hyderabadupdates.com Gallery అగ్ని మాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

అగ్ని మాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి

అగ్ని మాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి post thumbnail image

విశాఖ‌ప‌ట్నం జిల్లా : రాష్ట్రంలో అగ్ని మాప‌క సిబ్బంది ప‌నితీరు అద్భుతంగా ఉందంటూ కితాబు ఇచ్చారు రాష్ట్ర హొం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. విశాఖ ఆర్కే బీచ్‌లో జరిగిన ‘జాతీయ అగ్నిమాపక వారోత్సవాల’ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అగ్నిమాపక సిబ్బంది నిర్వహించిన మెగా ఫైర్ సర్వీస్ డెమోను తిలకించారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో కూడా ప్రాణాలకు తెగించి ప్రజలను, ఆస్తులను కాపాడే అగ్నిమాపక సిబ్బంది సేవలు వెలకట్టలేనివి అని అన్నారు. హుద్ హుద్ సమయంలో, విజయవాడ వర‌ద‌ల సమయంలో ఎన్డీఆర్ఎఫ్‌, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందితో పాటు ఫైర్ సిబ్బంది శ్రమించిన తీరు ప్రజలు మర్చి పోలేరన్నారు. ఏప్రిల్ 14 నుండి 20 వరకు జరుగుతున్న ఈ వారోత్సవాల్లో భాగంగా, అగ్ని ప్రమాదాల నివారణలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు చేపట్టి వివరించ‌డం అద్భుత‌మ‌న్నారు మంత్రి అనిత వంగ‌ల‌పూడి.
2019 నుండి 2024 వరకు అగ్నిమాపక శాఖను పూర్తిగా నిర్లక్ష్యం చేసిన గత ప్రభుత్వానికి భిన్నంగా, మా ప్రభుత్వం ఈ శాఖకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ రూ. 232 కోట్ల నిధులతో అత్యాధునిక ఫైర్ వెహికల్స్‌ను కొనుగోలు చేసిందన్నారు. నారా చంద్ర‌బాబు నాయుడు స్వయంగా ప్రారంభించిన ఈ ఆధునిక వాహనాలు, డ్రోన్ టెక్నాలజీతో అగ్నిమాపక శాఖకు సరికొత్త శక్తిని ఇచ్చాయన్నారు. అత్యాధునిక పరికరాలను ఉపయోగిస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అగ్ని ప్రమాదాల నివారణకు తాము నిరంతరం కృషి చేస్తున్నామన్నారు అనిత వంగ‌ల‌పూడి. వారోత్సవాల్లోభాగంగా ఫైర్ సేఫ్టీ ప్రామాణికాలు పాటించిన వివిధ విభాగాలు వారిని సత్కరించు కోవడం జరిగింద‌న్నారు.
The post అగ్ని మాప‌క సిబ్బంది ప‌నితీరు భేష్ : అనిత వంగ‌ల‌పూడి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

బంగ్లాదేశ్ బ‌హిష్కర‌ణ పాకిస్తాన్ స‌మ‌ర్థ‌నబంగ్లాదేశ్ బ‌హిష్కర‌ణ పాకిస్తాన్ స‌మ‌ర్థ‌న

పాకిస్తాన్ : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హిస్తున్నాయి. ఈనెల 7 నుంచి వార్మ‌ప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ త‌రుణంలో తాము టీమిండియాతో

TG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసిందిTG Panchayat Elections: తెలంగాణాలో పంచాయితీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేసింది

    తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్‌ విడుదల అయింది. స్టేట్ ఎలక్షన్ కమిషన్ చీఫ్ రాణి కుమిదిని మంగళవారం సాయంత్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ‘తెలంగాణలో కోటి 66 లక్షలకు

క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్ షో రూమ్ సూప‌ర్ : శ్రీ‌లీల‌క‌ళ్యాణ్ జ్యువెల‌ర్స్ షో రూమ్ సూప‌ర్ : శ్రీ‌లీల‌

హైద‌రాబాద్ : న‌టి శ్రీ‌లీల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆమె క‌ళ్యాణ్ బంగారు ఆభ‌ర‌ణాల షో రూమ్ ను ఆదివారం మేడిప‌ల్లిలో ప్రారంభించారు. అంత‌కు ముందు భారీ ఎత్తున ఆమెను చూసేందుకు ఫ్యాన్స్ ఎగ‌బ‌డ్డారు. భారీ బందోబ‌స్తు మ‌ధ్య రిబ్బ‌న్ క‌ట్