద్దరూ తలపడతారా.

Related Post

Puri Jagannadh–Vijay Sethupathi film’s title & teaser release postponed
Puri Jagannadh–Vijay Sethupathi film’s title & teaser release postponed

In the wake of the devastating Karur tragedy, the team of the upcoming pan-Indian film starring Vijay Sethupathi and directed by Puri Jagannadh has postponed their title and teaser launch

6 Malayalam Films Expected to Release for Summer 2026: Mohanlal’s Drishyam 3 to Mammootty’s Patriot6 Malayalam Films Expected to Release for Summer 2026: Mohanlal’s Drishyam 3 to Mammootty’s Patriot

Cast: Mammootty, Mohanlal, Fahadh Faasil, Nayanthara, Kunchacko Boban, Darshana Rajendran, Revathi Director: Mahesh Narayanan Genre: Spy Action Drama Patriot, starring Mammootty in the lead, is expected to release for Vishu